అమెజాన్‌లో మరోమారు లేఆఫ్స్! | Amazon Layoffs Again Know The Details Here | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో మరోమారు లేఆఫ్స్!

Mar 5 2026 4:28 PM | Updated on Mar 5 2026 4:39 PM

Amazon Layoffs Again Know The Details Here

దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ప్రభావం రోబోటిక్స్ యూనిట్‌లోని సుమారు 100 మంది ఉద్యోగులపై పడింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

2026 జనవరిలో కూడా అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తొలగించింది. ఏఐకి అప్‌డేట్‌ అవుతున్న నేపథ్యంలో భారీ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. కాగా ఇప్పుడు రెండు నెలలు కూడా గడవకముందే.. మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. 2022 నుంచి కంపెనీ దాదాపు 57వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం చివరి నాటికి.. అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.58 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. ఎక్కువ మంది గిడ్డంగి & లాజిస్టిక్స్ విభాగాలలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ.. ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపింది. రానున్న రోజుల్లో కూడా ఏఐ కారణంగా మరింతమంది జాబ్స్ కోల్పొయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement