ఖైరతాబాద్‌ నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తాం : పల్లపు గోవర్ధన్‌ | Pallapu Govardhan Announces Sports Events Across Khairatabad Constituency From Next Year, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తాం : పల్లపు గోవర్ధన్‌

Oct 26 2026 11:07 AM | Updated on Oct 26 2026 11:37 AM

We will organize sports events across the Khairatabad constituency

హైదరాబాద్ : ఇప్పటి వరకు జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్‌ నియోజక వర్గ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఖైరతాబాద్‌ సీనియర్‌ నేత, భాగ్యనగర్‌ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్దన్‌ అన్నారు. దసరా సందర్భంగా నిర్వహించిన పీజీ దసరా క్రికెట్‌ టోర్నమెంట్‌ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌ చౌరస్తాలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్లపు గోవర్ధన్‌ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతియేటా యువత కోసం క్రికెట్‌ టోర్నమెంట్లను నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని నియోజక వర్గంలోని అనేక డివిజన్ల నుంచి బస్తీల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని తాము కూడా పాల్గొంటామని అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు. వారి అభ్యర్ధన మేరకు వచ్చే యేడాది నుంచి నియోజక వర్గ స్థాయిలో క్రికెట్‌ టోర్నమెంట్లు నిర్వహిస్తామని అన్నారు.

ఫిలింనగర్ బస్తీలో పుట్టి పెరిగిన తనకు యువత ఎదుర్కొనే అనేక సమస్యలపై అవగాహన ఉందని అందుకే వారు చెడు మార్గంలో వెళ్ళవద్దు సదుద్దేశం తో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అదే విధంగా మహిళలకు వచ్చే సంక్రాంతికి ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.

యువతను ప్రోత్సహించేందుకు చేసిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని అన్నారు. 15 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఫిలింనగర్‌కు చెందిన 19 జట్లు పాల్గొనగా 47 మ్యాచ్‌లు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫ్రెండ్స్ ప్లేయింగ్11 టీమ్‌ విజేతగా నిలవగా రన్నరప్‌గా దుర్గా భవానీనగర్‌ కుమార్‌ జట్టు నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement