ఓటీటీకి తిమ్మరాజుపల్లి టీవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Kiran abbavaram Producing Movie Thimmarajupalli TV Ott Releass date | Sakshi
Sakshi News home page

Thimmarajupalli TV: ఓటీటీకి తిమ్మరాజుపల్లి టీవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

May 7 2026 4:30 PM | Updated on May 7 2026 4:34 PM

Kiran abbavaram Producing Movie Thimmarajupalli TV Ott Releass date

టాలీవుడ్ హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అందరు కొత్తవాళ్లతో ఈ మూవీని తెరకెక్కించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో  కెమెరా అసిస్టెంట్‌ సాయితేజ్‌ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.

ఈ మూవీ కథేంటంటే..

ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్‌(సాయి తేజ్‌).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్‌ని రెంట్‌కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్‌ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్‌)కు సతీష్‌ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు.  ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్‌తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్‌ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు.

సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్‌ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్‌ సవాల్‌ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్‌ ఏం చేశాడు? సతీష్‌-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్‌ కీలపట్టు) వల్ల సతీష్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్‌ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement