నటి పలు సినిమాలు చేసినప్పటికీ యాంకర్‌గానే బాగా ఫేమస్ అయిన శ్రీముఖి మరో ఇల్లు కట్టుకుంది. ఆదివారం గృహప్రవేశం చేయగా అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. తమ్ముడితో కలిసి హోమం చేసి కొత్త ఇంట్లో పాలు పొంగించింది.
ఆరేళ్ల క్రితం సొంతూరు నిజమాబాద్‌లో ఇల్లు కట్టుకున్న శ్రీముఖి.. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు మరో ఇంటిని కూడా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. తన 33వ పుట్టినరోజు సందర్భంగా తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకుని గృహప్రవేశం చేసింది. అయితే శ్రీముఖి- ఈమె తమ్ముడు మాత్రమే ఈ వేడుకలో కనిపించారు.


అల్లు అర్జున్ 'జులాయి' సినిమాతో పాటు పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేసిన శ్రీముఖి.. బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. కానీ బయటకొచ్చిన తర్వాత పలు ఛానెళ్లలో షోలు చేస్తూ బిజీగానే ఉంది. మధ్యలో ఒకటి రెండు మూవీస్‌లో లీడ్ రోల్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. తెలుగులో సామెత ప్రకారం ఇల్లు అయితే కట్టుకుంది మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి?


