టాటా కారుకు ఫుల్ డిమాండ్.. 10వేల డెలివరీలు! | Tata Sierra Crosses 10000 Deliveries | Sakshi
Sakshi News home page

టాటా కారుకు ఫుల్ డిమాండ్.. 10వేల డెలివరీలు!

Mar 3 2026 7:51 PM | Updated on Mar 3 2026 7:58 PM

Tata Sierra Crosses 10000 Deliveries

టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.

సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.

డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement