అదే నా ఐడేంటిటీ | Actress Eesha Rebba About Lifestyle | Sakshi
Sakshi News home page

అదే నా ఐడేంటిటీ

Feb 15 2026 12:13 AM | Updated on Feb 15 2026 12:13 AM

Actress Eesha Rebba About Lifestyle

సింపుల్‌గా కనిపిస్తుంది. కాని, సీరియస్‌ డెసిషన్స్ తీసుకోవడం బాగా తెలుసు ఈ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకి. అందుకే, గ్లామర్‌ ట్యాగ్స్‌కి దూరంగా, పెర్ఫార్మెన్స్ రోల్స్‌కి దగ్గరగా ఉంటూ, చాలా జాగ్రత్తగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..  

నేను వరంగల్‌లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. ఎంబీఏ చేశాను. కాలేజీలో ఉండగానే మోడలింగ్‌ చేసేదాన్ని. ఫేస్‌బుక్‌లో నా ఫోటోలు చూసిన ఇంద్రగంటి మోహనకృష్ణ నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు.

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నా మొదటి సినిమా. కాని, ‘అంతకు ముందు ఆ తరువాత’ నన్ను హీరోయిన్ గా గుర్తింపునిచ్చిన సినిమా. గ్లామర్‌ కంటే పెర్ఫార్మెన్స్‌ ముఖ్యమని అప్పుడే అర్థమైంది.

హీరోయిన్‌ అవ్వకముందు నా రోజు చాలా బిజీగా ఉండేది. ఉదయం కాలేజీ, మధ్యాహ్నం సాఫ్ట్‌వేర్‌ జాబ్, సాయంత్రం ఇంకో పని. అప్పుడే హార్డ్‌ వర్క్‌ అలవాటు అయిపోయింది.

‘అ!’ సినిమాలో లెస్బియన్‌ పాత్ర చేశాను. చాలామంది షాక్‌ అయ్యారు. కాని, నేను మాత్రం కొత్తగా ట్రై చేయాలనే ఫీలింగ్‌తో ఎంతో ఎంజాయ్‌ చేశాను. రిస్క్‌ తీసుకోకపోతే గ్రోత్‌ ఉండదు కదా.

నేను తెలంగాణ అమ్మాయినే. కాని, ‘ఓం శాంతి శాంతిః’ సినిమా కోసం తూర్పు గోదావరి యాసలో మాట్లాడాను. యాస మారడం నాకు సరదానే. అదే సినిమాలోని ఒక సీన్‌ కోసం నిజంగానే హీరో నా చెంపపై కొట్టారు. ఆ సీన్ లో కనిపించే కన్నీళ్లు యాక్టింగ్‌ కాదు. నా ప్యూర్‌ రియాక్షన్‌.

కెరీర్‌ మొదట్లో నా రంగు గురించి, లుక్స్‌ గురించి చాలా కామెంట్స్‌ వచ్చాయి. అప్పట్లో చాలా బాధపడ్డాను. ఇప్పుడు మాత్రం నా రంగుపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే నా ఐడెంటిటీ.

రిలేషన్ షిప్‌ రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. నేను ఒక వ్యక్తికి దగ్గరగా ఉన్న మాట నిజమే. పెళ్లి గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. సరైన సమయం వస్తే నేనే చెప్తాను.

కాఫీ లేకుండా నా రోజు ప్రారంభం కాదు. ఖాళీ దొరికితే ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడం నాకు చాలా ఇష్టం.

ఫిట్‌నెస్‌ నాకు సీరియస్‌ విషయం. యోగా, జిమ్, కిక్‌బాక్సింగ్‌ రెగ్యులర్‌. స్ట్రాంగ్‌గా ఉండాలంటే కష్టపడాల్సిందే అని నమ్ముతాను.

ఎప్పటికైనా సరే మహిళా ప్రాధాన్యం ఉన్న చరిత్రాత్మక పాత్ర ఒకటి చేయాలన్న కల నన్ను వెంటాడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement