రూ.600కే ఆర్టీసీ వీక్లీ బస్‌పాస్‌ | TGSRTC Launches Rs 600 Weekly Bus Pass for Unlimited Travel in Greater Hyderabad | Sakshi
Sakshi News home page

రూ.600కే ఆర్టీసీ వీక్లీ బస్‌పాస్‌

Oct 26 2026 8:20 AM | Updated on Oct 26 2026 8:20 AM

TGSRTC Launches Rs 600 Weekly Bus Pass for Unlimited Travel in Greater Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కొత్తగా రూ.600తో వీక్లీ బస్‌పాస్‌లను ప్రవేశపెట్టింది.  ఏడు రోజుల పాటు క్యూర్‌ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వీలు కల్పించింది. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు రాకపోకలు సాగించే పుష్పక్‌ ఏసీ ఎయిర్‌పోర్ట్‌ లైనర్‌ బస్సుల్లో మాత్రం ఈ పాస్‌ చెల్లుబాటు కాదు. మెట్రో లగ్జరీ ఏసీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో వీక్లీపాస్‌తో ప్రయాణించే వీలు ఉంది. వీక్లీ పాస్‌లు ఆర్టీసీ బస్‌పాస్‌ కౌంటర్‌లలో లభిస్తాయని అధికారులు తెలిపారు. నగరంలో ప్రస్తుతం ప్రతిరోజు 25 లక్షల మందికి పైగా సిటీబస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.

 మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకొనే 18 లక్షల మంది మహిళా ప్రయాణికులను మినహాయిస్తే మిగతా 7 లక్షల మంది పురుష ప్రయాణికులు వీక్లీ పాస్‌లను వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెయిలీ, మంత్లీ పాస్‌లతో పాటు ఇది అదనపు సదుపాయం. ప్రజా రవాణా వ్యవస్థ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు నగర ప్రయాణికులకు అందుబాటు ధరలో మెరుగైన ప్రయాణ సేవలు అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను ఆయన కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement