
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'అరట్టై' (Arattai)కు ఆదరణ పెరుగుతోంది. లక్షలమంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే కొందరికి అరట్టై అంటే ఏమిటో బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో దీని గురించి తెలుసుకుందాం.
అరట్టై అనేది తమిళ పదం. దీనిని ఏ భాషలో ఎలా పిలవాలి అనే విషయాన్ని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్వీట్ చేసారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో అరట్టైకు తెలుగులో 'మాటలాట' (మాట్లాడుకోవడం) అని సూచించారు.
జోహో మెసేజింగ్ యాప్.. అరట్టై మెటా యాజమాన్యంలోని వాట్సాప్'కు ప్రత్యర్థిగా వచ్చింది. ఇందులో వాట్సాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు.
How to say "Arattai" in various languages. pic.twitter.com/ynqBe4euBo
— Sridhar Vembu (@svembu) October 11, 2025
అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు
●అరట్టై ఆండ్రాయిడ్ టీవీలకు, ఆ స్థాయి పరికరాలకు యాక్సెస్ అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.
●అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్‌లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యూ' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.
●అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: ఏఐ ట్రాఫిక్ సిస్టం: ఎవ్వరూ తప్పించుకోలేరు!