రాజకీయ నాయకుల డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడేటప్పుడు “ఖద్దరు చొక్కా” అనేది ఒక సింబల్‌లా భావిస్తారు. అయితే రాను రాను అందులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ వారి ప్రాంతీయ సంస్కృతి, వ్యక్తిత్వం, రాజకీయ ఇమేజ్‌ను ప్రతిబింబించేలా చూసుకుంటున్నారు. ఖద్దరు చొక్కా నుంచి మోడర్న్ బ్లేజర్ వరకు.. వివిధ సీఎంల డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా ఉందంటే..
కేరళ నూతన సీఎం వీడీ సతీశన్.. తెల్లటి కాటన్ షర్ట్, ముండు(ధోతి)తో సింపుల్ లుక్. (Kerala CM VD sateeshan)
తమిళనాడు సీఎం విజయ్ కార్పొరేట్ స్టైల్‌లో.. యూత్‌కు కనెక్ట్ అయ్యేందుకు సూటు. (Tamil Nadu CM Vijay)
పుదుచ్చేరి సీఎం రంగస్వామి.. సంప్రదాయ ధోతి, మోచేతి కింద దాకా హాఫ్ షర్ట్‌తో క్లాసిక్ లుక్. (Puducherry CM Rangaswamy)
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి.. తెల్లటి లాంగ్ కుర్తా, పైజామా. (West Bengal CM Suvendu Adhikari)
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. లైట్ కలర్ కుర్తా, ధోవతి.. భుజంపై కండువా. (Karnataka CM Siddaramaiah)
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కుర్తా, జాకెట్‌తో నార్త్‌ఈస్ట్ టచ్. (Assam CM Himanta Biswa Sarma)
బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి.. కుర్తా-పజామా, నెహ్రూ జాకెట్‌తో సంప్రదాయ-మోడర్న్ మిక్స్.. పైన మెడలో కాషాయ కండువా. (Bihar CM Samrat Choudhary)
రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ.. సఫారీ సూట్, మెడలో చారల కండువా.. రాజస్థానీ పాగడీతో డెజర్ట్ స్టైల్. (Rajasthan CM Bhajan Lal Sharma)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెల్లటి ఫుల్ షర్ట్, బ్లాక్ ప్యాంట్. (Telangana CM Revanth Reddy)
గోవా సీఎం ప్రమోద్ సావంత్.. ఫార్మల్ షర్ట్, ప్యాంట్‌తో బీచ్ స్టేట్ సింప్లిసిటీ (Goa CM Pramod Sawant)
మేఘాలయా సీఎం కర్నాడ్ సంగ్మా.. సూట్, అదనంగా మెడలో టైతో కార్పొరేట్ లీడర్ లుక్ (Meghalaya CM Conrad Sangma)
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. కాషాయ వస్త్రధారణ, ఆధ్యాత్మిక-రాజకీయ మేళవింపు (UP CM Yogi Adityanath)
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. కుర్తా, జాకెట్‌తో సంప్రదాయ-ఫార్మల్ కలయిక (Madhya Pradesh CM Mohan Yadav)


