అందుకే ఈ కథ రాశాను: కిరణ్‌ | Kiran Abbavaram Reality Team Launches Ruthu Song | Sakshi
Sakshi News home page

అందుకే ఈ కథ రాశాను: కిరణ్‌

Nov 13 2026 1:29 AM | Updated on Nov 13 2026 1:29 AM

Kiran Abbavaram Reality Team Launches Ruthu Song

సుధాకర్, కిరణ్‌ అబ్బవరం, దేవిక

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘రియాలిటీ’. దేవిక భట్‌ హీరోయిన్ గా నటించారు. సుధాకర్‌ చాగంటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది. గురువారం ‘రుత్తూ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది యూనిట్‌. భీమ్స్‌ సిసిరోలియో స్వరకల్పనలో పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ  పాటను కపిల్‌ కపిలన్‌  పాడారు. ఎం. షరీఫ్‌ కొరియోగ్రఫీ చేశారు.

ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘కుటుంబమంతా కలిసి సినిమా చూస్తే బాగుంటుందనిపించి ఈ కథ రాశాను. మా సినిమా నుంచి వచ్చిన ‘భజగోవిందం’  పాట ప్రేక్షకులకు నచ్చింది. ఈ ‘రుత్తూ’  పాట, అలానే సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘నా తొలి సినిమాను కిరణ్‌గారి కథతో, ఆయన దర్శకత్వంలో చేయడం హ్యాపీగా ఉంది’’ అని చెప్పారు సుధాకర్‌ చాగంటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement