యాక్షన్‌ టీజర్‌ రెడీ | Swayambhu teaser to be unveiled soon | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ టీజర్‌ రెడీ

Feb 9 2026 12:22 AM | Updated on Feb 9 2026 12:22 AM

Swayambhu teaser to be unveiled soon

హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీ ‘స్వయంభు’లో పోరాట యోధుడిగా నిఖిల్‌ ఏ స్థాయిలో నటించారో మరో మూడు రోజుల్లో టీజర్‌తో శాంపిల్‌ చూపించడానికి రెడీ అయింది యూనిట్‌.

నిఖిల్‌ హీరోగా సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన చిత్రం ‘స్వయంభు’. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ బుధవారం విడుదల కానుంది. ‘‘పవర్‌ఫుల్‌పాన్‌ ఇండియా విజన్‌తో వస్తున్న చిత్రం ‘స్వయంభు’. ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా మా సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement