breaking news
Bhajan Lal Sharma
-
బీజేపీకి లోకల్ దెబ్బ.. సీఎం ఇలాకాలోనూ ఓటమి!
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీలో కొత్త చర్చకు తెరతీశాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేసిన పార్టీకి.. కీలక నేతల సొంత ప్రాంతాల్లోనే ఓటర్లు గట్టి సంకేతం ఇచ్చారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్, కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారంలో సీఎం స్వయంగా రోడ్‌షోలు నిర్వహించినప్పటికీ.. ఆ ప్రభావం ఫలితాల్లో పూర్తిగా కనిపించలేదు. మొత్తం 65 వార్డులున్న భరత్పూర్ నగర పాలక సంస్థలో బీజేపీ కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఏడు స్థానాలు గెలుచుకోగా.. ఏకంగా 36 వార్డులను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలంటే బీజేపీకి స్వతంత్రుల మద్దతు తప్పనిసరి కానుంది. అధ్యక్షుడి ఇలాకాలోనూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్ సొంత జిల్లా పాలీలోనూ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మొత్తం 65 వార్డుల్లో కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 21 స్థానాల వద్దే ఆగిపోయింది. మరో 15 స్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. బోర్డు ఏర్పాటుకు 34 స్థానాలు అవసరం కావడంతో.. ఇక్కడ కూడా స్వతంత్రులే కీలకం కానున్నారు.వసుంధర గడ్డలో కాంగ్రెస్ జెండా..మాజీ సీఎం వసుంధర రాజే ప్రభావం బలంగా ఉన్న ఝలావార్‌లో బీజేపీకి మరింత పెద్ద షాక్ తగిలింది. ఝలావార్ మున్సిపల్ కౌన్సిల్‌లోని 45 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 29 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. దీంతో అక్కడ బీజేపీ అధికారం కోల్పోయింది. వసుంధర ప్రభావం ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించడం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.భూపేంద్ర యాదవ్ ప్రాంతంలోనూ..కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అల్వార్ ప్రాంతంలోనూ బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. మొత్తం 65 వార్డుల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 23 సీట్లు దక్కించుకుంది. మరో 13 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఒక స్థానాన్ని బీఎస్పీ గెలుచుకుంది. దీంతో ఇక్కడ కూడా బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించలేదు.జోధ్‌పూర్‌లో హోరాహోరీ..ఇటు జోధ్‌పూర్‌లోనూ బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. 100 వార్డులున్న నగర పాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 44 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 11 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో బోర్డు ఏర్పాటులో స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది.బికనీర్‌లో కాంగ్రెస్ దూకుడుకేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న బికనీర్ బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం 80 వార్డుల్లో కాంగ్రెస్ 42 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీజేపీ 27 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు బోర్డు ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా పోయింది.2028కి ముందు హెచ్చరికేనా?రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 4,179 వార్డులు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 3,613, స్వతంత్రులు 2,273 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్, ఇండిపెండెంట్ల బలం స్పష్టంగా కనిపించింది. అయితే భరత్పూర్, పాలి, ఝలావార్, అల్వార్, జోధ్‌పూర్, బికనీర్ వంటి కీలక ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికగా మారాయి. ముఖ్యంగా సీఎం నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి వరకు కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీకి స్పష్టమైన ఆధిపత్యం దక్కకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఈ ఫలితాలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: షాకింగ్.. రైల్వే స్టేషన్లలో రైల్వే వాళ్లు ఇచ్చే నీళ్లు ఎలాంటివో తెలుసా? -
పొలిటికల్ స్టైల్ షో.. ఈ అదిరే లుక్స్ చూశారా?..
-
రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసీ రాజస్థానీయులు భాగస్వాములు
హైదరాబాద్ : ప్రవాసీ రాజస్థానీలు ఎక్కడికి వెళ్ళినా వారి సంస్కృతి, ఆలోచనలు , రాజస్థానీ మట్టి పరిమళాన్ని వ్యాప్తి చేస్తారని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాసీ రాజస్థానీలు తమ వృత్తులలో రాణించడమే కాకుండా సామాజిక కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం అపూర్వమైన కార్యక్రమాలను చేపట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపరిమిత అవకాశాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ప్రవాసీ రాజస్థానీలకు విజ్ఞప్తి చేశారు, ఇది కొత్త మరియు అభివృద్ధి చెందిన రాజస్థాన్ సృష్టికి దారితీస్తుందని ఆకాంక్షించారు.హైదరాబాద్‌లో జరిగిన ప్రవాసీ రాజస్థానీ సమావేశంలో భజనలాల్ ప్రసంగిస్తూ, రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024 సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ప్రవాసీ రాజస్థానీ దివస్‌ను జరుపుకోవాలని ప్రకటించింది. దీనికి అనుగుణంగా, 2025 డిసెంబర్ 10న జైపూర్‌లో మొదటి ప్రవాసీ రాజస్థానీ దివస్ నిర్వహించబడుతుందంటూ, ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ప్రవాసీ రాజస్థానీయులకు పిలుపునిచ్చారు. -
ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చివరి నాలుగు రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారం, దీంతో ముడిపడిన అంశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో.. అప్పట్లోగా చేపట్టే ప్రచారం, ఇప్పటివరకు నిర్వహించిన ప్రచార సరళి, ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలి, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ప్రస్తావించాల్సిన అంశాలు, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని దు్రష్పచారం జరిగితే ఎలా ఖండించాలి అన్న వాటిపై కీలక నేతలు సమీక్షించారు. శనివారం లోగా పోలింగ్‌బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చి ఓటర్లను వారి ఇళ్లల్లో కలుసుకునేలా కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగు రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, మీడియా కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోశ్, ఎలక్షన్ కమిటీ చైర్మన్ డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మీడియా, సోషల్ మీడియా కమిటీల భేటీలో... వీరితో పాటు రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ప్రేంసింగ్ రాథోడ్, డా.ఎస్.ప్రకాష్ రెడ్డి, పోరెడ్డి కిశోర్ రెడ్డి, రచనా రెడ్డి, పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిలు పాల్గొన్నారు.అలాంటి దు్రష్పచారం మళ్లీ జరగొద్దు.. ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీల అమలు నెరవేర్చకపోవడం వంటి వాటిని ఎండగట్టడంతో పాటు... రిజర్వేషన్ల రద్దు, ఇతర అంశాలపై కొన్నిరోజులుగా బీజేపీపై చేస్తున్న దు్రష్పచారాన్ని మరింత సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ సూచించారు. తెలంగాణలోని కొన్ని మీడియా సంస్థలు (సాక్షి కాదు) బీజేపీ పట్ల ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయని, పారీ్టకి నష్టం కలిగించే దిశలో ఇతర పారీ్టల ప్రచారానికి ఊతమిస్తున్నాయని సంతోష్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక పత్రికలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దుష్యంత్ కుమార్ చౌహాన్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి, తప్పుడు ప్రచారానికి దోహదపడేలా వార్త ప్రచురించారని ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. చివరి నాలుగు రోజులూ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు పారీ్టవర్గాల సమాచారం.


