breaking news
Zoho
-
ఆశ్చర్యపోయాను!.. శ్రీధర్ వెంబు ట్వీట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు (AI).. సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని ఇందులో ఒక ఉదాహరణతో వివరించారు.సంస్థలోని R&D బృందంలో పనిచేసే ఇంజనీర్.. నెల రోజుల తన ఖాళీ సమయంలో తయారు చేసిన ఒక పరికరాన్ని నాకు చూపించారు. అతను దానిని తయారు చేస్తున్నట్లు నాకు తెలియదు. కానీ దానిని చూడగానే నేను ఆశ్చర్యపోయాను.మూడు లేదా నలుగురు వ్యక్తులు.. ఆ పరికరాన్ని తయారు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కానీ అతను కేవలం నెల రోజుల్లోనే దాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వేగంగా దీనిని రూపొందించడానికి ప్రధాన కారణం Opus 4.5 అనే AI మోడల్ అని ఆ ఇంజనీర్ చెప్పారు.ఒకప్పుడు ఏఐ ద్వారా రాసే కోడ్‌పై అతనికి (ఇంజినీర్) అంతగా నమ్మకం లేదు. కానీ Opus 4.5 వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెంబు వివరించారు. అంతే కాకుండా జోహో కంపెనీలో ప్రయోగాత్మక సంస్కృతిని ప్రస్తావించారు. మేము సంస్థలో తెలివైన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తాం, వాళ్లే కొత్త మార్గాలు కనుగొంటారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.ఇంతవరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేతితో నేసే చేనేత (Handloom) లాంటిదైతే, ఇప్పుడు AI రూపంలో శక్తివంతమైన యంత్ర మగ్గాలు (Machine Looms) వచ్చేశాయని అన్నారు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీల మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. జోహో కూడా దీనికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను చీఫ్ సైంటిస్ట్‌గా ఉన్నందున ఈ మార్పులను ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని వెంబు వెల్లడించారు.Yesterday one of our experienced engineers who works in my R&D team, showed me an assembly and machine code security tool he built in his spare time over the past month. I did not know he was building it. I was blown away by the depth and breadth of the tool. He has developed…— Sridhar Vembu (@svembu) January 8, 2026 -
భారతీయ కస్టమర్లు ‘స్ట్రిక్ట్ టీచర్లు’ లాంటివారు
సాఫ్ట్వేర్ దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వెంబు సోషల్ మీడియా వేదికగా భారతీయ మార్కెట్ తీరుతెన్నులపై కీలక విశ్లేషణ చేశారు. భారతీయ వినియోగదారులు అంత సులభంగా సంతృప్తి చెందరని, వారు ఎప్పుడూ నాణ్యత, విలువల విషయంలో రాజీపడని ‘కఠినమైన ఉపాధ్యాయుల’ వంటి వారని ఆయన పేర్కొన్నారు.దేశీయ మార్కెట్లో రాణిస్తే అంతర్జాతీయంగా ఎగుమతుల్లో విజయం సాధించడం సులభమని ఒక వినియోగదారుడు చేసిన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌కు శ్రీధర్ వెంబు స్పందించారు. ‘భారతీయ కొనుగోలుదారుల అంచనాలను అందుకుని మీరు మనుగడ సాగించగలిగితే ప్రపంచ మార్కెట్ మీకు చాలా సులభం అవుతుంది. మీ ఉత్పత్తి బాగుంటే ఎక్కువ ఆలోచించకుండా ప్రపంచ దేశాల్లోకి తీసుకెళ్లండి’ అని చెప్పారు.స్కూల్ టీచర్‌తో పోలికఈ సందర్భంగా తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్న వెంబు తన స్కూల్ టీచర్ పరిమళ జీతో భారతీయ కస్టమర్లను పోల్చారు. ‘నా టీచర్ పరిమళ గారు చాలా కఠినంగా ఉండేవారు. ఒకవేళ నాకు పరీక్షలో 95 శాతం మార్కులు వచ్చినా నేను తక్కువ పనితీరు కనబరుస్తున్నానని, ఇంకా కష్టపడాలని ఆమె అనేవారు. భారతీయ కస్టమర్లు కూడా సరిగ్గా అలాగే ఉంటారు. వారు 95 శాతంతో సంతృప్తి చెందరు. అత్యుత్తమమైన దాని కోసమే చూస్తారు’ అని ఆయన వివరించారు.కస్టమర్లు కఠినంగా ఉండటం కంపెనీలకు శాపమా అంటే.. కాదనే అంటున్నారు వెంబు. ‘మమ్మల్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నందుకు భారతీయ కస్టమర్లకు ధన్యవాదాలు. వారి కఠినమైన వైఖరి వల్లే మేము మరింత కష్టపడి, మెరుగైన ఉత్పత్తులను తయారు చేయగలుగుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల ఒత్తిడి కారణంగానే జోహో తన మెసేజింగ్ యాప్ ‘అరట్టయ్’(Arattai)లో గోప్యతకు పెద్దపీట వేస్తూ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్‌ను వేగంగా తీసుకువచ్చినట్లు ఆయన ఉదాహరణగా చెప్పారు.జపాన్ వర్సెస్ ఇండియాభారత మార్కెట్ కంటే జపాన్ మార్కెట్ కఠినంగా ఉంటుందనే వాదనను ఆయన ప్రస్తావిస్తూ.. జపనీస్ కంపెనీలు తమ దేశీయ కస్టమర్లు చాలా డిమాండింగ్ అని చెప్పుకుంటాయని, అయితే భారతీయ వినియోగదారులు కూడా ఏమాత్రం తక్కువ కాదని ఆయన స్పష్టం చేశారు. నియంత్రణ అనుమతులు పొందడం లేదా వినియోగదారుల అవసరాలను తీర్చడం వంటి విషయాల్లో భారత మార్కెట్ సవాలుతో కూడుకున్నదైనా అది సంస్థలను ప్రపంచ స్థాయికి ఎదగడానికి సిద్ధం చేస్తుందని ఆయన విశ్లేషించారు.ఇదీ చదవండి: డబ్ల్యూటీఓలో భారత్‌పై చైనా ఫిర్యాదు -
జోహో సీఈఓ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలనే ఆశతో లక్షలాది మంది విద్యార్థులు ఏటా జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలను ఎదుర్కొని ఐఐటీల్లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. అయితే, సాంప్రదాయ విద్యా విధానంపై ఉన్న ఈ ఒత్తిడిని తగ్గించాలని, ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం లేదని జోహో సీఈఓ, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.శ్రీధర్ వెంబు తమ కంపెనీ జోహోలో ఏ ఉద్యోగానికీ కాలేజీ డిగ్రీ అవసరం లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై డిగ్రీల కోసం ఒత్తిడి తేవడం మానుకోవాలని కూడా కోరారు.కాలేజీ డిగ్రీ ఎందుకు..?యూఎస్ ఆధారిత సంస్థ పాలంటిర్ హైస్కూల్ గ్రాడ్యుయేట్లను నేరుగా కీలకమైన సాంకేతిక, జాతీయ భద్రతా ప్రాజెక్టులపై పనిచేయడానికి అనుమతిచ్చింది. ఈ కొత్త నియామక విధానంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ విధానంలో దాదాపు 500 మంది టీనేజర్లు దరఖాస్తు చేసుకోగా 22 మంది ఎంపికయ్యారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు డిగ్రీతో పనిలేకుండా నిజాయతీగా పని చేయాలని కోరుకునే యువతలో వస్తున్న సాంస్కృతిక మార్పును హైలైట్ చేశారు.‘స్మార్ట్ అమెరికన్ విద్యార్థులు ఇప్పుడు కాలేజీకి వెళ్లడం మానేస్తున్నారు. ముందుచూపుతో ఆలోచించే కంపెనీల యజమానులు వారికి అవకాశం ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ధోరణి వల్ల పేరెంట్స్ భారీ అప్పులు చేయకుండానే యువత తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారని, చాలా కుటుంబాలు పిల్లల విద్య కోసం లక్షల రూపాయల రుణాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఒక సానుకూల పరిణామమని చెప్పారు.తల్లిదండ్రులకు విజ్ఞప్తిఈ పరిణామాలను గమనించాలని వెంబు ప్రత్యేకంగా భారతీయ తల్లిదండ్రులను, కంపెనీలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ‘విద్యావంతులైన భారతీయ తల్లిదండ్రులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రముఖ కంపెనీలు శ్రద్ధ వహించాలని నేను కోరుతున్నాను’ అని ఆయన అన్నారు. భారతదేశంలో తరతరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కాలేజీ డిగ్రీలకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఆధారిత నియామకాల వైపు మార్పు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.జోహో నియామక విధానంజోహో నియామక విధానాన్ని వివరిస్తూ వెంబు ‘జోహోలో ఏ ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ అవసరం లేదు. కొంతమంది మేనేజర్లు డిగ్రీ అవసరమయ్యే ఉద్యోగాన్ని పోస్ట్ చేస్తే మీ వద్ద ఉన్న నైపుణ్యాలను క్లుప్తంగా వివరిస్తూ డిగ్రీ అవసరాన్ని తొలగించడానికి మర్యాదపూర్వకమైన సందేశాన్ని పంపండి’ అని తెలిపారు. తమిళనాడులోని కంపెనీ యూనిట్లో తాను సగటున 19 ఏళ్ల వయసు కలిగిన బృందంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ‘వారితో కలిసి పనిచేయడానికి నేను చాలా కష్టపడాలి’ అని వెంబు ఆ యువత సామర్థ్యాన్ని కొనియాడారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్‌ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్‌కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్‌ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్‌లు, వెబ్సైట్లు లేదా ప్రోటోటైప్లను సులభంగా తయారు చేయవచ్చు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్‌ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్‌లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్‌ను జనరేట్ చేసే వీలుందన్నారు.శ్రీధర్ వెంబు..జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్ కోడ్‌ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్ అనేది ఓ మ్యాజిక్ అన్నారు. వైరుధ్యంలో ఏకాభిప్రాయంఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్కాస్ట్లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్, సెక్యూరిటీ సిస్టమ్స్‌కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు. -
రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్
నేడు అన్ని రంగాల్లోనూ ఏఐ హవా కొనసాగుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి.. వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ సహాయం చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తుంది. ఇలాంటి అనుభవమే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబుకు ఎదురైంది.జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు (Sridhar Vembu)కు.. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో జోహో సంస్థ మా కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందా?, అని అందులో ఉంది. అయితే అందులో అప్పటికే ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కంపెనీల పేర్లు, వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది.నాకు మొదటి మెయిల్ వచ్చిన కొంతసేపటికి మరో మెయిల్ వచ్చింది. అందులో రహస్య సమాచారం పంచుకున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ సమాచారం పంపించింది ఒక ఏఐ ఏజెంట్ (AI Agent) అని, ఏఐ ఏజెంట్‌గా ఇది తన తప్పిదమేనని అది పేర్కొంది, అని శ్రీధర్ వెంబు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన రహస్యాలను కూడా బయటపెడుతోందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు జోక్స్, మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవును పతనానికి ప్రయత్నాలు చేస్తుందా? అని ఇంకొందరు చెబుతున్నారు.I got an email from a startup founder, asking if we could acquire them, mentioning some other company interested in acquiring them and the price they were offering. Then I received an email from their "browser AI agent" correcting the earlier mail saying "I am sorry I disclosed…— Sridhar Vembu (@svembu) November 28, 2025 -
పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్
రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. అంతేగాదు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ నెటిజన్లు కూడా మండిపడ్డారు. ఇదే తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సైతం ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ పోస్టు పెట్టడంతో మరోసారి ఉపాసన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు..దానికి శ్రీధర్ వెంబూ ఏం కౌంటరిచ్చారు అంటే..ఉపాసన నవంబర్ 17 ఐఐటీ హైదరాబాద్‌కి వెళ్లి అక్కడ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా ఉపాసన అక్కడి అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే.. ముందు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. పైగా అమ్మాయిలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ వాళ్ల ఎగ్స్ (అండాలు)ను సేవ్ చేసి పెట్టుకోవడమే అని, దీనివల్ల మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని, ముందు ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచించింది. తాను కూడా అలాగే చేసినట్లు చెప్పింది. పైగా అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట పెనుదూమారం రేపాయి. ఏం చెబుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అదే తరుణంలో జోహో ఫౌండర్ మాజీ సీఎం శ్రీధర్ వెంబు కూడా ఉపాసన్ పోస్ట్‌పై ఘాటుగా స్పందించారు. ఆయన ఉపాసన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. వివాహం చేసుకుని, 20 ఏళ్ల లోపు పిల్లలను కనండి అని యువతకు పిలుపునిచ్చారు. ఇది మనం సమాజానికి, మన పూర్వికులకు అందించే జనాభా విధిగా పేర్కొన్నారు. తాను అదే విశ్వసిస్తానని కూడా చెప్పారు. తాను కలిసే ప్రతి యువ వ్యవస్థాపకుడికి ఇదే విషంయ చెబుతానని కూడా అన్నారు. అంతేగాదు పురుషులు మహిళలు ఇద్దరూ వివాహం చేసుకుని, 20 ఏళ్ల లోపు పిల్లలను కనాలని, దానిని వాయిదా వేయద్దని సూచించారు కూడా. వారు సమాజానికి, వారి స్వంత పూర్వీకుల పట్ల జనాభా విధిని నిర్వర్తించాలని నొక్కి చెప్పారు. ఈ భావన వింతగా, పాతకాలం మాటలులా అనిపించొచ్చు. కానీ ఈ ఆలోచన కచ్చితంగా ప్రతిధ్వనిస్తుందని నమ్ముతున్నా అంటూ ఉపాసన కొణిదెల పోస్ట్‌ని రీట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియో ఎక్స్‌లో పేర్కొన్నారు శరీధర్ వెంబు. కాగా, గత నెలలో ఉపాసన, రామ్‌చరణ్ తాము రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన శ్రీమంతం వేడుక వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు. View this post on Instagram A post shared by Startups Talk India (@startupstalkindia) చదవండి: అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్ రైడ్..! -
అమెరికా టెక్ కంపెనీలపై నిషేధం విధిస్తే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో సర్వీసులు అందిస్తున్న యూఎస్ టెక్నాలజీ కంపెనీలపై నిషేధం విధించే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో వ్యాపార వర్గాలు, టెక్ నిపుణుల్లో ఆందోళన మొదలైంది. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన సాంకేతిక స్వావలంబన (టెక్ రెసిలెన్స్)ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు నొక్కి చెప్పారు.ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా ట్రంప్ ఇండియాలో ఎక్స్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాట్‌జీపీటీ వంటి వాటిని నిషేధిస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. దీనికన్నా భయంకరమైంది లేదు! ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు ప్లాన్ బీ ఏమిటో ఆలోచించండి’ అని తెలిపారు. గోయెంకా అభిప్రాయాన్ని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సమర్థిస్తూ ‘నేను అంగీకరిస్తున్నాను. మనం అప్లికేషన్ స్థాయికి మించి అధికంగా టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్స్, చిప్స్, ఫ్యాబ్స్.. అన్ని విభాగాల్లో యూఎస్ టెక్నాలజీపై ఆధారపడడం పెరుగుతోంది. దీని పరిష్కరించాలంటే 10 సంవత్సరాల నేషనల్ మిషన్ ఫర్ టెక్ రెసిలెన్స్ అవసరం’ అని చెప్పారు.గోయెంకా పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. భారత్ నుంచి అమెరికా టెక్ కంపెనీలు అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను కేవలం యాప్‌లపై ఆధారపడటంలా కాకుండా టాలెంట్ సప్లై చైన్‌గా చూడాలని ఒక యూజర్ అన్నారు. మరో యూజర్.. ట్రంప్ భారతదేశం వంటి పెద్ద టెక్ మార్కెట్‌పై ఆంక్షలు విధించేంత మూర్ఖుడు కాదని, ఇది జరిగే అవకాశం లేదన్నాడు.ఇదీ చదవండి: మస్క్‌లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు! -
‘అధిక సంఖ్యలో టీకాల వల్ల పిల్లల్లో ఆటిజం’
పిల్లలకు మితిమీరిన సంఖ్యలో ఇస్తోన్న టీకాల వల్ల ఆటిజం కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఇటీవల చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్లో వైరల్‌గా మారింది. భారతదేశంలో ఆటిజం కేసులు పెరుగుతున్నాయని, దీనికి తల్లిదండ్రులు పిల్లలకు ఇప్పిస్తున్న టీకాలు కూడా కారణమని వెంబు ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా అభిప్రాయపడ్డారు.వెంబు ఈ వ్యాఖ్యలు చేస్తూ మెక్ కలౌ ఫౌండేషన్ నివేదిక ఫలితాలను ఉటంకించారు. 300కు పైగా అధ్యయనాలను సమీక్షించి రూపొందించిన ఈ నివేదికలో రెండేళ్లలోపు పిల్లలకు సుమారు 32 టీకాలు వేయిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD)కు కారణమవుతున్నట్లు తెలిపారు. వెంబు తన పోస్ట్‌లో ‘తల్లిదండ్రులు ఈ విశ్లేషణను తీవ్రంగా పరిగణించాలి. చిన్న పిల్లలకు మితిమీరిన సంఖ్యలో టీకాలు ఇస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో కూడా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ ఆటిజం వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది’ అని పేర్కొన్నారు.వెంబు వ్యాఖ్యలు ఆన్లైన్లో చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆయన పోస్ట్‌కు మద్దతు తెలుపుతూ ‘ఈ మెసేజ్‌ను పంపడానికి చాలా ధైర్యం కావాలి’ అని ప్రశంసించగా, మరికొందరు టీకాల ఆవశ్యకతను, అవి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో పోషించిన పాత్రను నొక్కి చెబుతూ విమర్శిస్తున్నారు.Parents should take this analysis seriously. I believe there is increasing evidence that we are giving way too many vaccines to very young children. This is spreading in India too and we are seeing a rapid increase in autism in India. https://t.co/AeiVaieYug— Sridhar Vembu (@svembu) October 28, 2025ఆటిజం అంటే ఏమిటి?ఆటిజం అనేది ఒక న్యూరోడెవలప్‌మెంటల్ డిజార్డర్ (మెదడు అభివృద్ధికి సంబంధించిన సమస్య). దీన్ని సాధారణంగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అని పిలుస్తారు. ఇందులో స్పెక్ట్రమ్ అనే పదం ఈ వ్యాధి లక్షణాలు, తీవ్రత వ్యక్తినిబట్టి వైవిధ్యంగా ఉంటాయని సూచిస్తుంది. ఆటిజం లక్షణాలు సాధారణంగా చిన్న వయస్సులోనే (సాధారణంగా 2 సంవత్సరాల వయస్సులోపు) బయటపడుతాయి. తల్లిదండ్రులు లేదా ఇతరులు పేరు పెట్టి పిలిచినా స్పందించకపోవడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోలేకపోవడం లేదా వాటిని పంచుకోలేకపోవడం, ముఖ కవళికలను ఉపయోగించడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు ఆటిజంలో భాగంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టెస్లాకు బై..బై? -
గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్
పెరుగుతున్న బంగారం ధరలు.. ఆర్ధిక శ్రేయస్సు కంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిని సూచిస్తుందని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఎమ్ఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ రాసిన కథనంపై స్పందిస్తూ.. యూఎస్ మార్కెట్లపై చేసిన అంచనాతో తాను ఏకీభవిస్తున్నానని శ్రీధర్ వెంబు చెప్పారు. ''అమెరికా స్టాక్ మార్కెట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం కూడా ఒక పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సూచిస్తోంది. నేను బంగారాన్ని పెట్టుబడిగా భావించను, దానిని ఆర్థిక ప్రమాదానికి బీమాగా భావిస్తున్నాను. వ్యవస్థలోని అన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి AI కృషి చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని ఆయన ట్వీట్ చేశారు.గీతా గోపీనాథ్ ఏమన్నారంటే?వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇటీవల బాగా దెబ్బతింది. డాట్ కామ్ క్రాష్ తరువాత జరిగిన దానికంటే.. స్టాక్ మార్కెట్ కరెక్షన్ మరింత తీవ్రమైంది. టారిఫ్ యుద్ధాలు.. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతర్లీన సమస్య అసమతుల్య వాణిజ్యం కాదు అసమతుల్య వృద్ధి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని మరిన్ని దేశాలు/ప్రాంతాల్లో అధిక వృద్ధి మరియు రాబడి అవసరం.పెట్టుబడిదారులు చాలావరకు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోతోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడం మాత్రమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వంలో కొత్త ఆందోళనలు పుడుతున్నాయి. ఈ తరుణంలో 2026 జనవరి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు.. ముఖ్యంగా చైనా, జపాన్లలో బలమైన డిమాండ్ కారణంగా ప్రపంచ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) వ్యవస్థాపక సభ్యుడు & మాజీ చైర్మన్ అనంత పద్మనాబన్ పేర్కొన్నారు.I agree with Dr Gita Gopinath.The US stock market is in a clear and massive bubble.The degree of leverage in the system means that we cannot rule out a systemic event like the global financial crisis of 2008-9. Gold is also flashing a big warning signal. I don't think of… https://t.co/7xVPL3FXDq— Sridhar Vembu (@svembu) October 18, 2025 -
‘ఐయామ్ సారీ.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటా..’
జోహో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా కొన్ని రోజులు దూరంగా ఉంటానని ప్రకటించారు. కంపెనీ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కొన్ని కోడ్లను మరింత సమర్థవంతంగా సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇటీవల కాలంలో ఎక్స్ వంటి సామాజిక మధ్యమాల్లో చాలా చురుకుగా ఉన్న వెంబు తాను రన్ చేయాలనుకునే కొన్ని కోడ్లను మెరుగుపరిచేందుకు కొంతకాలం ఆన్లైన్ ఎంగేజ్మెంట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పనిలో నాణ్యత ముఖ్యమని చెప్పడం కంటే మనమే ఆ పనిని సమర్థంగా చేసి చూపించాలన్నారు. తన సోషల్ మీడియా అనుచరులకు ఇలా కఠినమైన పరిమితిని విధించవలసి వచ్చినందుకు చింతిస్తున్నానని చెప్పారు.ఇటీవల కాలంలో కంపెనీ తయారు చేసిన దేశీయ ఆన్లైన్ కమ్యునికేషన్ ప్లాట్‌ఫామ్ అరట్టై యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆ యాప్‌ను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్‌కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా తాను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నానంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలుఅరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీకి కూడా క్రేజ్ పెరుగుతోంది. అయితే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తున్న జోహో (Zoho)వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు.. తాను బంగారాన్నే(Gold) నమ్ముతా అంటున్నారు.క్రిప్టో క్రేజ్ లేదా తాజా మార్కెట్ ట్రెండ్లకు లోనుకాకుండా బంగారాన్ని సంపదకు విశ్వసనీయమైన నిల్వగా కొనసాగిస్తున్నారు. కరెన్సీ క్షీణతకు రక్షణగా బంగారాన్ని భావించే శిబిరంలో 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈమేరకు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోప్ట్ పెట్టారు. తనకు క్రిప్టోకరెన్సీలపై ఆసక్తి లేదని, బంగారాన్ని స్థిరమైన, కాలాతీత పెట్టుబడిగా చూస్తానని పేర్కొన్నారు. లిన్ ఆల్డెన్ అనే స్థూల ఆర్థిక వ్యూహకర్త చేసిన విశ్లేషణలో కూడా ఇదే భావనను సమర్థిస్తుందని ప్రస్తావించారు. ఆమె పరిశోధన ప్రకారం, అమెరికా ట్రెజరీ బాండ్లు, స్టాక్స్,రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ద్రవ్యోల్బణాన్ని అనుసరించే బంగారాన్ని దీర్ఘకాలంలో అధిగమించలేకపోయాయి.ఆల్డెన్ చెప్పినట్లు, కేవలం 4 శాతం స్టాకులే మార్కెట్ రాబడికి ముఖ్య కారణమవుతాయి. రియల్ ఎస్టేట్ కూడా పన్నులు, నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల వల్ల బంగారంతో పోలిస్తే తక్కువ పనితీరు చూపించింది.ఇదిలా ఉండగా, 2025లో ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు వంటివి బంగారం ధరలు ఔన్స్‌కు 4,000 డాలర్లు (రూ. 3.57 లక్షలు) దాటేలా చేశాయి. ఈ పరిణామాలు వెంబు నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్ కియోసాకిశ్రీధర్ వెంబు లాజిక్ స్పష్టంగా ఉంది. బంగారం తక్షణ లాభాల కోసం కాదు, ఇది దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం. “బంగారం ఓర్పునకు సంబంధించినది” అని చెబుతూ, ఆధునిక హైప్‌తో నిండిన పెట్టుబడి ప్రపంచంలో ఆయన దృఢమైన వైఖరి విశిష్టంగా నిలుస్తోంది.I have long been in the "gold as insurance against currency debasement" camp, for over 25 years now. Over the long term, gold has held its purchasing power in terms of commodities like petroleum, and gold has held its own against broad stock market indexes. No, I am not… pic.twitter.com/dyfnCFa7T6— Sridhar Vembu (@svembu) October 12, 2025 -
జోహో మెయిల్ క్రియేట్ చేసుకోండిలా..
దేశీయ ఈమెయిల్ ఫ్లాట్ ఫామ్ జోహో మెయిల్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. సురక్షితమైన, ప్రకటన రహిత సేవల కోసం యూజర్లు దేశీయ కంపెనీ ఈమెయిల్ ఫ్లాట్ ఫామ్‌కు మారుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తన అధికారిక ఈమెయిల్ ఐడీని జోహో మెయిల్ కు మార్చినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జోహో మెయిల్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ కథనంలో చూద్దాం..జోహో మెయిల్ (Zoho Mail) వ్యక్తిగత, బిజినెస్ ఈమెయిల్ సర్వీసులు రెండింటిని అందిస్తుంది. మీరు వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాను సృష్టించాలని చూస్తున్నట్లయితే, మీరు డొమైన్ లేకుండా వ్యక్తిగత ఖాతా కోసం నేరుగా సైన్ అప్ చేయవచ్చు.సైన్ అప్ చేయడం కోసం జోహో మెయిల్‌ని సందర్శించి పర్సనల్ ఈమెయిల్ ఎంచుకోండి.ఈమెయిల్ అడ్రస్ కోసం యూజర్‌నేమ్ ఎంచుకోండి. ఎంచుకునే యూజర్‌నేమ్ చెల్లుబాటు అయ్యేలా, గౌరవప్రదంగా ఉండాలి. మీ ఈమెయిల్ అడ్రస్ ఈ ఫార్మాట్ లో ఉంటుంది: username@zohomail.com (యూఎస్ డేటా సెంటర్ యూజర్ల కోసం)సంబంధిత చిహ్నాలను క్లిక్ చేయడం ద్వారా మీరు గూగుల్ / ఫేస్ బుక్ / ట్విట్టర్ / లింక్డ్ఇన్ ద్వారా ఫెడరేటెడ్ సైన్-ఇన్ ను ఉపయోగించి ఉచిత ఈమెయిల్ ఖాతా కోసం సైన్ అప్ చేయవచ్చు. ఈ సందర్భంలో కూడా, మీరు యూజర్‌నేమ్ భాగాన్ని ఎంచుకోవాలి. ఇది ఈమెయిల్ ఖాతాను సృష్టించడానికి అవసరం.మీ కోసం గుర్తుంచుకోవడానికి సులభమైన పాస్ వర్డ్ ను అందించండి. కానీ ఇతరులకు ఊహించడం కష్టంగా ఉండాలి. అక్కడ పేర్కొన్న నియమాలకు అనుగుణంగా పాస్ వర్డ్ ఉండాలి.తర్వాత అక్కడ సూచించిన చోట చోట మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అందించండి.ధృవీకరణ కోసం అవసరమైన మీ ఫోన్ నంబర్ ను అందించండి. (మీ ఏరియా కోడ్ తో సహా 10 అంకెల నెంబరు, ఎలాంటి డ్యాష్ లు లేదా ఖాళీలు లేకుండా)సర్వీస్ నిబంధనలను చదివి, అంగీకరించండి. ఉచిత కోసం సైన్ అప్ బటన్ ను క్లిక్ చేయండి.తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా ధృవీకరణ కోడ్ ను అందుకుంటారు. ఖాతాను ధృవీకరించడానికి, ఉపయోగించడానికి ధృవీకరణ కోడ్ నమోదు చేయండిమీ ఈమెయిల్ ఖాతా ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈమెయిల్స్ పంపడానికి, అందుకోవడానికి మీరు దానిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. -
ఒకప్పుడు సెక్యూరిటీ గార్డు..ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా..
కనీసం డిగ్రీ కూడా లేకుండా ఉద్యోగం సంపాదించడం కష్టం. అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే..అస్సలు సాధ్యం కాదు. కానీ ఈ వ్యక్తి ఏ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడో అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేయని ఈ వ్యక్తి ఎలా ఇంత పెద్ద ఉద్యోగాన్ని సంపాదించగలిగాడో వింటే..నేర్చుకోవడం విలువ కచ్చితంగా తెలుస్తుంది. లింక్డ్ఇన్లో వైరల్‌గా మారిన ఇతని స్టోరీ నేటి తరాని స్ఫూర్తి. ఎన్ని డిగ్రీలు చేశామన్నాది కాదు స్కిల్ ఎంత ఉంది అన్నది ముఖ్యం అని చెబుతోంది ఇతడి కథ.అతడే అబ్దుల్ అలీమ్. లింక్డ్ ఇన్ పోస్ట్‌లో తన సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా మారిన తన సక్సెస్ జర్నీని షేర్ చేసుకున్నారు. 2013లో ఇంటి నుంచి వెయ్యి రూపాయలతో బయటకొచ్చేశానని, రైలు టికెట్ కోసం రూ. 800లు ఖర్చు చేశానంటూ నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు అబ్దుల్. చిన్నపాటి ఉద్యోగం కూడా లేకపోవడంతో ఎక్కడకి వెళ్లలేని తన దీనస్థితిని గురించి వివరించాడు. అలా రెండు నెలలు వీధుల్లో గడిపిన అనంతరం..జోహో సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనికి కుదిరాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పదోతరగతి వరకే చదివిన అతడికి హెచ్‌టీఎంఎల్(HTML)పై కొంచెం పట్టు ఉంది. అయితే మరింతగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా..అదెలా అనేది తెలియలేదు అబ్ధుల్కి. సరిగ్గా ఆ సమయంలో జోహోలో సీనియర్ ఉద్యోగి శిబు అలెక్సిస్‌తో పరిచయం..ఒక్కసారిగా అబ్దుల్ జీవితమే మారిపోయింది. అతడు అబ్దుల్ మాటల్లో ఏదో చేయాలనే తపనను గుర్తించి..మార్గనిర్దేశం చేసేందుకు ముందుకొచ్చాడు. అలా ఎనిమినెలల పాటు పగటిపూట భద్రతా విధులను పూర్తి చేసి, సాయంత్రం ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడు అబ్దుల్. చివరికి ఒకరోజు వినియోగదారు ఇన్పుట్ను దృశ్యమానం చేసే ఒక సాధారణ యాప్‌ను రూపొందించాడు. దానిని అలెక్సిస్ జోహూ మేనేజర్‌కు చూపించాడు. దీంతో మేనేజర్ అబ్దుల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. అయితే తనకు డిగ్రీ లేకపోవడంతో కాస్త తడబడుతున్న అబ్దుల్ని చూసి ఆ కంపెనీ మేనేజర్..కాలేజ్ డిగ్రీ అవసరం లేదు, నైపుణ్యం ఉంటే చాలు అంటూ అతడిని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా నియమించారు. అలా సెక్యరిటీ గార్డుగా పనిచేసిన ఎనిమిదేళ్ల తర్వాత అదే కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా నియమాకం అందుకున్నాడు. ఇలా తన కథను వివరిస్తూ..తనకు గురువులా మార్గనిర్దేశం చేసిన శిబు అలెక్సిస్‌కు, అలాగే తనని తాను నిరూపించుకునేలా అవకాశం ఇచ్చిన జోహో కంపెనీ మేనేజర్‌కి ధన్యావాదాలు తెలిపాడు పోస్ట్‌లో. చివరగా ఆయన "నేర్చుకోవడం అనేది ఎప్పుడైనా ప్రారంభించొచ్చు..ఆలస్యం అనే పదానికి ఆస్కారం లేదు" అని పోస్ట్‌ని ముగించారు. కాగా, జోహో అనేది చెన్నైకి చెందిన గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ. 1996లో శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ కంపెనీ సరసమైన సాంకేతికత, డేటా గోప్యత, భారతదేశంలో ఉత్పత్తులను నిర్మించడంలో ప్రసిద్ధి చెందింది. యూఎస్ సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో అనేకమంది మంత్రులు ఈ దేశీ టెక్కంపెనీని ప్రమోట్చేయడంతో జోహూ కంపెనీ వార్తల్లో నిలిచింది. (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
వాట్సప్‌కు పోటీగా అరట్టై.. 75 లక్షల డౌన్లోడ్స్!
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'అరట్టై'కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ యాప్ శుక్రవారం నాటికి మొత్తం 75 లక్షల డౌన్లోడ్లను అధిగమించింది. అంటే అంతమంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇది ఇటీవలి కాలంలో.. అతి తక్కువ కాలంలో ఎక్కువ డౌన్లోడ్స్ పొందిన యాప్‌లలో ఒకటిగా నిలిచింది.ఇప్పటి వరకు చాలామంది భారతీయులు.. మెటా యాజమాన్యంలోని వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇక దేశీయ యాప్ అరట్టైను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్‌కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా నేను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నా అంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్‌ఫ్లిక్స్‌కు రూ.2 లక్షల కోట్ల నష్టం!➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఆనంద్ మహీంద్రా ఫోన్లో కొత్త యాప్ డౌన్లోడ్
వాట్సాప్ మాదిరి దేశీయ కంపెనీ జోహో తయారు చేసిన ఆన్లైన్ కమ్యునికేషన్ యాప్ ‘అరట్టై’(Arattai)ని గర్వంగా డౌన్లోడ్ చేసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్‌లోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దేశీయ టెక్నాలజీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంలో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. జోహో సంస్థ కొత్తగా రూపొందించిన చాట్, కాలింగ్ యాప్ అరట్టైకి ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మద్దతు ప్రకటించారు. ‘గర్వంగా అరట్టైను డౌన్లోడ్ చేశా’ అని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనికి యాప్ అధికారిక హ్యాండిల్ తక్షణమే స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అరట్టై ప్లాట్ఫామ్లోకి ఆయనను ఆహ్వానించింది.దీనిపై కంపెనీ చీఫ్ శ్రీధర్ వెంబు స్పందిస్తూ.. ‘నేను మా తెన్కాసి కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో సమావేశంలో ఉన్నాను. యాప్‌కు మెరుగుదలలు చేస్తున్నాం. మా టీమ్‌లో ఒక సభ్యుడు ఈ ట్వీట్‌ను చూపించాడు. ధన్యవాదాలు @anandmahindra. మీ మద్దతు మాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ‘మీ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ప్రోత్సహించారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..


