మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్‌! | Delhi Content Creator Sells Maggi In Mountains For A Day Surprise Earnings | Sakshi
Sakshi News home page

మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్‌!

May 14 2026 12:53 PM | Updated on May 14 2026 1:00 PM

Delhi Content Creator Sells Maggi In Mountains For A Day Surprise Earnings

కంటెంట్‌, క్రియేటివిటీ ఉండాలేగానీ  కొండల్లో కూడా మ్యాగీ అమ్మవచ్చు.  భారీ ఆదాయాన్ని సంపాదించ వచ్చు.  ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి సక్సెస్‌ స్టోరీ తెలిస్తే మీరు కూడా ఔరా అంటారు. అసలేం జరిగిందంటే..

కొండ ప్రాంతం.. చల్ల చల్లని గాలులు. అలాంటి టప్పుడు వేడి వేడిగా ఏదైనా తినడానికి  దొరికతే, అదీ  మ్యాగీ అయితే. ఇంకేముంది అద్భుతమైన కాంబినేషన్‌తో పర్యాటకులకు  పండగే. ఈ ఆలోచననే క్యాష్ చేసుకున్నాడు. అలా అతని ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాలెంజింగ్‌ వీడియోలు చేసే దేవాన్ష్ త్యాగి అనే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్, కొండ ప్రాంతాలలో మ్యాగీ అమ్మితే ఒక రోజులో ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవాల నుకున్నాడు. అంతే క్షణ కోసం ఆలస్యం చేయ లేదు. చక్కటి లొకేషన్‌ను ఎంచుకున్నాడు. అక్కడ తాత్కాలికంగా ఒక బుల్లి కిచెన్ ఏర్పాటు చేశాడు. ‘‘కొండల్లో మ్యాగీ అమ్మి నేను ఎంత సంపాదించగలనో చూద్దాం" అంటూ ఒక వీడియో చేశాడు. కస్టమర్ల కోసం టేబుళ్లు, ప్లాస్టిక్ కుర్చీలతో స్టాల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

అలా దేవాన్ష్ తన స్టాల్‌లో రెండు రకాల మ్యాగీలను విక్రయించాడు. సాధారణ మ్యాగీ ప్లేటు రూ. 100, బటర్ మ్యాగీ ప్లేటు రూ. 120 ఇలా రెండు రకాలు అందించాడు. అంతే పర్యాటకులు, హైకర్లు మ్యాగీ లవర్స్‌ ఎగబడ్డారు. ఆ కొండాకోనల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వేడి వేడి మ్యాగీని ఆరగించడం ఈ వీడియోలో చూడవచ్చు. చూస్తుండగానే స్టాక్ అంతా అయిపోయింది. మొత్తానికి ఒక రోజులో  దేవాన్ష్  సంపాదన  అక్షరాలా రూ. 24 వేలు. కేవలం ఒక్క రోజులో ఇంత మొత్తం సంపాదించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియోకు 4.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేద్దామా?: "మేము కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు మానేసి కొండల్లో మ్యాగీ కొట్టు పెట్టుకుంటాం" అని కొందరు సరదాగా కామెంట్ చేశారు. ఆ స్టాల్‌లో పనిచేయడానికి ఇంటర్న్స్‌ కావాలా? అని మరికొందరు తమాషాగా అడిగారు.

అయితే, కొందరు నెటిజన్లు ఇక్కడ ఒక పాయింట్ లేవనెత్తారు. ఈ రూ. 24,000 అనేది కేవలం వచ్చిన ఆదాయం (Gross Revenue) మాత్రమేనని, అందులో ముడి పదార్థాలు, గ్యాస్, రవాణా ఖర్చులు తీసేస్తే నికర లాభం ఎంతో చెప్పాలని కోరారు. ఒక నెటిజన్ మాత్రం, "వంట చేయడానికి వాగు నీటిని వాడటం బాలేదు" అని విమర్శించారు. ఈ వైరల్  క్లిప్ ఆన్‌లైన్‌లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌లో చర్చను ఆసక్తికరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement