ఖైరతాబాద్‌ సస్పెన్స్‌.. దానంకు ఆ ముగ్గురితో గండం!

Suspense on Danam Nagender seat - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌:  ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్‌పైనే... కేసీఆర్‌ ప్రకటించిన 105 మంది టీఆర్‌ఎస్‌స్‌ అభ్యర్ధుల జాబితాలో ఖైరతాబాద్‌ అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇక్కడి నుంచి ఎవరికీ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డితోపాటు బంజారాహిల్స్‌ కార్పొరేటర్, కేకే కూతురు గద్వాల్‌ విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ కార్పొరేటర్, పీజేఆర్‌ కూతురు పీ విజయారెడ్డి ఇక్కడి నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ కూడా ఇక్కడి నుంచే పోటీలో ఉండాలనుకుంటున్నారు. గతంలో ఇది ఆయనకు సిట్టింగ్‌ సీటు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందోనన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే, దానం నాగేందర్‌ను గోషామహల్‌లో నిలబెట్టే అవకాశాలుగా మెండుగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే వీరెవరూ కాకుండా కొత్తవారిని ఎవరినైనా నిలబెడతారా అన్నదానిపై కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ఖైరతాబాద్‌ టికెట్‌ ఇప్పుడు హాట్‌హాట్‌గా మారింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top