breaking news
Chandrahass
-
ఆటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా.. రిలీజైన టీజర్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కొత్త సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా సినిమా ఉండనుంది. పరస్పరం గొడవలు పడే ఊరిలో లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. దీనికి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అని చంద్రహాస్ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
'రామ్‌నగర్ బన్నీ' మూవీ రివ్యూ
యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తొలి సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తన మేనరిజం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కుర్రాడు హీరోగా చేసిన ఫస్ట్ మూవీ 'రామ్‌నగర్ బన్నీ'. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఎలా ఉంది? యాటిట్యూడ్ స్టార్ హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ)కథేంటి?రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సోషల్ మీడియా పుణ్యాన ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారనేది చెప్పలేం. అలా ఫేమస్ అయిన కుర్రాడు చంద్రహాస్. ఇతడి పేరే మర్చిపోయేంతలా యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. కానీ దీన్ని ట్యాగ్ లైన్ వాడేసి మనోడి కొత్త సినిమాని తీసుకొచ్చేశారు. ఇక ఫస్ట్ మూవీ కాబట్టి తెలుగులో ఎప్పటినుంచో ఉన్నట్లే కమర్షియల్ లెక్కలేసుకుని మరీ సినిమా తీశారు.ఓ ఆంటీ తనని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని బన్నీ అనే కుర్రాడు బాధపడే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అలా తన కథ చెబుతాడు. అల్లరి చేస్తూ కాలేజీ చదివే కుర్రాడు. అతడికో ఫ్యామిలీ. పక్కనే నలుగురు ఫ్రెండ్స్. అనుకోకుండా రోడ్డుపై అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, కొన్నాళ్ల లవ్ చేసిన తర్వాత మరో అమ్మాయి కనిపించేసరికి ఈమెని వదిలేస్తాడు. తీరా రెండో అమ్మాయి వీడిని మోసం చేస్తుంది. వీళ్లిద్దరిపై ఉన్నది ప్రేమ కాదని, వేరే అమ్మాయిపై తనకు అసలు ప్రేమ ఉందని తెలుసుకుంటాడు. తర్వాత ఏమైంది? ఇదంతా కాదన్నట్లు బన్నీ జీవితంలోకి వచ్చిన తార అనే ఆంటీ ఎవరు అనేది చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.సినిమా చూస్తున్నంతసేపు సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కాసిన్ని కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్.. మధ్యలో ఓ నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్. కమర్షియల్ సినిమాకు ఇంతకంటే ఏం కావాలంటారా? ఒకవేళ ఈ తరహా మూవీస్ ఇష్టముంటే 'రామ్‌నగర్ బన్నీ' మీకు నచ్చేయొచ్చు. రెండున్నర గంటల సినిమాలో కొన్ని సీన్లు కాస్త ల్యాగ్ అనిపిస్తాయి తప్పితే ఓవరాల్‌గా చల్తా చల్తా ఎంటర్టైనర్.ఎవరెలా చేశారు?యాట్యిట్యూడ్ అని ట్రోల్ చేస్తే, దాన్నే తన పేరుగా మార్చుకున్న చంద్రహాస్.. యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్స్.. ఇలా అన్నింట్లో బాగానే కష్టపడ్డాడు. శైలుగా చేసిన విస్మయ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన అమ్మాయిలు మిగతా ముగ్గురు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే రెండు మూడు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ సినిమాలో సెట్ కాలేదు. దర్శకుడు శ్రీనివాస్ మహత్ తీసుకున్న లైన్ పాతదే. కానీ కాస్త మెరిపించే ప్రయత్నం చేశాడు. మరీ అదరగొట్టేశాడని చెప్పలేం గానీ పాస్ అయిపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చూస్తే యాటిట్యూడ్ స్టార్ ఎంట్రీ టెస్టులో పాస్ అయిపోయినట్లే!-చందు డొంకాన.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)