Sridhar Vembu
-
‘మన టాలెంట్ పోతోంది’.. సీఈవో వార్నింగ్
స్టార్టప్ బూమ్‌లో భారత్ దూసుకుపోతున్నప్పటికీ, యూపీఐ వంటి ఫిన్‌టెక్ విజయగాథలు మనకు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరముందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి దేశంలోని ఉత్తమ సాంకేతిక మేధావులు విదేశాలకు వెళ్లకుండా ఉండాలంటే దేశానికి తీవ్రమైన రియాలిటీ చెక్ అవసరమని చెప్పారు.ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ఒక వివరమైన పోస్ట్ పెట్టారు. భారత ఇన్నోవేషన్ సామర్థ్యాలను నాలుగు కేటగిరీలుగా విశదీకరించారు. ఒక్కో అంశానికి మార్కులు సైతం ఇచ్చారు. దేశంలో ప్రైవేట్ రంగం ధృడంగా వ్యవహరించాలని, స్వదేశంలో నిజమైన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. విమానయాన సంస్థలు, బ్యాంకింగ్, రిటైల్ వంటి ప్రాసెస్ ఆధారిత రంగాల్లో భారత్ ప్రకాశిస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడంలో వెనుకబడి ఉందని, మన టాలెంట్ (ప్రతిభావంతులు) విదేశాలకు వెళ్లిపోతోందని శ్రీధర్ వెంబు హెచ్చరించారు.ప్రాసెస్ ఇన్నోవేషన్ లో భారత్ 70 శాతం మంచి స్కోర్ సాధిస్తుందని వెంబు అన్నారు. కానీ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ విషయషంలో మాత్రం కేవలం 35% మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఇది ఆశాజనకంగా ఉండవచ్చంటూ యూపీఐ ఆవిష్కరణను ఉదహరించారు. దేశానికి సమర్థవంతమైన ప్రాజెక్ట్ మేనేజర్లు మాత్రమే కాకుండా మరింత దూరదృష్టి కలిగిన ఉత్పత్తి సృష్టికర్తలు అవసరమని నొక్కి చెప్పారు.ఇక టెక్నాలజీ విషయంలో శ్రీధర్ వెంబు అసలు స్కోరే ఇవ్వలేదు. అంతటితో ఆగకుండా తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చారు. భారతదేశపు టాప్ టెక్ టాలెంట్ ను విదేశీ సంస్థలు తీసేసుకుంటున్నాయని, టెక్ టాలెంట్‌ను నిలుపుకోవడం, వెనక్కి తీసుకురావడం కోసం దేశ ప్రైవేటు రంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందు కోసం ఇక్కడ ప్రతిష్టాత్మక అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సూచించారు.సైంటిఫిక్ పురోగతుల కేటగిరీకి స్కోర్ ఇవ్వడానికి ఈ విషయంలో "మనం కనీసం పరీక్ష కూడా రాయలేదు" అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు. ఉత్పత్తులు, సాంకేతిక రంగాల్లో ప్రైవేటు సంస్థలు ముందంజలో ఉండాలని, డీప్ సైన్స్ కు ప్రభుత్వ నిధులు అవసరమని ఆయన అన్నారు. 20వ శతాబ్దపు అనేక ఆవిష్కరణలకు నాంది పలికిన ప్రఖ్యాత అమెరికన్ రీసెర్చ్ హబ్ బెల్ ల్యాబ్స్ వంటిది భారత్‌లోనూ రావాల్సిన అవసరం ఉందన్నారు. -
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
రిటైల్ మార్కెట్లలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ .1 లక్ష దాటిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారంపై భారతదేశ సాంప్రదాయ విశ్వాసాన్ని ప్రశంసించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు, ఆర్థికవేత్తలు, బిట్కాయిన్లను తీసిపారేస్తూ వాఖ్యానించారు.బంగారం ధర రూ.లక్షను దాటిన క్రమంలో కోటక్ మహింద్రా బ్యాంక్ ఫౌండర్, డైరెక్టర్ ఉదయ్ కోటక్.. భారతీయ గృహిణి తెలివైన ఫండ్ మేనేజర్ అంటూ ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తూ శ్రీధర్ వెంబు కూడా ‘ఎక్స్’లో మరో పోస్ట్ పెట్టారు."బంగారం రూ .1 లక్షను దాటడంతో ఉదయ్ కోటక్ భారతీయ గృహిణిని తెలివైన ఫండ్ మేనేజర్‌గా ప్రశంసించారు. ఉదయ్ కోటక్ గారితో నేను మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. భారతీయులకు బంగారంపై ఉన్న ప్రేమ, కాగితపు ఆస్తులపై ఉన్న అపనమ్మకమే మన దీర్ఘకాలిక సుస్థిరతకు, నాగరికత కొనసాగింపునకు పునాది" అని రాసుకొచ్చారు.ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు, పీహెచ్డీ ఆర్థికవేత్తలకు, వారి ఫ్యాన్సీ సిద్ధాంతాలకు డబ్బు చాలా ముఖ్యమైనది. ఇక తన లాంటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయితే బిట్ కాయిన్ వైపు చూస్తున్నారని రాసుకొచ్చిన ఆయన 'బంగారమే డబ్బు' అంటూ పేర్కొన్నారు. సామాన్య భారతీయుడికి ఈ విషయం (బంగారం విలువ) తెలుసు. ఓవైపు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నప్పటికీ భారత్ స్థిరత్వం బంగారం నుంచే వచ్చిందంటూ పోస్టును ముగించారు.బంగారం ధర మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమవారం ఎంసీఎక్స్‌లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.99,178 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. భౌతిక మార్కెట్లో, బంగారం 10 గ్రాములకు రూ .97,200 వద్ద ట్రేడ్ అయింది. దీనికి 3% జీఎస్టీ కలిపిన తర్వాత తుది రిటైల్ ధర రూ.1 లక్ష దాటింది. -
ఏఐతోనే 90 శాతం కోడింగ్.. కానీ..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐ వాడకం ఎక్కువవుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో దీని ఉపయోగం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏఐ కోడింగ్, టెస్టింగ్, ఎగ్జిక్యూటింగ్ వంటి కీలక పనులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ కోడింగ్‌కు సంబంధించి జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోడింగ్‌లో ఏఐ సామర్థ్యం ఏమేరకు ఉంటుందో అంచనా వేస్తూ భవిష్యత్తులో దాని పనితీరును విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.‘ఏఐ 90 శాతం కోడ్‌ను రాస్తుందని ఎవరైనా చెప్పినప్పుడు నేను వెంటనే అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రోగ్రామర్లు రాసే వాటిలో 90 శాతం బాయిలర్ ప్లేట్లు(కాపీ చేసేందుకు వీలుగా ఉండే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు). ప్రోగ్రామింగ్ రెండు రకాల సంక్లిష్టతను కలిగి ఉంటుంది. ఒకటి-ముఖ్యమైన సంక్లిష్టత.. ఇందులో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా కోడింగ్‌ను కొత్తగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. రెండు ప్రమాదవశాత్తు సంక్లిష్టత-ఏదైనా అత్యసవర సమయాల్లో కోడింగ్‌లో సాయం అవసరం అవుతుంది. దాన్ని తొలగించడానికి కృత్రిమ మేధ ఎంతో తోడ్పడుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మానవులు కనుగొన్న నమూనాల ప్రకారం కోడింగ్‌లో సహకారం అందిస్తుంది. ఇది పూర్తిగా కొత్త నమూనాలు సృష్టిస్తుందా..? మానవుల మాదిరిగానే ఏఐ చాలా అరుదుగా కొత్త నమూనాలను తయారు చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఇది ఏమేరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు’ అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’When people say "AI will write 90% of the code" I readily agree because 90% of what programmers write is "boiler plate".There is "essential complexity" in programming and then there is a lot of "accidental complexity" (that is the boiler plate stuff) and this is very old wisdom…— Sridhar Vembu (@svembu) March 22, 2025 -
గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. వచ్చిన దారిని, మూలలను మరచిపోకూడదు. డబ్బు సంపాదించగానే లగ్జరీకి అలవాటుపడే మనుషులున్న ఈ రోజుల్లో కూడా.. వేలకోట్ల రూపాయల కంపెనీ అతని సారథ్యంలో ఉన్నప్పటికీ, నిరాడంబరంగా.. పంచె కట్టుకుని జీవితం గడిపేస్తున్నారు. ఇంతకీ అయన ఎవరు? ఆయన స్థాపించిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడులో జన్మించిన 'శ్రీధర్ వెంబు'.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, నేడు ఎంతోమందికి ఆదర్శమయ్యారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని.. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించారు. కానీ కొన్ని రోజులకు మంచి ఉద్యోగాన్ని వదిలి, ఇండియాకు వచ్చేసారు.ఉద్యోగం వదిలి, భారత్ వచ్చిన తరువాత.. సొంత సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అదే నేడు అందరికి సుపరిచయమైన.. 'జోహో కార్పొరేషన్'. చాలా మంది ప్రజలు మంచి అవకాశాల కోసం గ్రామాల నుంచి నగరాలకు, ఆపై విదేశాలకు తరలిపోతున్న సమయంలో వెంబు ఈ ధోరణిని తిప్పికొట్టారు.అమెరికాను విడిచిపెట్టి తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి తిరిగి వచ్చి, అక్కడ నుంచే ఇప్పుడు తన బిలియన్ డాలర్ల కంపెనీని నడుపుతున్నారు. జోహో ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది, కానీ వెంబు 630 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెన్కాసికి సమీపంలోని మారుమూల గ్రామమైన మథలంపారైలో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు.శ్రీధర్ వెంబు తీసుకున్న ఈ నిర్ణయం.. కంపెనీని అభివృద్ధికి మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడానికి దోహదపడింది. దీంతో భారత ప్రభుత్వం.. 72వ గణతంత్ర దినోత్సవం నాడు వెంబుకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందించింది.గ్రామీణ ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేయాలనే.. వెంబు ఆలోచన చాలామందిని ఆశ్చర్యపరిచింది. గ్రామాలను వదిలి నగరాలకు ప్రజలు తరచుగా వెళ్లే వలస ధోరణిని తిప్పికొట్టాలనే గ్రామంలో ఆఫీస్ స్టార్ట్ చేసినట్లు శ్రీధర్ వెంబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.వెంబు తెన్కాసిలో ఒక చిన్న కార్యాలయాన్ని అద్దెకు తీసుకొని ప్రారంభించారు. ఆ తరువాత మథలంపారైలో ఒక పాత ఫ్యాక్టరీని కొనుగోలు చేసి, దానిని టెక్ క్యాంపస్‌గా మార్చారు. వెంబు కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోనే ఆగిపోలేదు. ఆయన జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇక్కడ ఉన్నత పాఠశాల, డిప్లొమా విద్యార్థులు వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు.ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే!శ్రీధర్ వెంబు ప్రారంభించిన.. జోహో కార్పొరేషన్ విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ. కాగా ఈయన ఆస్తి రూ. 28వేలకోట్ల కంటే ఎక్కువని సమాచారం. వేలకోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వెంబు చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. రోజువారీ ప్రయాణానికి ఆయన సైకిల్ ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సూట్ కాకుండా.. పంచె కట్టుకుంటుటారు. ఇటీవలే 'శ్రీధర్ వెంబు' తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. -
జోహో సీఈఓ రాజీనామా: న్యూ చాప్టర్ బిగిన్ అంటూ ట్వీట్
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ జోహో కార్పొరేషన్ (Zoho Corporation) ఫౌండర్ 'శ్రీధర్ వెంబు' (Sridhar Vembu) తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేయనున్నట్లు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తూ.. పరిశోధన, కంపెనీ అభివృద్ధికి దోహదపడనున్నట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పులతో పాటు.. తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ వెంబు తెలిపారు. అంతే కాకుండా నేను నా వ్యక్తిగత గ్రామీణ అభివృద్ధి మిషన్‌ను కొనసాగించడంతో పాటు.. R&D కార్యక్రమాలపై పూర్తి సమయం దృష్టి కేటాయిస్తానని తెలిపారు.కంపెనీ కో ఫౌండర్ శైలేష్ కుమార్ డేవే కొత్త సీఈఓగా వ్యవహరిస్తారు. మరో సహ వ్యవస్థాపకుడు టోనీ థామస్ జోహో యూఎస్‌ను లీడ్ చేస్తారు. రాజేశ్ గణేశన్ మేనేజ్‌ఇంజిన్ డివిజన్‌ను, మణి వెంబు జోహో.కామ్ డివిజన్‌ను లీడ్ చేస్తారని.. కంపెనీ భవిష్యత్తు పూర్తిగా మనం R&D ఛాలెంజ్‌ని ఎంత బాగా నావిగేట్ చేస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను కూడా టెక్నికల్ వర్క్‌కి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీ1996లో శ్రీధర్ వెంబు AdventNet అనే నెట్వర్క్ పరికరాల ప్రొవైడర్ల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హౌస్‌ను స్థాపించారు. ఇదే 2009లో జోహో కార్పొరేషన్‌గా మారింది. గత సంవత్సరం 5.85 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 39వ సంపన్నుడిగా నిలిచిన శ్రీధర్ వెంబు.. 2021లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు.A new chapter begins today. In view of the various challenges and opportunities facing us, including recent major developments in AI, it has been decided that it is best that I should focus full time on R&D initiatives, along with pursuing my personal rural development mission.…— Sridhar Vembu (@svembu) January 27, 2025