భారత్ కనెక్ట్ ఈ-చలాన్: ఏపీ, తెలంగాణలో భారీ స్పందన | Bharat Connect E Challan Service Sees Strong Response In AP And Telangana, Over 5.8 Lakh Transactions Recorded | Sakshi
Sakshi News home page

భారత్ కనెక్ట్ ఈ-చలాన్: ఏపీ, తెలంగాణలో భారీ స్పందన

Mar 5 2026 5:15 PM | Updated on Mar 5 2026 5:45 PM

Bharat Connect E Challan Service Sees Strong Response in AP and Telangana

భారత్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించిన ఈ-చలాన్ సేవకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. 2025 అక్టోబర్ నుంచి ఏపీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 4.5 లక్షలకు పైగా, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 1.3 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.

ఫిబ్రవరి 2026లోనే ఏపీలో 1.02 లక్షలు, తెలంగాణలో 22,882 లావాదేవీలు జరిగాయి. భారత్ కనెక్ట్ ద్వారా ట్రాఫిక్ చలాన్ వివరాలు తెలుసుకుని డిజిటల్‌గా చెల్లించే వెసులుబాటు లభిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లో డ్రోన్ ప్రచారం కూడా నిర్వహించారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఇంటరాక్టివ్ స్క్రీన్‌లను డ్రోన్‌ల ద్వారా ప్రదర్శిస్తూ ఈ-చలాన్ సేవపై ప్రచారం చేశారు. ప్రస్తుతం 700కు పైగా యాప్‌లు, బ్యాంకుల ద్వారా ఈ సర్వీసు అందుబాటులో ఉంది.ఢిల్లీ, గుజరాత్‌లో కూడా ఈ కేటగిరీ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

“భారత్ కనెక్ట్‌లోని ఈ-చలాన్ సేవ, డిజిటల్ అప్‌గ్రేడ్ మాత్రమే కాదు. ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ ప్లాట్‌ఫాంలు కలిసి పని చేస్తే పౌరులకు అందించే సేవలను సరికొత్తగా నిర్వచించేందుకు వీలవుతుందని తెలియజెప్పేందుకు ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీస్, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖలకు కృతజ్ఞతలు. ప్రజలకు అవసరమైన కీలక చెల్లింపులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ఇది కీలక అడుగు,” అని ఎన్‌బీబీఎల్ (NBBL) ఎండీ & సీఈఓ నూపూర్ చతుర్వేది తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement