నేడు అన్ని రంగాల్లోనూ ఏఐ హవా కొనసాగుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి.. వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ సహాయం చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తుంది. ఇలాంటి అనుభవమే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబుకు ఎదురైంది.
జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు (Sridhar Vembu)కు.. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో జోహో సంస్థ మా కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందా?, అని అందులో ఉంది. అయితే అందులో అప్పటికే ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కంపెనీల పేర్లు, వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది.
నాకు మొదటి మెయిల్ వచ్చిన కొంతసేపటికి మరో మెయిల్ వచ్చింది. అందులో రహస్య సమాచారం పంచుకున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ సమాచారం పంపించింది ఒక ఏఐ ఏజెంట్ (AI Agent) అని, ఏఐ ఏజెంట్‌గా ఇది తన తప్పిదమేనని అది పేర్కొంది, అని శ్రీధర్ వెంబు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..
ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన రహస్యాలను కూడా బయటపెడుతోందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు జోక్స్, మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవును పతనానికి ప్రయత్నాలు చేస్తుందా? అని ఇంకొందరు చెబుతున్నారు.
I got an email from a startup founder, asking if we could acquire them, mentioning some other company interested in acquiring them and the price they were offering.
Then I received an email from their "browser AI agent" correcting the earlier mail saying "I am sorry I disclosed…— Sridhar Vembu (@svembu) November 28, 2025


