న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ'. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. రీసెంట్‌గా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో నటించిన ప్రదీప్ కొట్టె ఈ మూవీలో తన జర్నీ విశేషాలని పంచుకున్నాడు.
'తిమ్మరాజు పల్లి టీవీ'లో నేను చేసిన రాజప్ప పాత్రకు ప్రశంసలు దక్కాయి. నాకు తొలి సినిమా, అవకాశం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఈ చిత్రంలోనే. ఇందులో సాయి తేజ్, లతీష్ ఇలా చాలామంది నటించిన పాత్రలు నాకు ఇష్టం. అందరూ సింగిల్ టేక్స్‌లోనే నటించారు. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మా అక్కకి తెలుసంతే. మా అమ్మనాన్నలకు చెప్పకుండా షూటింగ్‌కి తీసుకువచ్చింది మా అక్క. మా పేరెంట్స్‌ని అలా చూడటం, వారు నన్ను అలా చూడటం అదొక మెమరబుల్ మూమెంట్.


