టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీకి చెందిన ఒక వాచ్ కంపెనీ సియెర్రా పేరుతో లిమిటెడ్ ఎడిషన్ వాచ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 16999.
టాటా సియెర్రా వాచ్‌ను కంపెనీ కేవలం 500 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ వాచ్.. ఢిల్లీ వాచ్ కంపెనీ లోగో, సియెర్రా పేరును పొందినట్లు తెలుస్తోంది. సాధారణ వాచ్‌లో మాదిరిగా.. ఇందులో కూడా 3,6,9, 12 గంటలను సూచించే గుర్తులు ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ స్నీకర్, టోపోగ్రాఫిక్ లైన్లు, గుర్రం చిహ్నం వంటివి ఇందులో కనిపిస్తాయి.
సియెర్రా 10000 యూనిట్ల డెలివరీ!
టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.
సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి.


