విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం సాహితీ సుగంధాలు వెదజల్లుతోంది. చల్లని సాయంత్రం వేళలో వేలాదిగా కొలువుదీరిన పుస్తకాలు ఆహ్వానం పలుకుతుండగా..వేదికలపై ప్రముఖుల ప్రసంగాలు..మ్యాజిక్‌షోలు, విద్యార్థుల ప్రదర్శనలు ఆకర్షిస్తున్నాయి.
విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణం మూడో రోజు ఆదివారం జనసంద్రంగా మారింది. రోజు కావడంతో...పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తక ప్రియులు వివిధ స్టాళ్లను ఆసక్తిగా తిలకిస్తూ..ఆయా వేదికలపై కార్యక్రమాలను ఆస్వాదించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


