విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్ | Ashu Reddy Friend Bharath Kanth Passed Away | Sakshi
Sakshi News home page

Ashu Reddy: నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు

May 10 2026 7:45 PM | Updated on May 10 2026 7:45 PM

Ashu Reddy Friend Bharath Kanth Passed Away

రీసెంట్ టైంలో పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన నటి అషురెడ్డి.. ఇప్పుడు ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడని చెబుతూ అతడితో కలిసున్న ఫొటోలని పంచుకుని భావోద్వేగానికి గురైంది. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. నా గుండెల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావ్ అని రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి)

అషురెడ్డి స్నేహితుడైన భరత్ కాంత్ కూడా నటుడే. కాకపోతే షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా చేస్తున్నాడు. రీసెంట్‌గా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతడితో పాటు మరో అబ్బాయి కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. అషురెడ్డితో పాటు బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ తదితరులు కూడా భరత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు.

అషురెడ్డి విషయానికొస్తే కొన్నేళ్లుగా ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని ఇవ్వలేదని ఆరోపిస్తూ ధర్మేంద్ర తండ్రి అషుపై హైదరాబాద్ సీసీఎస్‌లో చీటింగ్ కేసు పెట్టారు. ప్రస్తుతం ఇది విచారణ సాగుతోంది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని అషు.. తెలంగాణ హైకోర్టుని కూడా ఆశ్రయించింది. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా అషు, తన కుటుంబంతో పాటు సోమవారం విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.

(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement