breaking news
Khairatabad assembly constituency
-
ఖైరతాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తాం : పల్లపు గోవర్ధన్
హైదరాబాద్ : ఇప్పటి వరకు జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ నియోజక వర్గ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఖైరతాబాద్ సీనియర్ నేత, భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్దన్ అన్నారు. దసరా సందర్భంగా నిర్వహించిన పీజీ దసరా క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఫిలింనగర్‌లోని గౌతంనగర్ చౌరస్తాలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్లపు గోవర్ధన్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతియేటా యువత కోసం క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని నియోజక వర్గంలోని అనేక డివిజన్ల నుంచి బస్తీల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని తాము కూడా పాల్గొంటామని అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు. వారి అభ్యర్ధన మేరకు వచ్చే యేడాది నుంచి నియోజక వర్గ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని అన్నారు.ఫిలింనగర్ బస్తీలో పుట్టి పెరిగిన తనకు యువత ఎదుర్కొనే అనేక సమస్యలపై అవగాహన ఉందని అందుకే వారు చెడు మార్గంలో వెళ్ళవద్దు సదుద్దేశం తో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అదే విధంగా మహిళలకు వచ్చే సంక్రాంతికి ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.యువతను ప్రోత్సహించేందుకు చేసిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని అన్నారు. 15 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్లో ఫిలింనగర్‌కు చెందిన 19 జట్లు పాల్గొనగా 47 మ్యాచ్‌లు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫ్రెండ్స్ ప్లేయింగ్11 టీమ్ విజేతగా నిలవగా రన్నరప్‌గా దుర్గా భవానీనగర్ కుమార్ జట్టు నిలిచింది. -
త్వరలోనే ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గ విషయంలో ఉత్కంఠకు తెర పడింది. ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇవాళ ఉన్నత న్యాయస్థానం తీర్పునే సమర్థించడంతో ఆయనకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151A ప్రకారం సాధారణంగా శాసనసభలో ఏర్పడిన ఖాళీని ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక ద్వారా భర్తీ చేయాలి. అయితే మిగిలిన పదవీకాలం ఏడాది కంటే తక్కువగా ఉండటం వంటి చట్టపరమైన మినహాయింపులు ఉన్నాయి. కానీ, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి వీలైనంత త్వరగానే ఉప ఎన్నిక తేదీని ఈసీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 6న దేశంలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసి..ప్రచారాలు నడుస్తున్నాయి. కాబట్టి ఖైరతాబాద్ ఆ చాన్స్ మిస్సయ్యింది. అయితే ఇప్పటి నుంచి ఏవైనా స్థానాలు ఖాళీ అయితే గనుక ఈసీ అధికారిక షెడ్యూల్ అతిత్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. లేదంటే ఖాళీపై అధికారిక సమాచారం అందిన వెంటనే ఎన్నికల సంఘం తన ప్రక్రియను ప్రారంభించే చాన్స్ ఉంది.సాధారణంగా ఇలాంటి కేసుల్లో.. సీటు ఖాళీ విషయాన్ని శాసనసభ ఈసీకి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే హైకోర్టు తీర్పు తర్వాత దానం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ నుంచి ఈసీకి సమాచారం వెళ్లే అవకాశం ఉంది. నియోజకవర్గ పరిస్థితులు, ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి ఈసీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను నిర్ణయిస్తుంది. ఇదీ చదవండి: ఇక చాలూ.. ఉప ఎన్నికలకు వెళ్లండి -
ఖైరతాబాద్ సస్పెన్స్.. దానంకు ఆ ముగ్గురితో గండం!
సాక్షి, బంజారాహిల్స్: ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్‌పైనే... కేసీఆర్ ప్రకటించిన 105 మంది టీఆర్ఎస్స్ అభ్యర్ధుల జాబితాలో ఖైరతాబాద్ అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇక్కడి నుంచి ఎవరికీ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డితోపాటు బంజారాహిల్స్ కార్పొరేటర్, కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు పీ విజయారెడ్డి ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా ఇక్కడి నుంచే పోటీలో ఉండాలనుకుంటున్నారు. గతంలో ఇది ఆయనకు సిట్టింగ్ సీటు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందోనన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, దానం నాగేందర్‌ను గోషామహల్లో నిలబెట్టే అవకాశాలుగా మెండుగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే వీరెవరూ కాకుండా కొత్తవారిని ఎవరినైనా నిలబెడతారా అన్నదానిపై కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ఖైరతాబాద్ టికెట్ ఇప్పుడు హాట్‌హాట్‌గా మారింది. -
మాయలోళ్లను నమ్మొద్దు: విజయారెడ్డి
హైదరాబాద్: ఓట్ల కోసం వచ్చే మాయలోళ్లను నమ్మవద్దని, పేదలు, అణగారిన వర్గాల పట్ల నిజమైన అభిమానం, ఆదరణ ఉన్న దివంగత పీజేఆర్ కుటుంబ సభ్యురాలిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయారెడ్డి కోరారు. బీఎస్ మక్తా, సుభానీ మసీద్ ప్రాంతం, హరిగేట్ తదితర ప్రాంతాల్లో ఆమె ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లుగా మంత్రి పదవిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ నియోజకవర్గంలో చేశానని చెబుతున్న అభివృద్ధి ఎక్కడో చూపాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధిని గాలికొదిలేసి, సొంత వ్యవహారాలు, వ్యాపారాలు చక్కబెట్టుకున్న దానంకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలతో పాటు రేషన్‌కార్డులు, వృద్ధాప్య పింఛన్లు సహా పలు ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే తన సత్తా చాటి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. కొన్నేళ్లుగా పత్తాలేని బీజేపీ అభ్యర్థి చింతల మళ్లీ ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యారని, ఆయన అసలు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దానం, చింతలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అడ్డా కూలీలు, రోజువారీ వేతనాలు చేసుకుంటూ బతుకును వెళ్ళ దీస్తున్న వారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలకు అత్యంత కీలక ప్రాధాన్యత ఉందని, ప్రతిఒక్కరూ ఓటు వేసే సమయంలో ఒక్కసారి దివంగత మహానేత వైఎస్సార్, పీజేఆర్‌లను గుర్తుచేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా స్థానికులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. దివంగత పీజేఆర్‌తో తమ అనుబంధం గుర్తు చేసుకున్నారు. తండ్రిలాగే విజయారెడ్డి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. -
విజయారెడ్డి గెలవడం ఖాయుం: విజయమ్మ
హైదరాబాద్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయూరెడ్డి భారీ మెజారిటీలో విజయుం సాధిస్తారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయువ్ము అన్నారు. ఖైరతాబాద్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేసిన విజయూరెడ్డికి వుద్దతుగా విజయువ్ము వచ్చారు. ys vi అనంతరం వూట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ఆయన వారసురాలిగా వస్తున్న విజయారెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తామని ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేస్తుందని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయుం కోసం ప్రచారం చేస్తానని వెల్లడించారు.


