స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం ‘పురుష:’ | Team Purushaha Raises Curiosity With A Series Of Creative Captions And Unique Promotional Posters | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం ‘పురుష:’

Nov 4 2025 6:58 PM | Updated on Nov 4 2025 7:36 PM

Team Purushaha Raises Curiosity With A Series Of Creative Captions And Unique Promotional Posters

ప్రస్తుతం సినిమా‌ని రిలీజ్ చేయడం కంటే.. జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాం.. ఎలా ప్రమోట్ చేస్తున్నాం.. ఎలాంటి కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాం అన్నది ముఖ్యంగా మారింది. అందుకే ‘పురుష:’ టీం డిఫరెంట్ పోస్టర్లు, రకరకాల క్యాప్షన్స్‌తో సినిమా కాన్సెప్ట్‌ను తెలియజేసేలా కంటెంట్‌ను బయటకు వదులుతోంది.

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 

తాజాగా ఈ సినిమా నుంచి రెండు పోస్టర్లు వదిలారు. ‘ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది’; ‘ స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం’ అంటూ ఇలా డిఫరెంట్ క్యాప్షన్స్‌తో రీలీజ్‌ చేసిన ఈ పోస్టర్లు సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement