ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన! | How The Premia Academy Is Reimagining Learning for a Future Ready Generation | Sakshi
Sakshi News home page

ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!

Mar 3 2026 7:26 PM | Updated on Mar 3 2026 7:43 PM

How The Premia Academy Is Reimagining Learning for a Future Ready Generation

అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్స్, తక్షణ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.

ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.

కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్‌గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement