వెయిట్‌ చేస్తా!.. ఆకట్టుకునేలా గ్లింప్స్ | Whats Up Naresh First Look and Glimpse Released | Sakshi
Sakshi News home page

వెయిట్‌ చేస్తా!.. ఆకట్టుకునేలా గ్లింప్స్

Feb 9 2026 1:13 AM | Updated on Feb 9 2026 1:27 AM

Whats Up Naresh First Look and Glimpse Released

‘ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్‌ చేస్తా’ అనే డైలాగ్‌తో నరేష్‌ స్వభావం ఏంటో అర్థమైపోతుంది. ఇంతకీ ఎవరీ నరేష్‌ అంటే... ‘వాట్స్‌ అప్‌ నరేష్‌’ చిత్రంలో హీరో అన్వేష్‌ మైఖేల్‌ చేసిన పాత్ర పేరు ఇది. ఈ చిత్రం గ్లింప్స్‌లో పై సంభాషణతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘లోకం తీరింతే... నువ్వే మారాలంతే’ అనే లిరిక్స్‌ వినిపిస్తాయి.

‘కొత్తపోరడు’ తర్వాత అన్వేష్‌ మైఖేల్‌ హీరోగా, ‘బలగం’ ఫేమ్‌ కావ్య కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘వాట్స్‌ అప్‌ నరేష్‌’.  సీవీ విశాల్‌ దర్శకత్వంలో భాగ్యలక్ష్మీ చింతా నిర్మించారు. ‘‘సాఫ్ట్‌వేర్‌ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ...  ఇలా అన్ని అంశాలను జోడించి ఈ సినిమా రూపొందించాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement