టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ ప్రీమియర్స్ గురువారం రోజు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బంపరాఫర్ ప్రకటించింది.
పెయిడ్ ప్రీమియర్స్‌కు వచ్చే కపుల్స్‌కు ఒకటి టికెట్ కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ ప్రకటించింది. అయితే కేవలం కపుల్స్ మాత్రమేనని తెలిపింది. ఈ ప్రీమియర్ షోలను ఏపీలోని ఏషియన్ ముక్త సినిమాస్ (విశాఖపట్నం), వీపీసీ (అమలాపురం), మినీ రేవతి (మచిలీపట్నం), గౌతమి (అనంతపురం) థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది.
మరోవైపు తక్కువ ధరకే ఈ సినిమాని చూసేలా రెగ్యులర్ షో టికెట్లపై చిత్ర బృందం ఇప్పటికే ఆఫర్ ప్రకటించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.99 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 ప్లస్ జీఎస్టీతో కలిపి టికెట్ ధరలను నిర్ణయించింది. ఈ మూవీని భార్య, భర్తల మధ్య జరిగిన కథాంశంగాదర్శకుడు ఏఆర్ సజీవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
affordable prices ki Ticket unte Footfalls and Repeat audience ekkuva untaru 👌🏻
Exallent decision Asalu 👏😍#OmShantiShantiShantihi pic.twitter.com/VpXQFIFsEM— Pavan Tarakian☆ 🌊 (@pavantarak_09) January 25, 2026
Exclusive : Excellent offer from #OmShantiShantiShantihi for tomorrow premiers mainly for couples 🔥🔥🔥💥💥💥
Buy 1 Get 1 Free 💥💥💥🥳🥳🥳#TharunBhascker #EeshaRebba pic.twitter.com/jFW5XeHLRS— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) January 28, 2026


