ఆ గ్రామంలో న్యూ ఇయర్‌ వేడుకలు ఎలా జరుగుతాయంటే..! | This Madhya Pradesh Village Rings In New Year The Rustic Way | Sakshi
Sakshi News home page

ఆ గ్రామం న్యూ ఇయర్‌కి ఎలా స్వాగతం పలుకుతోందంటే..?

Dec 31 2025 6:19 PM | Updated on Dec 31 2025 6:29 PM

 This Madhya Pradesh Village Rings In New Year The Rustic Way

కొద్దిసేపటిలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ తరుణంలో నగరాలు, పట్టణాలు  ఏ రేంజ్‌లో సందడిగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఎటు చూసిన ఆధునిక హంగులతో, డీజే మోతలతో అదరహో అనిపించే రేంజ్‌లో దద్దరిల్లిపోతాయి. అయితే ఈ గ్రామంలోని న్యూ ఇయర్‌ వేడుకలు నాటి కాలంలోకి, మరుపురాని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయేలా అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటోంది. ఏఐ టెక్నాలజీతో దూసుకుపోతున్న  ఈ కాలంలో ఇలా న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోవడం అస్సలు చూసుండరు. ముఖ్యంగా పర్యాటకులను సైతం ఆకర్షించేలా న్యూ ఇయర్‌ వేడుకలుకు అత్యంత ముగ్ధమనోహరంగా సిద్ధమైంది ఆ గ్రామం.

ఆ గ్రామమే మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా దేవ్‌గఢ్ గ్రామం ప్రత్యేక గ్రామీణ నేపథ్యంతో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ మధ్యప్రదేశ్‌ పర్యాటక బోర్డు పర్యాటకుల్ని ఆకర్షించేలా ఇలా విన్నూతన మార్గంలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. అక్కడ మూడురోజులు పాటు న్యూ ఇయర్‌ వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి

ఆ మూడు రోజుల కార్యక్రమాల్లో గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా సంప్రదాయ భారతీయ ఆటలు, విందు వినోదాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నాటి అనుభవాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.

ఎలా జరుగుతాయంటే..
సందర్శకులు గాలిపటం ఎగరవేయడం, స్కిప్పింగ్‌(తాడాట), కర్రబిళ్ల, పిట్టు, గోళీలు, లట్టు, ఎద్దుల బండి సవారీలు, వంటి నాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చేలా సాంస్కృతిక కార్యకలాపాలతో అలరించనుంది. అక్కడ సుందరమైన పరిసరాల మధ్య ఈ ఏర్పాట్లు చేశారు పర్యాటక నిర్వాహకులు. ముఖ్యంగా నారింజ తోటలలో టీ ఆస్వాదిస్తూ..ఈ ఆటపాటల్లో ఆడిపాడి సందడి చేయొచ్చు. అయితే ఈ ఆటల్లో పాల్గొనడం, ఎంజాయ్‌ చేయడం అన్ని ఉచితమేనట. 

ఇది కేవలం సందర్శకులకు గ్రామీణ జీవితాన్ని పరిచయం చేస్తూ..అందులో లీనమయ్యేలా చేయడమే లక్ష్యంగా ఈ న్యూ ఇయర్‌ని వేడుకలను ఇలా అసాధారణమైన రీతిలో జరుపుతోంది అక్కడి ప్రభుత్వం. దీన్ని అక్కడి పర్యాటక బోర్డు, జిల్లా పురావస్తు పర్యాటక శాఖ,  జిల్లా యంత్రాంగం సంయుక్తంగా సాంస్కృతిక ప్రదర్శనలు, స్థానిక క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2026ని స్వాగతించడానికి అసాధారణమైన సాంస్కృతిక  మార్గాన్ని ఎంచుకుని పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించనుంది.

చరిత్రకు, ప్రకృతికి నెలవైన గ్రామం
దేవ్‌గఢ్ ఒకప్పుడు 18వ శతాబ్దంలో గోండ్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ పురాతన దేవాలయాలు, కోటలు, సుందరమైన బెత్వా నది ఉన్నాయ. ఇవి చారిత్రక సహజ సౌందర్యాన్ని అందిస్తాయి. పర్యాటకులకు సాంప్రదాయ ఆతిథ్యంతో స్వాగతం పలుకుతూ..దీనిని ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక విహార కేంద్రంగా మార్చే యోచనలో ఉండి అయక్కడ యంత్రాంగం.
 

(చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement