ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్‌ను అలరిస్తుంటాయి. ముఖ్యంగా థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త థ్రిల్లర్స్ ఓటీటీకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది.
కోలీవుడ్‌లో తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సాయవనం. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దేవానంద షాజిలాల్, సౌందరరాజా, సంతోష్ దామోధరన్, అప్పుకుట్టి, జానకి, మాథ్యూ మాంప్రా, వెట్రివేల్ రాజా కీలక పాత్రల్లో నటించారు.


