పవన్ కల్యాణ్ 'పురుషః' రిలీజ్‌కి రెడీ | Purusha Movie Telugu Release Date | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ 'పురుషః' రిలీజ్‌కి రెడీ

May 10 2026 8:50 PM | Updated on May 10 2026 8:50 PM

Purusha Movie Telugu Release Date

పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'పురుషః'. బత్తుల కోటేశ్వరరావు నిర్మించగా వీరు వులవల దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలు చేశారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 22న థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'పురుష:' కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను ఇలా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి మా నాన్న గారే కారణం. అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నాడు. ఇక దర్శకుడు వీరు మాట్లాడుతూ .. మళ్లీరావా, జెర్సీ, మసూద సినిమాలకు పనిచేశాను. నేను ఈ కథని ఎలా అనుకున్నానో అలానే తీశాను. వేసవి కానుకగా మా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement