ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు. అమ్మ గొప్పతనం, త్యాగం గురించి ప్రస్తావించారు. అమ్మ… మన మొదటి గురువు.. మన మొదటి ధైర్యం.. కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే అంటూ అమ్మపై ప్రేమ చాటుకున్నారు. మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మదేనన్నారు. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. తెలిపారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి దిగిన అరుదైన ఫోటోలను షేర్ చేశారు.
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాబీతో జతకట్టారు. వీరిద్దరు కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య మూవీ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో భారీ హిట్ అందుకున్న చిరు.. బాబీతో కలిసి పనిచేయనున్నారు. ఈ మూవీని మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ పెడతారని ప్రచారం నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
అమ్మ…
మన మొదటి గురువు,
మన మొదటి ధైర్యం,
కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…!
మన విజయాల వెనక త్యాగం…
మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.
మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Happy… pic.twitter.com/SJ1AchhEPz— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2026


