ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే! | Zoho Foundar Sridhar Vembu Says AI Cannot Replace These Jobs | Sakshi
Sakshi News home page

ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే!

Feb 28 2026 3:11 PM | Updated on Feb 28 2026 3:28 PM

Zoho Foundar Sridhar Vembu Says AI Cannot Replace These Jobs

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.

శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.

నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement