యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ | JD Chakravarthy Angry On Chandrahas Singing Song | Sakshi
Sakshi News home page

నేను కాదు ఆమె చప్పట్లు కొట్టింది.. చంద్రహాస్ పాటపై జేడీ ఆగ్రహం

Feb 4 2026 12:10 PM | Updated on Feb 4 2026 12:17 PM

JD Chakravarthy Angry On Chandrahas Singing Song

ఈ మధ్యన తెలుగు సినిమాల్లోని పాటల్లో బూతు సాహిత్యం ఎక్కువవుతోంది. సోషల్ మీడియాలో ఉపయోగించే కొన్ని పదాల్ని.. రచయితల ట్రెండింగ్ పేరిట యదేచ్ఛగా వాడేస్తున్నారు. తాజాగా యాటిట్యూడ్ స్టార్ అనబడే హీరో చంద్రహాస్.. అందరూ చూస్తుండగా ఏకంగా స్టేజీపైనే బూతు పాట పాడాడు. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ పాట విని జేడీ చక్రవర్తి చప్పట్లు కొట్టాడని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే విషయమై జేడీ స్పందించాడు. చంద్రహాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడు షాక్‌లో ఉన్నా. ఏం పాడుతున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. కానీ తన పాటని నేను ఎంజాయ్ చేస్తున్నట్లు, చప్పట్లు కొడుతున్నట్లు కొందరు ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. అసలు నేనా పని చేయలేదు. కావాలంటే పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈవెంట్లలో గెస్టులు.. స్టేజీపై ఎవరేం మాట్లాడుతున్నారో సరిగా పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్లే అతడి పాటని సరిగా పట్టించుకోలేదు. నా పక్కనున్న అమ్మాయికి తెలుగు అర్థంకాక పాప చప్పట్లు కొట్టింది. అది చూసిన చాలామంది నేను కూడా చప్పట్లు కొట్టాననుకున్నారు. నేను బూతులు మాట్లాడను. నా ముందు ఎవరు మాట్లాడినా సహించను'

(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత)

'ఓసారి సెట్‍‌లో బూతులు మాట్లాడాడని ఓ దర్శకుడిని కొట్టా. నా పక్కన అమ్మాయికి అతడు బూతులు పాడుతున్నాడని చెబితే చప్పట్లు కొట్టడం ఆపేసి షాకైంది. పాట టైంలో జయంత్, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. అప్పుడే లేచి వెళిపోదామనుకున్నాను. కానీ పూజా బేడీ.. అలా చేయొద్దని నన్ను వారించింది. అందుకే సైలెంట్‌గా ఉండాల్సి వచ్చింది. చంద్రహాస్ అలా చేయడాన్ని సమర్థించను. ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకుంటే అది వాళ్ల భ్రమ మాత్రమే' అని జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చాడు.

టీవీ నటుడు ప్రభాకర్ కొడుకే చంద్రహాస్. గతంలో వచ్చిన 'రామ్‌నగర్ బన్నీ' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రమోషన్ల టైంలోనే యాటిట్యూడ్ చూపించడం, చిత్రమైన హావభావాలతో యాటిట్యూడ్ స్టార్‌గా అందరూ ట్రోల్ చేశారు. ఆ పదాన్నే తన పేరుకి ముందు తగిలించుకున్నాడు. తొలి మూవీ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా' చిత్రంతో వస్తున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్‌కి 6 నెలలు ట్రైనింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement