టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సంపత్ రుద్ర దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 6న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఘర్షణ పడితే ఎలా ఉంటుంది? అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండనుంది.


