అసభ్య కామెంట్స్‌.. పోలీసులకు హీరోయిన్‌ ఫిర్యాదు | Eesha Rebba Police Complaint over Abusive Comment | Sakshi
Sakshi News home page

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బ

Feb 4 2026 2:23 PM | Updated on Feb 4 2026 2:53 PM

Eesha Rebba Police Complaint over Abusive Comment

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్‌ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈషా రెబ్బ పెట్టిన పోస్ట్‌కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్‌ పెట్టాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఈషా.. అతడి ఐడీతో పాటు కామెంట్‌ను చూపించింది.

కేసు నమోదు
ఆమె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి ఇలా చెండాలంగా కామెంట్స్‌ పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు. కాగా ఈషా రెబ్బ.. ఇటీవల 'ఓం శాంతి  శాంతి శాంతిః' సినిమాలో నటించింది.

చదవండి: చిన్నతనంలో నేను పడ్డ బాధ.. అందుకే పిల్లలు వద్దు: నటి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement