breaking news
Purushaha Movie
-
సత్యానంద్ శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటా: పవన్ కల్యాణ్
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’ ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. నేను సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదు. ఒక వేళ నా నేను బాగా నటించకపోతే మీ పేరుకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తోంది. అందుకే ఈ రోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదంతా వీరు గారి వల్లే సాధ్యమైంది. ప్రీమియర్ల నుంచీ మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మూవీని చూసి నాలోని ప్లస్, మైనస్‌లు చెప్పండి. మైనస్‌లు చెబితే వాటిని నేను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. మా సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చూడనివారు మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని, మా కష్టాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాను ఇంతటి స్థాయికి తీసుకు వెళ్లిన మీడియాకి థాంక్స్. ముగ్గురు హీరోయిన్లు చక్కగా నటించారు. వీరు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరామెన్ సతీష్ గారు మంచి వ్యక్తి. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. పవన్ కళ్యాణ్ బత్తులని హీరోగా పెట్టి సినిమా తీస్తామని నా కంటే కోటీశ్వరులు ఫోన్ చేసి చెప్పారు. నేనే ఇంకో రెండు చిత్రాలు చేస్తానని వారికి చెప్పాను. ఎక్కడా కొత్త అబ్బాయిలా అనిపించలేదు. మా అబ్బాయి యాక్టింగ్ నాకు నచ్చింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరు వులవల, నటులు కసిరెడ్డి రాజ్ కుమార్, విషిక, హాసిని సుధీర్, సంధ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. -
‘పురుషః’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: పురుషఃనటీనటులు:బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్, రాయంచ కొక్కురనిర్మాత: బత్తుల కోటేశ్వరదర్శకత్వం: వీరు వులవలసంగీతం: శ్రవణ్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాలఎడిటింగ్: కోటివిడుదల తేది: మే 22,2026కథేంటంటే..గోవింద్ అలియాస్ బండ(పవన్ కల్యాణ్ బత్తుల),సత్తిబాబు అలియాస్ బొగ్గు(సప్తగిరి), శ్రీను అలియాస్ జంప్(కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. పెళ్ళైన తర్వాత ఈ ముగ్గురికీ తమ తమ భార్యలతో రోజూ చిన్న చిన్న గొడవలు అతుతుంటాయి. భర్తలపై అనుమానం పెంచుకున్న ఈ ముగ్గురు భార్యలు..నిత్యం వారిని టార్చర్ చేస్తుంటారు. అదే సమయంలో చిన్నప్పటి స్నేహితుడు కిస్సు(వెన్నెల కిశోర్) పెళ్లి కుదురుతుంది. ఈ ముగ్గరు తమ భార్యలతో కలిసి ఆ పెళ్లికి వెళ్తారు. అక్కడ యవ్వనంలో గోవింద్, సత్తిబాబు, శ్రీనులు కలిసి చేసిన కొన్ని చిలిపి పనుల గురించి భార్యలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రోజీ ఎవరు? గోవింద్ జీవితంలోకి ఆమె ఎలా వచ్చింది? కిస్సు రాసిన బుక్ ఈ ముగ్గురి కాపురాల్లో ఎలాంటి చిచ్చు పెట్టింది? విడాకుల కేసు ఏమైంది? చివరకు ఈ మూడు జంటలు మళ్లీ కలిశాయా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. భార్య బాధితుల కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘ఎఫ్ 2’ లాంటి సినిమాలు చాలా మంచి విజయం సాధించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. చాలా కాలం తర్వాత భార్య బాధితుల నేపథ్యంలో వచ్చిన చిత్రం పురుషః. ఓ రకంగా ఇది పెళ్లైన మగాడి బయోపిక్ అని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య గొడవలతో మొదలైన ఈ కథ చివరకు ‘భార్యల్ని యుద్దంతో కాదు.. ప్రేమతో గెలవాలి’ అనే సందేశంతో ముగుస్తుంది. సినిమా ప్రారంభంలోనే ముగ్గురు స్నేహితుల ఫ్యామిలో జరిగే గొడవలు.. కోర్టు కేసు సన్నివేశాలతో నవ్వులు పూయిస్తుంది. కోర్టులో విడాకుల కోసం వెళ్లిన ముగ్గురు స్నేహితలను అక్కడి న్యాయమూర్తి (వీటీవీ గణేష్) తన క్యాబిన్లోకి పిలుచుకొని వారి సమస్యలు ఏంటని అడగడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే భర్తలు కష్టాలు.. భార్యలు చేసే టార్చర్ చూస్తున్నంతసేపు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ఎఫ్ 2 లాంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు మనకు గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్ అంతా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ చేసే కామెడీతో సాగిపోతుంది.వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత కామెడీ మరింత పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఎక్కువగా గోవింద్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గోవింద్ ప్లాష్‌బ్యాక్, రోజీతో లవ్‌స్టోరీ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇక గొడవ అయిన ప్రతిసారి భర్తలు సూపర్ హీరోలుగా మారి వారితో యుద్ధం చేస్తున్నట్లుగా వచ్చే కామెడీ సీన్స్ కూడా అంతగా నవ్వించవు. చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని ప్రభావం కూడా అంతంత మాత్రమే.అయితే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించరు. కానీ, ఆ ట్వీస్ట్ రివీల్ అయిన తర్వాత గత సినిమాలు గుర్తుకు వస్తాయి. ముగింపు బాగుంటుంది. ఎవరెలా చేశారంటే..పవన్ కల్యాణ్ కి ఇదే తొలి సినిమా. అయినా కూడా చాలా బాగా నటించాడు. భార్య చేతిలో ఇబ్బంది పడే భర్తగా, ఫ్లాష్ బ్యాక్ లో నిజాయితీగా ప్రేమించే లవర్‌గా రెండు డిఫరెంట్ వేరియేషన్ చూపించి మెప్పించాడు. స ప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ల కామెడీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. వెన్నెల కిశోర్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. భార్యలుగా నటించిన రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల, టీవీ గణేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ను కట్ చేసి ఉంటే సినిమా మరింత వేగంగా ఉండేది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఈ సినిమాతో మా అబ్బాయి సిగ్గు పోతే చాలు: నిర్మాత
సినిమా ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. హీరో అవ్వాలన్న నా కలని మా అబ్బాయి ద్వారా నెరవేర్చుకున్నాను. మా అబ్బాయికి ఉన్న సిగ్గు, బిడియం కూడా ఈ సినిమాల వల్ల పోతుంది. అందుకే మా కొడుకుని హీరోగా చేశాను’ అన్నారు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడకు వచ్చాక అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలోకి రావడం మంచి పరిణామంగా అనిపిస్తోంది.→ దర్శకుడు వీరుతో కంటే ముందు ఓ దర్శకుడితో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. ఆ తరువాత సతీష్ ముత్యాల ద్వారా వీరు పరిచయం అయ్యాడు. ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మా కన్స్ట్రక్షన్ ఆఫీస్‌నే సినిమా ఆఫీస్‌గా మార్చాం.→ ‘పురుష:’ కథ చాలా బాగుంటుంది. ఆయన నెరేషన్ ఇచ్చిన తీరు కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇందులోని లవ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఏదో ఒక భారీ సినిమా తీసేయాలనే కోరిక అయితే నాకు లేదు. మా అబ్బాయికి ఉన్న బిడియం, సిగ్గుని పోగొడితే చాలు అని నాకు అనిపించింది. డబ్బుల కోసం అయితే మూవీ తీయలేదు. లాభాలు ఆశించడం లేదు.→ ఈ చిత్రంలో వీటీవీ గణేష్ పాత్ర అందరినీ నవ్విస్తుంది. ఆయన మాకు ఎంతో సహకరించారు. డేట్స్ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. వెన్నెల కిషోర్ వల్లే కథలో సంఘర్షణ వస్తుంది. సప్తగిరి అద్భుతంగా నటించారు. కసిరెడ్డి గారు చక్కగా నటించారు. మా హీరోయిన్లు అందంగా కనిపించడమే కాకుండా తెరపై చక్కగా నటించారు. అనంత శ్రీరామ్ పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. మా అబ్బాయి గురించి నేను చెప్పను. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ చెప్పాలి.→ ఈ సినిమాని మొత్తంగా మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మే 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. థియేటర్లో హాయిగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది.→ మా అబ్బాయికి నేను ముందుగానే మాట ఇచ్చాను. మూడు సినిమాలు చేస్తానని చెప్పానని. అప్పటి వరకు మా వాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఓకే. లేదంటే మళ్లీ మా ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని ముందే చెప్పాను. అలా నేను మా వాడితో కచ్చితంగా నాకున్న స్థోమతలో మూడు సినిమాలు అయితే చేస్తాను. -
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పవన్ కల్యాణ్ 'పురుషః' రిలీజ్‌కి రెడీ
పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'పురుషః'. బత్తుల కోటేశ్వరరావు నిర్మించగా వీరు వులవల దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలు చేశారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 22న థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు.హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'పురుష:' కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను ఇలా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి మా నాన్న గారే కారణం. అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నాడు. ఇక దర్శకుడు వీరు మాట్లాడుతూ .. మళ్లీరావా, జెర్సీ, మసూద సినిమాలకు పనిచేశాను. నేను ఈ కథని ఎలా అనుకున్నానో అలానే తీశాను. వేసవి కానుకగా మా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. -
ఆసక్తికరంగా 'పురుష:' టీజర్
భార్యాభర్తల కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ కథతో తీసిన సినిమా 'పురుష:' పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే భార్యల ప్రాముఖ్యం ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారు. బత్తుల కోటేశ్వరరావు కోటేశ్వరరావు నిర్మించారు. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నారు. వీరు వులవల దర్శకుడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ వదిలారు. 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే అంశానికి కామెడీ జోడించి ఈ సినిమాని తీసినట్లు టీజర్ బట్టి అర్థమవుతోంది. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ తదితర కమెడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
'పురుషః' నుంచి హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్ రిలీజ్
భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపిస్తూ తీసిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా 'పురుష:' బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నాడు. వీరు వులవల దర్శకుడు. ఇప్పటికే కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.తొలుత హీరోయిన్ వైష్ణవి పాత్రని 'కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా' అని పరిచయం చేశారు. 'పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ' అనే క్యాప్షన్‌తో హాసిని పాత్రని పరిచయం చేశారు. ఇప్పుడు విషిక పోస్టర్ రిలీజ్ చేశారు. వైష్ణవి, హాసిని కంటే విషిక పాత్ర మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. .ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
'మగాళ్లను మొక్కుకుంటూ కాదు తొక్కుకుంటూ పోతాం'..ఆసక్తిగా పురుష పోస్టర్!
పవన్ కళ్యాణ్ బత్తులను హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ పురుష. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారుత్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, క్యాప్షన్స్ చూస్తుంటే ఫుల్‌గా నవ్వించే కథతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా వదిలిన మరో పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతాం అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ ఫుల్ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్ర్లలో నటించారు. -
బ్రహ్మచారి.. భర్త కావాలనుకుంటే? 'పురుష' ఫస్ట్ లుక్
'బ్రహ్మచారి.. భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది' అనే క్యాప్షన్‌తో 'పురుష' ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ పోస్టర్ ఆవిష్కరించారు. బత్తుల సరస్వతి సమర్పణలో తన తనయుడు పవన్ కల్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసినీ సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ పేర్కొంది. -
స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం ‘పురుష:’
ప్రస్తుతం సినిమాని రిలీజ్ చేయడం కంటే.. జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాం.. ఎలా ప్రమోట్ చేస్తున్నాం.. ఎలాంటి కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాం అన్నది ముఖ్యంగా మారింది. అందుకే ‘పురుష:’ టీం డిఫరెంట్ పోస్టర్లు, రకరకాల క్యాప్షన్స్తో సినిమా కాన్సెప్ట్‌ను తెలియజేసేలా కంటెంట్‌ను బయటకు వదులుతోంది.బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండు పోస్టర్లు వదిలారు. ‘ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది’; ‘ స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం’ అంటూ ఇలా డిఫరెంట్ క్యాప్షన్స్తో రీలీజ్ చేసిన ఈ పోస్టర్లు సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.


