వైఎస్ అనిల్‌రెడ్డి (వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు) తనయుడు సాహిల్ వివాహం సందర్భంగా ఆ వేడుకలో పాల్గొనేందుకు చెన్నైకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ప్రముఖులు కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు, కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ, మోహన్‌బాబు తదితరులు వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ ఆత్మీయ పలకరింపులు, ఆప్యాయతల క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.


