బస్సులో నుంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ | RTC Conductor Seriously Injured in Ticket Dispute in Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

బస్సులో నుంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ

Oct 26 2026 11:29 AM | Updated on Oct 26 2026 11:29 AM

RTC Conductor Seriously Injured in Ticket Dispute in Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  చిల్లర విషయంలో ప్రయాణికురాలు, కండక్టర్‌కు మధ్య జరిగిన వివాదంలో మహిళా కండక్టర్‌ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. అశ్వాపురం సీఐ ఎల్లయ్య కథనం ప్ర కారం.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మౌనిక అనే ప్రయాణికురాలు తన కుమారుడితో కలిసి ఎక్కింది.

అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దిగేందుకు తన కుమారుడికి హాఫ్‌ టికెట్‌ ఇవ్వాలంటూ కండక్టర్‌ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చింది. చిల్లర విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో ప్రయాణికురాలిపై అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కండక్టర్‌ భావించింది. ఈ మేరకు మిట్టగూడెం స్టాప్‌లో ప్రయాణికురాలిని బస్సు దిగనివ్వకుండా కండక్టర్‌ డోరు వద్ద నిలువరించింది. బస్‌స్టాప్‌ దాటిపోతుండటంతో మహిళా కండక్టర్‌ను సదరు ప్రయాణికులు నెట్టివేసింది.

దీంతో కండక్టర్‌.. బస్సు డోర్‌ నుంచి రోడ్డుపై పడిపోగా ఆమె కుడి కాలు పైనుంచి బస్సు వెనుక టైర్లు ఎక్కడంతో కాలు నుజ్జునుజ్జయింది. ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు, తోటి ప్రయాణిలు స్పందించి 108 అంబులెన్స్‌ ద్వారా కండక్టర్‌ను భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు. అశ్వాపు రం పోలీసులు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. మణుగూరు డీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు అశ్వాపురం సీఐ ఎల్లయ్య తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement