హైడ్రాపై రామ్ గోపాల్ పేట సీఐ పాడిన పాట‌ విడుద‌ల | Ram Gopalpet CI song about Hydra released | Sakshi
Sakshi News home page

హైడ్రాపై రామ్ గోపాల్ పేట సీఐ పాడిన పాట‌ విడుద‌ల

Oct 26 2026 1:14 PM | Updated on Oct 26 2026 1:36 PM

Ram Gopalpet CI song about Hydra released

హైదరాబాద్ : న‌గ‌రం ఎలా ఉండేది.. ఆక్ర‌మాణ‌ల‌తో ఎలా వ‌ర‌ద‌ల‌కు గురైంది.. ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో వ‌ర‌ద కాలువ‌లు ఎలా నిండిపోయాయి.. హైడ్రా వ‌చ్చిన త‌ర్వాత న‌గ‌రం ఎలా భ‌ద్రంగా మారింది అనే అంశాల‌ను వివ‌రిస్తూ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ సీఐ బొడ‌సింగి సురేష్ కుమార్ పాడిన పాట‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగనాథ్ విడుద‌ల చేశారు.  

రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్  SHO, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వ‌హిస్తూనే.. జ‌నాన్ని చైత‌న్యం చేస్తూ సురేష్ కుమార్ ప‌లు పాట‌లు పాడ‌డం అభినంద‌నీయ‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ ఈ సందర్భంగా అన్నారు.ఇటీవ‌ల గ‌ణేష్ ఉత్స‌వాల స‌మ‌యంలో డీజే సౌండ్స్ మీద సురేష్ త‌న పాట‌తో తెచ్చిన చైత‌న్యం అభినంద‌నీయ‌మ‌న్నారు. సురేష్ కడారి ఈ పాట‌ను ర‌చించ‌గా.. క‌ళ్యాణ్ కీస్ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement