‘‘మణిరత్నంగారి ‘సఖి’ సినిమాలోని ‘ఏడే ఏడేడే..’ పాట అంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో అలాంటి పాట చేయాలనుకునేవాణ్ణి. ‘ఈఎన్‌ఈ రిపీట్’ మూవీలో కుదిరింది. ఈ ‘బతుకమ్మ...’ పాట థియేటర్లలో పండగలా ఉంటుంది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం చెప్పారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’. ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది.
తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘బతుకమ్మ...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. ‘‘బతుకమ్మ...’ పాటను ప్రతి ప్రేక్షకుడు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చంద్రబోస్.


