breaking news
Chandrahas
-
హీరో బూతు పాట.. అక్కడున్నవారికి తెలీదు: నిర్మాత
సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ప్రమోషన్స్‌ది కీలక పాత్ర. కానీ, ప్రమోషన్స్‌లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ దెబ్బతింటుంది. అందుకు దండోరా సినిమాయే సాక్ష్యం. సినిమా బాగున్నప్పటికీ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన నీచపు కామెంట్స్ వల్ల జనాలు దండోరాను లైట్ తీసుకున్నారు. ఇదంతా చూశాక కూడా జాగ్రత్తపడకపోతే మొదటికే మోసం వస్తుంది.బూతు పాటవిషయమేంటంటే.. బుల్లితెర హీరో ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ తనలో సింగింగ్ టాలెంట్ బయటపెట్టాడు. అయితే అత్యుత్సాహంతో అసభ్య పదాలున్న పాట పాడాడు. స్టేజీపై అందరిముందు ఇలా బూతు పాట పాడటంతో అతడిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రహాస్‌పై పోలీస్ కేసు కూడా నమోదైంది.పొరపాటుకు చింతిస్తున్నాంఈ క్రమంలో బరాబర్ ప్రేమిస్తా టీమ్ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాలన్న ఉద్దేశంతో ఒక పాట పాడాడు. ఆ పాటలో కొంచెం పొరపాటు జరిగింది. దానిగురించి ఈవెంట్లో ఉన్న ఎవరికీ తెలియదు. అతడు కావాలని చేయలేదు. ఏదేమైనా పొరపాటు జరిగినందుకు మేము బాధపడుతున్నాం అన్నాడు.సినిమాలో అలాంటి పాటల్లేవ్దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్ పాటలో తప్పులు దొర్లాయి. అందుకు చింతిస్తున్నాం. సినిమాలో మాత్రం అలాంటి పాటలు లేవు అని వెల్లడించాడు. అటు జేడీ చక్రవర్తి కూడా ఆ పాట పాడినప్పుడు తాను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్‌గా చేయడం తప్పు కాదని, కానీ, అవి అసభ్యంగా, ఆడవారిని కించపర్చేలాగా ఉండకూడదన్నాడు.చదవండి: మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. ఆరుసార్లు రక్తమార్పిడి: ప్రియాంక భర్త ఎమోషనల్ -
యాటిట్యూడ్ కాదది అహంకారం.. చంద్రహాస్‌పై కేసు
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదైంది. తను నటించిన బరాబర్ ప్రేమిస్తా అనే మూవీలో బూతు పాటపై సోషల్‌మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ పాడిన పాట వివాదాలకు కారణమైంది. అందులో అసభ్య పదాలు ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్ అశోక్‌కుమార్ తప్పబడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. పాటలో చంద్రహాస్ ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకంగా ఉందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన చంద్రహాస్ కౌంటర్‌గా సదరు జర్నలిస్టును బెదిరిస్తూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశారు. దీంతో అశోక్‌కుమార్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తండ్రిగా ప్రభాకర్ వైఫల్యం.. చంద్రహాస్‌పై సైకాలజిస్ట్ విశేష్ కామెంట్సినిమా సక్సెస్ కోసం సభ్యతాసంస్కారాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయారన్నది ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న వికృత చేష్టలు చూస్తుంటే అర్థమవుతోంది.ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వికృత ప్రవర్తన అందుకు తాజా ఉదాహరణ. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అది కుళ్ళిపోతున్న సామాజిక ధోరణికి నిదర్శనం.'తప్పుడు' ప్రయాణంపిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే, సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పడం ముఖ్యం. వేదికపై మహిళలు ఉన్నారనే కనీస జ్ఞానం లేకుండా బూతు పదాలతో పాట పాడటం 'యాటిట్యూడ్' కాదు, సంస్కారహీనత. తండ్రి వెనక ఉండి నడిపిస్తున్నాడా? లేక కొడుకు దారి తప్పుతుంటే మౌనంగా చూస్తున్నాడా? కారణం ఏదైనా, పక్కనే ఉండి అసభ్యతను ప్రోత్సహించడం "తండ్రిగా పేరెంటింగ్ వైఫల్యమే." సైకాలజీ ఏం చెబుతోంది?సైకాలజీ పరిభాషలో దీనిని 'Attention Seeking Narcissism' అంటారు. అంటే, మంచిగా గుర్తింపు రానప్పుడు, అసభ్యతతోనైనా సరే వార్తల్లో ఉండాలనే పైశాచిక ఆనందం. "నేను సారీ చెప్పను" అనడం మొండితనం కాదు, తనలోని ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి 'అహంకారం' అనే ముసుగు వేసుకుంటున్నాడు.విమర్శలను స్వీకరించలేని వాడు విజ్ఞుడవ్వలేడు, ప్రజాదరణ పొందిన నటుడవ్వలేడు.షార్ట్ కట్ సక్సెస్... లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్వైరల్ అవ్వడం అంటే విజయం సాధించడం కాదు. నెగటివ్ పబ్లిసిటీతో సినిమాను గట్టెక్కించవచ్చు ఏమో కానీ, వ్యక్తిగా ప్రజల గుండెల్లో గౌరవాన్ని కోల్పోతే దాన్ని సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు. జెడి చక్రవర్తి వంటి సీనియర్ల అసహనం చూసైనా మారాలి.'యాటిట్యూడ్ స్టార్' కాదు... 'అజ్ఞాన స్టార్'స్టార్డమ్ అనేది ప్రవర్తనలో ఉండాలి, పిచ్చి చేష్టల్లో కాదు. సభ్యత నేర్వని విద్య, సంస్కారం లేని కళ రెండూ వ్యర్థమే. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు... కానీ మనిషిగా ఓడిపోకూడదు. ఇప్పటికైనా ఆ తండ్రీ కొడుకులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే, ప్రేక్షకులు ఇచ్చే తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది. -
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్‌లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదునేను ఎవరికీ సారి చెప్పనుఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదుమూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారుఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026 -
సినిమా ప్రమోషనా.. బూతు కచేరీనా?.. ఇంత బరి తెగించాలా?
ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా ముఖ్యం. కథపై దర్శకుడికి నమ్మకమున్నా సరే మూవీ ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. అందుకే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్స్‌తో పాటు ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్‌ల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆడియన్స్‌తో పంచుకుంటారు. దీనివల్ల సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. అలా సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రమోషన్స్ అనేది సినీ ఇండస్ట్రీలో తప్పనిసరి.అయితే ప్రమోషన్స్ పేరిట ఆడియన్స్‌ను తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అలాంటిదే జరిగింది. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ ఈనెల 6వ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ నటించారు. రిలీజ్‌కు దగ్గరవుతున్న వేళ సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.అంతా బాగానే ఉన్నా.. ఈవెంట్లో పాడిన ఓ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. హీరో చంద్రహాస్ ఒక వివాదాస్పదమైన బూతు పాట పాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సినీ ప్రియులే కాదు.. నెటిజన్స్ సైతం తీవ్రస్తాయిలో అతనిపై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బరితెగించాలా అంటూ గడ్డిపెడుతున్నారు. అసలు ఆ బూతు పాటలేంటని మండిపడుతున్నారు. కేవలం నెగెటివ్ పబ్లిసిటీ కోసమే ఇంతలా అసభ్యకర భాషను వాడతారా అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Attitude Star Chandrahas Singing Performance 🤯pic.twitter.com/C24OQSnpEG— cinee worldd (@Cinee_Worldd) February 2, 2026 -
‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చంద్రహాస్ 'బరాబర్ ప్రేమిస్తా' ట్రైలర్
టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించగా.. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సంపత్ రుద్ర దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 6న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఘర్షణ పడితే ఎలా ఉంటుంది? అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండనుంది. -
సినిమాలు వర్కవుట్ కాకపోతే సీరియల్స్? చంద్రహాస్ ఆన్సరిదే!
ప్రభాకర్ బుల్లితెరపై స్టార్ యాక్టర్‌గా రాణిస్తుంటే అతడి కొడుకు చంద్రహాస్ సినిమాల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. రామ్‌నగర్ బన్నీ మూవీతో హీరోగా పరిచయమైన అతడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీయే బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.అది నా లక్ష్యం కాదుఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చంద్రహాస్ సీరియల్స్‌పై ఆసక్తి ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. చంద్రహాస్ మాట్లాడుతూ.. నేను సీరియల్స్ చేస్తాననాలే కానీ నాన్న ఇప్పటికిప్పుడు నాలుగైదు సీరియల్స్‌లో నన్నే హీరోగా పెట్టేస్తాడు. డబ్బు సంపాదించాలంటే సీరియల్స్ బెటర్. నాకు డబ్బు సంపాదించడం లక్ష్యం కాదు. ఒకవేళ 5, 10 ఏళ్ల తర్వాత నాకు సినిమాలు వర్కవుట్ కావడం లేదంటే టీవీకి వెళ్లిపోవచ్చు. యాంకర్‌గా రెండు షోలు ఇప్పిస్తాడు లేదంటే సీరియల్స్‌లో హీరోగా చేయిస్తాడు.టీవీ చాలా ఈజీనాన్న వల్ల టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం, అవకాశాలు సంపాదించడం నాకు చాలా ఈజీ.. ఇది ఎప్పటికైనా నాకు బ్యాకప్‌లా పనిచేస్తుంది. కానీ, అంతవరకు రానివ్వను. టీవీని నేను లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు డబ్బుపై అంత ఆసక్తి, ఆశ లేదు. నాన్న బాగానే సంపాదించాడు. నేనేం పని చేయకపోయినా అది నాకు సరిపోతుంది అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు.చదవండి: చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరంటే? -
ప్రభాకర్ కొడుకుని కాకపోయుంటే ఎన్నో మూవీస్..
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రామ్‌నగర్ బన్నీ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఆ మూవీయే బరాబర్ ప్రేమిస్తా. ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. అర్జున్ మహి విలన్‌గా యాక్ట్ చేశాడు. నాన్న సపోర్ట్ చేయలేదుసంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో చంద్రహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రహాస్ మాట్లాడుతూ.. నాకు 17 ఏళ్ల వయసున్నప్పటి నుంచే యాక్టింగ్ వైపు రావాలనిపించింది. నాన్న సపోర్ట్ చేయలేదు. 25 ఏళ్లు వచ్చాకే సపోర్ట్ చేస్తానన్నాడు. అప్పటిదాకా ఖాళీగా ఎందుకుండాలి? అనుకున్నాను. ట్రిప్పులు తిరిగాను. అప్పటికి నేను 12th పాస్ అంతే! దాంతో మా అమ్మ బ్లాక్మెయిల్ చేసింది.అమ్మ ఏడుపు వల్లే..నా కొడుకు 12వ తరగతి వరకే చదివాడని ఎలా చెప్పుకోవాలి? తలెత్తుకుని ఎలా తిరగాలి? అని ఏడ్చేసింది. తనకోసం కాలేజీలో జాయిన్ అయ్యా.. ఓపక్క చదువుకుంటూనే సినిమాలు, షార్ట్ ఫిలింస్‌కి ట్రై చేద్దామనుకున్నాను. ఓ పెద్ద ఆఫీస్‌కు వెళ్తే చాలాసేపు వెయిట్ చేయించారు. చివరకు ఆ క్యారెక్టర్‌కు నేను సెట్ కానని చెప్పారు. కనీసం ఆఫీస్ లోపలకు కూడా పిలవలేదు. నేను ప్రభాకర్ కొడుకునని ఆయనకు తెలుసు. నేను ఆయన కొడుకును కాకపోయుంటే వాళ్లు చేసినదాన్ని పట్టించుకునేవాడినే కాదు. ఆయన కొడుకుని కాకపోయుంటే..అసలు ప్రభాకర్ కొడుకుని కాకపోయుంటే ఈపాటికి చాలా సినిమాలు చేసేవాడిని.. చిన్న క్యారెక్టర్ లేదా పెద్ద పాత్రలు ఏవైనా చేసుకుంటూ పోయేవాడిని. కానీ, ఇప్పుడు నాకు ఆ స్వేచ్ఛ లేదు. ఆరోజు జరిగిన ఘటనతో గట్టిగా ఒకటి డిసైడయ్యా.. నన్ను ఉన్నత విద్య కోసం భారీగా ఖర్చు పెట్టి విదేశాలకు పంపించొద్దు.. ఆ డబ్బు ఏదో నేను చేయబోయే పాటకు ఇవ్వు. రూ.10-15 లక్షలు ఇస్తే ఓ పాట చేసుకుంటా అన్నాను. అది చూసి ఎవరైనా సినిమా ఛాన్సులిస్తారన్నది నా ఆశ!అనుకున్నట్లే సినిమా ఆఫర్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు.చదవండి: బిస్కెట్స్ తిని కడుపు నింపుకున్నా: హీరో -
‘బరాబర్ ప్రేమిస్తా’తో విక్టరీ కొట్టబోతున్నాం: చంద్రహాస్
చంద్రహాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా, అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. సంపత్ రుద్ర దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్లో నిర్వహించారు. ఫిబ్రవరి 6న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ – ‘‘ఫిబ్రవరి 6న ‘బరాబర్ ప్రేమిస్తా’తో విక్టరీ కొట్టబోతున్నాం అని నమ్మకంగా చెబుతున్నాను’’ అన్నారు. సంపత్ రుద్ర మాట్లాడుతూ – ‘‘ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఘర్షణ పడితే ఎలా ఉంటుంది? అనేదే మా సినిమా. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మకంగా సాగుతుంది’’ అని చెప్పారు. -
లిటిల్ హార్ట్స్.. మరీ అంత బాగోలేదు: యాటిట్యూడ్ స్టార్
ప్రముఖ నటుడు ప్రభాకర్ తనయుడు, హీరో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahas) కొత్త మూవీ చేస్తున్నాడు. అదే కాయిన్. తన బర్త్‌డే (సెప్టెంబర్ 17) సందర్భంగా కాయిన్ టైటిల్ పోస్టర్‌తో పాటు, గ్లింప్స్ వీడియో సైతం రిలీజ్ చేశారు. జైరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీకాంత్ రాజా రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్లో చంద్రహాస్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఏది బాగుందన్న ప్రశ్నకు చంద్రహాస్ ఇలా స్పందించాడు.ఎంజాయ్ చేశా.. కానీ!లిటిల్ హార్ట్స్ కామెడీ ఎంటర్టైనర్. కామెడీ సినిమాలు అప్పటికప్పుడు చూసి నవ్వుకుని వదిలేస్తాను. ఆ మూవీ చాలా బాగుందనైతే నేను చెప్పలేను. కాకపోతే ఎంజాయ్ చేశానంతే! అని చెప్పుకొచ్చాడు. రామ్‌నగర్ బన్నీ సినిమా నష్టాల గురించి స్పందిస్తూ.. మేము పెట్టినదాంట్లో సగానికంటే ఎక్కువ తిరిగొచ్చింది. కానీ ఆస్తులమ్ముకున్నాం, నష్టాల్లో కూరుకుపోయాం అన్న వార్తల్లో నిజం లేదు అని చంద్రహాస్ క్లారిటీ ఇచ్చాడు.చదవండి: ప్రముఖ నటుడు రోబో శంకర్ కన్నుమూత -
‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ బాణీని సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో చూస్తుంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. -
Barabar Premistha : ఆకట్టుకుంటున్న ఆటిట్యూడ్ స్టార్ ‘రెడ్డి మామ’ సాంగ్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ‘రెడ్డి మామ’ అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు మెచ్చుకున్నారు. చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. త్వరలోనే రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. -
నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే
జవహర్‌నగర్/దుమ్ముగూడెం/చర్ల/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మృతుల్లో చంద్రహాస్ కూడా ఉన్నారు. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్‌కు చెందిన అలువాల లచ్చువమ్మ–నర్సింహ దంపతుల కుమారుడే చంద్రహాస్ అలియాస్ పాండు. 1967లో యాప్రాల్‌లో జన్మించిన చంద్రహాస్ విద్యాభ్యాసం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. 1981లో టెన్త్ ఫెయిల్ అయ్యాడు. అప్పుడే నక్సల్బరీ ఉద్యమం జోరందుకుంది. 1984–85లో ఆర్‌వైఎల్ కార్యదర్శి ప్రభు నాయకత్వంలో జరిగిన రాజకీయ సమావేశాలకు హాజరయ్యేవాడు. ఇలా ఆ సమావేశాలకు వెళ్లి ఆకర్శితుడై అడవిబాట పట్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రహాస్ ఇంటికి కూడా రాలేదు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి ఛత్తీస్‌గఢ్ స్టేట్ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. పార్టీలోనూ కీలకంగా వ్యవహరించాడు. అబూజ్‌మడ్‌లో సుదీర్ఘకాలం పనిచేయడంతో ఆ ప్రాంతంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. ఎన్కౌంటర్లో చంద్రహాస్ చనిపోయినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చంద్రహాస్ కుటుంబ సభ్యులను మావోయిస్టు పార్టీ మాజీ నేతలు, సానుభూతిపరులు, బంధుమిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, ఉపాధ్యక్షురాలు సత్య, కార్యవర్గ సభ్యురాలు ఉష, జననాట్య మండలి మాజీ సభ్యుడు రాజనర్సింహ తదితరులు పరమార్శించారు. చంద్రహాస్ మృతదేహాన్ని చూసి పాతకాలం మిత్రులు గుర్తు పట్టారని పద్మకుమారి చెప్పారు. మావోల డంప్ స్వాదీనం.. భద్రతా బలగాల జాయింట్ ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరిధి మెటగూడెం–దులేర్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, ఆయుధ తయారీ సామగ్రి గురువారం బయటపడ్డాయి. మెటగూడెం గ్రామానికి 1.5 కి.మీ. దూరంలో ఒక గుహలో దాచిన ఈ డంప్‌లో 21 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (ఐఈడీలు), మల్టిపుల్ బ్యారల్ గ్రెనేడ్ లాంచర్లు (బీజీఎల్), బాంబులు, ఒక జనరేటర్, ఇతర సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. బలగాలకు తప్పిన పెనుప్రమాదం బీజాపూర్ జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు బాసగూడ–ఆవుపల్లి మార్గంలో తిమ్మాపూర్ సమీపంలోని దుర్గామాత ఆలయం వద్ద వంతెన కింద మందుపాతరను గురువారం గుర్తించారు. అయితే, దీనిని తీయాలని భావించినా చాలా లోతులో, భారీ సైజులో ఉండడంతో అక్కడే నిర్వీర్యం చేశారు. 50 కిలోల బరువైన ఈ మందుపాతరను నిర్వీర్యం చేయడంతో బలగాలకు పెనుప్రమాదం తప్పినట్టయ్యింది. గణతంత్ర వేడుకలకు గట్టి భద్రత సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ వైపు తరలిరాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గణతంత్ర వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఎస్పీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు. -
ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్!
యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ తొలి సినిమానే 'రామ్ నగర్ బన్నీ'. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.రామ్ నగర్ బన్నీ కథేంటంటే..?రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
‘ఆటిట్యూడ్ స్టార్’ ట్యాగ్‌కి అర్హుణ్ణి కాదంటే తీసేస్తాను: చంద్రహాస్
‘‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ ఔట్పుట్ చూశాక సినిమా విజయంపై మాకు చాలా నమ్మకం వచ్చింది’’ అని చంద్రహాస్ అన్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వంలో చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ మహత్గారు ఫైట్స్, డ్యాన్స్, లవ్, ఎమోషన్, రొమాంటిక్ ఇలా... అన్ని షేడ్స్‌లో నన్ను బాగా చూపించారు. అన్ని అంశాలున్న ‘రామ్‌నగర్ బన్నీ’ నా తొలి సినిమా కావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రం చూశాక ‘ఆటిట్యూడ్ స్టార్’ అనే ట్యాగ్‌కు నేను అర్హుణ్ణి కాదంటే తీసేస్తాను. ఈ కథపై ఉన్న నమ్మకంతోనే మా నాన్న ప్రభాకర్‌గారు సినిమా నిర్మించారు. అన్ని జానర్ మూవీస్‌లో నటించి, మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతం నేను నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరో సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు. -
రామ్‌నగర్ బన్నీ ఇద్దరికీ హిట్ ఇవ్వాలి: రామ్‌గోపాల్ వర్మ
‘‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. బాగా నటించాడు కూడా. ఈ చిత్రం చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద విజయం ఇవ్వాలి’’ అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. చంద్రహాస్ హీరోగా శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ ΄÷డకండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ– ‘‘రామ్‌నగర్ బన్నీ’ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘మా అన్నయ్య చంద్రహాస్‌కు ‘రామ్‌నగర్ బన్నీ’ పెద్ద సక్సెస్ ఇవ్వాలి’’ అని దివిజ ప్రభాకర్ చెప్పారు. ‘‘మా మూవీని రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వారికి థ్యాంక్స్’’ అని మలయజ ప్రభాకర్ పేర్కొన్నారు. ‘‘నన్ను ఇంతకాలం ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెళ్లు మా ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రభాకర్ ΄÷డకండ. ‘‘మా ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా నచ్చని ప్రేక్షకులు మీ టికెట్‌ని ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు పంపితే మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను’’ అని చంద్రహాస్ తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, కరాటే రాజు, హీరోయిన్లు రిచా జోషి, రీతు మంత్ర, అంబికా వాణి, విస్మయ శ్రీ, సంగీత దర్శకుడు అశ్విన్ హేమంత్, నటులు సమీర్, సలీమ్ ఫేకు, ఫైట్ మాస్టర్ రాము, లిరిక్ రైటర్స్ అవినాష్, సాగర్ తదితరులు మాట్లాడారు. -
నలుగురు హీరోయిన్లతో 'రామ్‌నగర్ బన్నీ'.. టీజర్ వచ్చేసింది!
చంద్రహాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రభాకర్ మాట్లాడుతూ ..'నన్ను బుల్లితెరపై ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా..ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి.' అని అన్నారు.దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ' ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఉన్న ఒక కథ గురించి తెలిసి ఆయన వింటా అన్నారు. కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్తోనే చేయాలని ముందుకొచ్చాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. అతను హీరోగా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలనే అన్ని ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం. అక్టోబర్ 4న వస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు. -
నా స్థానంలో వేరేవాళ్లుంటే చచ్చిపోయేవాళ్లు: చంద్రహాస్
బుల్లితెర స్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రహాస్ తనపై వస్తున్న నెగెటివిటీ, ట్రోలింగ్‌పై స్పందించాడు. ఇది నా తొలి సినిమా. ఇలా స్టేజీ ఎక్కి మాట్లాడి రెండేళ్లవుతోంది. అప్పుడు నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా అని విపరీతంగా ట్రోల్ చేశారు.తండ్రిని చూసి గర్వపడాలిఅందరిముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరోలా ప్రవర్తించలేను. పైగా నేను తప్పు చేసినప్పుడు తిడితే పడతాను, కానీ ఏమీ చేయకముందే విమర్శిస్తే మాత్రం సహించను. ఇప్పుడు నేను మా నాన్న గురించి డబ్బా కొట్టబోతున్నాను. ఎవరైనా సరే తండ్రిని చూసి గర్వపడాలి. మీ నాన్నను చూసి గర్వపడటం లేదంటే దానంత దురదృష్టం మరొకటి లేదు.ఎవ్వర్నీ వదలనుమా నాన్న బుల్లితెర మెగాస్టార్. ఆయనొక డైరెక్టర్, యాక్టర్, నిర్మాత. వేల ఎపిసోడ్లలో నటించడమే కాకుండా ఎన్నో షోస్ చేశాడు. మా నాన్న గొప్ప హీరో కాబట్టి నాకు యాటిట్యూడ్ ఉంటుంది. నన్ను తిట్టినవారే ఈ రామ్‌నగర్ బన్నీ మూవీ చూసి పాజిటివ్‌గా మారతారని అనుకుంటున్నాను. తర్వాతి సినిమాకు మరికొందర్ని పాజిటివ్‌గా మారుస్తా.. అలా నన్ను నెగెటివ్‌గా చూస్తున్నవాళ్లందరినీ పాజటివ్‌గా మార్చేవరకు వదలను.ఎంకరేజ్ చేయండినాలాంటివాడు కనక హిట్టు కొట్టాడంటే ఈ జనరేషన్‌కు పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడినవుతాను. రేపు పొద్దున థియటర్లో యాటిట్యూడ్ స్టార్ అన్న టైటిల్ పడగానే.. మీరందరూ అరిచి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. నా స్నేహితులు చాలామంది నా స్థానంలో వాళ్లుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్లమని చెప్పారు. అది తప్పు, నాపై ఎంత దాడి చేసినా సరే.. నాకలాంటి ఆలోచనలు రావు. ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోను, నా పని నేను చేసుకుంటూ పోతాను అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. -
కొడుకుపై దారుణమైన ట్రోల్స్.. స్పందించిన నటుడు ప్రభాకర్
తన కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై బుల్లితెర మెగాస్టార్, టీవీ నటుడు ప్రభాకర్ ఆసక్తికర రీతిలో స్పందించాడు. కాగా బుల్లితెరపై నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. ఎన్నో సీరియల్స్‌కు నిర్మాతగా వ్యవహరించిన ఆయన చిన్న సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో సినీ, టీవీ రంగంలో దూసుకుపోతున్న ప్రభాకర్ తన వారసుడిగా కొడుకు చంద్రహాస్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కొడుకు ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన సౌందర్య రజనీకాంత్ ఇటీవల ఓ చానల్‌తో ముచ్చిటించిన ఆయన తన కొడుకును అందరికి పరిచయం చేశాడు. ఈ సందర్బంగా చంద్రహాస్‌ను చూపిస్తూ.. ‘హీరో కావాలనేది మా అబ్బాయి కల. ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు హీరోగా మూడు సినిమాలు చేస్తున్నారు. అందరి తనని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నాడు. ఈ క్రమంలో చంద్రహాస్ చూపించిన యాటీట్యూడ్, ఆయన నిలుచున్న తీరు చూసి అంతా అతడిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. వీడు హీరో ఏంటీ!.. ఇంకా ఒక్క సినిమా కూడా రాలేదు అప్పుడు పెద్ద స్టార్లా ఫోజులు కొడుతున్నాడు. బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటూ చంద్రహాస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తాజాగా ఓ తెలుగు మీడియాతో మాట్లాడిన ప్రభాకర్ కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. మీ కొడుకు మూవీ ఎంట్రీపై నెపోటిజం మీద ఏమైనా ట్రోల్స్ వచ్చాయా? అని హోస్ట్ అడగ్గా ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. వాడు వచ్చిందే ఇప్పుడు.. ఇంకా వాడి సినిమాలే బయటకు రాలేదు అన్నాడు. ‘‘పరిచయం చేసిన ఇంటర్య్వూపైనే అందరూ వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. ‘వీడు హీరో ఏంటీ? వాడు ఇటూ తిరిగాడు అటు తిరిగాడు ఎంటీ? జెబులో చేతులు పెట్టుకున్నాడేంటి. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్‌పై గురించి ఏమన్నదంటే.. యూటిట్యూడ్ చూపిస్తున్నాడు’ అంటూ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు. చంద్రహాస్ నిలబడ్డ స్టైల్ వాళ్లకి నచ్చలేదు. అదే చెప్పారు. రేపు యాక్టింగ్ ఎంత బాగా చేస్తే అంత బాగా ఆదరిస్తారు. జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారు. వారికి అనిపించింది చెబుతారు’ అని ప్రభాకర్ వ్యాఖ్యానించాడు. -
హీరోగా మారిన ప్రభాకర్ తనయుడు చంద్రహాస్
‘‘నేను ఇండ్రస్టీకి వచ్చి 25ఏళ్లు అయింది. మా అబ్బాయి చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది నా భార్య మలయజ. తాను చేసిన యూ ట్యూబ్ వీడియో ద్వారా నా ప్రమేయం లేకుండానే చంద్రహాస్ హీరోగా అవకాశాలు తెచ్చుకోవడం తండ్రిగా గర్వంగా ఉంది’’ అని నటుడు ప్రభాకర్ అన్నారు. ఆయన తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం కానున్నాడు. నేడు(సెప్టెంబర్ 17) చంద్రహాస్ పుట్టిరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘చంద్రహాస్ చేసిన ‘నాటు నాటు..’ అనే కవర్ సాంగ్ మంచి పేరుతో పాటు హీరోగా రెండు అవకాశాలు తేవడంతో ఆశ్చర్యపోయాను. వీటిలో కృష్ణ దర్శకత్వంలో కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి నిర్మిస్తున్న సినిమా, సంపత్ వి. రుద్ర డైరెక్షన్లో ఏవీఆర్, నరేష్గార్లు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే మా స్వంత సంస్థలో ఓ సినిమా నిర్మించనున్నాం’’ అన్నారు. ప్రభాకర్ భార్య మలయజ మాట్లాడుతూ.. ‘చంద్రహాస్ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్ వర్కర్. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘‘పరిశ్రమలోని చాలామందిని చూసి నటుడిగా స్ఫూర్తి పొందాను.. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌గార్లు.. వారి అంకితభావానికి హ్యాట్సాఫ్. హీరో అవ్వాలనేది నా కల.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కోసం కష్టపడతాను’’ అన్నారు చంద్రహాస్.


