పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Zohos Sridhar Vembu urges entrepreneurs to marry have kids in 20s | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్‌ కౌంటర్‌

Nov 19 2025 2:19 PM | Updated on Nov 19 2025 4:46 PM

Zohos Sridhar Vembu urges entrepreneurs to marry have kids in 20s

రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. అంతేగాదు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ నెటిజన్లు కూడా మండిపడ్డారు. ఇదే తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు సైతం ఉపాసనకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తూ పోస్టు పెట్టడంతో మరోసారి ఉపాసన పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు..దానికి శ్రీధర్‌ వెంబూ ఏం కౌంటరిచ్చారు అంటే..

ఉపాసన నవంబర్‌ 17 ఐఐటీ హైదరాబాద్‌కి వెళ్లి అక్కడ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా ఉపాసన అక్కడి అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే.. ముందు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. పైగా అమ్మాయిలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ వాళ్ల ఎగ్స్ (అండాలు)ను సేవ్ చేసి పెట్టుకోవడమే అని, దీనివల్ల మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని, ముందు ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచించింది. 

తాను కూడా అలాగే చేసినట్లు చెప్పింది. పైగా అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట పెనుదూమారం రేపాయి. ఏం చెబుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అదే తరుణంలో జోహో ఫౌండర్‌ మాజీ సీఎం శ్రీధర్‌ వెంబు కూడా ఉపాసన్‌ పోస్ట్‌పై ఘాటుగా స్పందించారు. ఆయన ఉపాసన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. వివాహం చేసుకుని, 20 ఏళ్ల లోపు పిల్లలను కనండి అని యువతకు పిలుపునిచ్చారు. 

ఇది మనం సమాజానికి, మన పూర్వికులకు అందించే జనాభా విధిగా పేర్కొన్నారు. తాను అదే విశ్వసిస్తానని కూడా చెప్పారు. తాను కలిసే ప్రతి యువ వ్యవస్థాపకుడికి ఇదే విషంయ చెబుతానని కూడా అన్నారు. అంతేగాదు పురుషులు మహిళలు ఇద్దరూ వివాహం చేసుకుని, 20 ఏళ్ల లోపు పిల్లలను కనాలని, దానిని వాయిదా వేయద్దని సూచించారు కూడా.  వారు సమాజానికి, వారి స్వంత పూర్వీకుల పట్ల జనాభా విధిని నిర్వర్తించాలని నొక్కి చెప్పారు. 

ఈ భావన వింతగా, పాతకాలం మాటలులా అనిపించొచ్చు. కానీ ఈ ఆలోచన కచ్చితంగా ప్రతిధ్వనిస్తుందని నమ్ముతున్నా అంటూ ఉపాసన కొణిదెల పోస్ట్‌ని రీట్వీట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియో ఎక్స్‌లో పేర్కొన్నారు శరీధర్‌ వెంబు. కాగా, గత నెలలో ఉపాసన, రామ్‌చరణ్‌ తాము రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన శ్రీమంతం వేడుక వీడియోని కూడా నెట్టింట షేర్‌ చేశారు.

 

చదవండి: అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్‌ రైడ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement