ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మళ్ళీ ట్విస్ట్ | TG Speakers Inquiry on Danam Nagender Adjourned | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మళ్ళీ ట్విస్ట్

Mar 5 2026 7:01 PM | Updated on Mar 7 2026 8:23 AM

TG Speakers Inquiry on Danam Nagender Adjourned

హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయం మళ్లీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది.   ఈ అనర్హత కేసు విచారణలో భాగంగా దానం నాగేందర్‌పై విచారణ పూర్తి కాలేదు. దానం నాగేందర్‌పై విచారణను శనివారానికి వాయిదా వేశారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌. మరొకవైపు కడియం శ్రీహరి విచారణ పూర్తి చేశారు స్పీకర్‌. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇరు వర్గాలకు సూచించారు స్పీకర్. దానంపై దాఖలైన రెండు పిటిషన్లను  శనివారం విచారించనున్నారు. 

గత నెలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఫిబ్రవరి 6వ తేదీన హెచ్చరించింది.  ఈ క్రమంలోనే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మరో అవకాశం ఇచ్చింది. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్‌కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్‌ను ఆదేశించింది.  ఈ క్రమంలోనే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌..   ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను తేల్చేపనిలో పడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement