Actor Prabhakar Response On Trolls On His Son Chandrahas - Sakshi
Sakshi News home page

Actor Prabhakar: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్‌.. నటుడు ప్రభాకర్‌ షాకింగ్‌ రియాక్షన్‌

Sep 22 2022 7:42 PM | Updated on Sep 22 2022 8:27 PM

Actor Prabhakar Response On Trolls On His Son Chandrahas - Sakshi

తన కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై బుల్లితెర మెగాస్టార్‌, టీవీ నటుడు ప్రభాకర్‌ ఆసక్తికర రీతిలో స్పందించాడు. కాగా బుల్లితెరపై నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. ఎన్నో సీరియల్స్‌కు నిర్మాతగా వ్యవహరించిన ఆయన చిన్న సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో సినీ, టీవీ రంగంలో దూసుకుపోతున్న ప్రభాకర్‌ తన వారసుడిగా కొడుకు చంద్రహాస్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: కొడుకు ఫొటో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయిన సౌందర్య రజనీకాంత్‌

ఇటీవల ఓ చానల్‌తో ముచ్చిటించిన ఆయన తన కొడుకును అందరికి పరిచయం చేశాడు. ఈ సందర్బంగా చంద్రహాస్‌ను చూపిస్తూ.. ‘హీరో కావాలనేది మా అబ్బాయి  కల. ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు హీరోగా మూడు సినిమాలు చేస్తున్నారు. అందరి తనని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నాడు. ఈ క్రమంలో చంద్రహాస్‌ చూపించిన యాటీట్యూడ్‌, ఆయన నిలుచున్న తీరు చూసి అంతా అతడిని ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. వీడు హీరో ఏంటీ!.. ఇంకా ఒక్క సినిమా కూడా రాలేదు అప్పుడు పెద్ద స్టార్‌లా ఫోజులు కొడుతున్నాడు.

బాగా యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడు అంటూ చంద్రహాస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తాజాగా ఓ తెలుగు  మీడియాతో మాట్లాడిన ప్రభాకర్‌ కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. మీ కొడుకు మూవీ ఎంట్రీపై నెపోటిజం మీద ఏమైనా ట్రోల్స్‌ వచ్చాయా? అని హోస్ట్‌ అడగ్గా ప్రభాకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. వాడు వచ్చిందే ఇప్పుడు.. ఇంకా వాడి సినిమాలే బయటకు రాలేదు అన్నాడు. ‘‘పరిచయం చేసిన ఇంటర్య్వూపైనే అందరూ వీపరితంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘వీడు హీరో ఏంటీ? వాడు ఇటూ తిరిగాడు అటు తిరిగాడు ఎంటీ? జెబులో చేతులు పెట్టుకున్నాడేంటి.

చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. హీరోయిన్‌పై గురించి ఏమన్నదంటే..

యూటిట్యూడ్ చూపిస్తున్నాడు’ అంటూ ఇష్టం వచ్చినట్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు. చంద్రహాస్‌ నిలబడ్డ స్టైల్‌ వాళ్లకి నచ్చలేదు. అదే చెప్పారు. రేపు యాక్టింగ్‌ ఎంత బాగా చేస్తే అంత బాగా ఆదరిస్తారు. జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారు. వారికి అనిపించింది చెబుతారు’ అని ప్రభాకర్‌ వ్యాఖ్యానించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement