శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ వీకెండ్ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్, పాటలతో బజ్ తీసుకొచ్చే కాస్త బజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మూవీలోని ఐ యామ్ ఛాంపియన్ అంటూ సాగే టైటిల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ బాలనటి కనిపించడం విశేషం. మరి ఈమెని గుర్తుపట్టారా?
(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)
ఛాంపియన్ మూవీలో రోషన్‌తో పాటు ఓ పాటలో కనిపించిన ఈ బాలనటి పేరు అవంతిక వందనపు. తెలుగు మూలాలున్నప్పటికీ అమెరికాలో పుట్టి పెరిగింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైంది. తర్వాత తెలుగులో ప్రేమమ్, ఆక్సిజన్, బాలకృష్ణుడు, మనమంతా, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో బాలనటిగా చేసింది. తర్వాత ఇంగ్లీష్‌లోనూ పలు సినిమాలు, సిరీస్‌లు చేసింది. మళ్లీ ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత తెలుగులో 'ఛాంపియన్'లోని స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.
వైజయంతీ మూవీస్ నిర్మించిన 'ఛాంపియన్' చిత్రంతో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వాతంత్ర‍్య బ్యాక్ డ్రాప్‌లోని పీరియాడికల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. రోషన్ గతంలో 'పెళ్లి సందD'లో హీరోగా నటించాడు. అది అంతంత మాత్రంగానే ఆడింది. ఇదొచ్చిన మూడేళ్లకు ఇప్పుడు 'ఛాంపియన్' అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)


