Prabhakar
-
నా స్థానంలో వేరేవాళ్లుంటే చచ్చిపోయేవాళ్లు: చంద్రహాస్
బుల్లితెర స్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రహాస్ తనపై వస్తున్న నెగెటివిటీ, ట్రోలింగ్‌పై స్పందించాడు. ఇది నా తొలి సినిమా. ఇలా స్టేజీ ఎక్కి మాట్లాడి రెండేళ్లవుతోంది. అప్పుడు నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా అని విపరీతంగా ట్రోల్ చేశారు.తండ్రిని చూసి గర్వపడాలిఅందరిముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరోలా ప్రవర్తించలేను. పైగా నేను తప్పు చేసినప్పుడు తిడితే పడతాను, కానీ ఏమీ చేయకముందే విమర్శిస్తే మాత్రం సహించను. ఇప్పుడు నేను మా నాన్న గురించి డబ్బా కొట్టబోతున్నాను. ఎవరైనా సరే తండ్రిని చూసి గర్వపడాలి. మీ నాన్నను చూసి గర్వపడటం లేదంటే దానంత దురదృష్టం మరొకటి లేదు.ఎవ్వర్నీ వదలనుమా నాన్న బుల్లితెర మెగాస్టార్. ఆయనొక డైరెక్టర్, యాక్టర్, నిర్మాత. వేల ఎపిసోడ్లలో నటించడమే కాకుండా ఎన్నో షోస్ చేశాడు. మా నాన్న గొప్ప హీరో కాబట్టి నాకు యాటిట్యూడ్ ఉంటుంది. నన్ను తిట్టినవారే ఈ రామ్‌నగర్ బన్నీ మూవీ చూసి పాజిటివ్‌గా మారతారని అనుకుంటున్నాను. తర్వాతి సినిమాకు మరికొందర్ని పాజిటివ్‌గా మారుస్తా.. అలా నన్ను నెగెటివ్‌గా చూస్తున్నవాళ్లందరినీ పాజటివ్‌గా మార్చేవరకు వదలను.ఎంకరేజ్ చేయండినాలాంటివాడు కనక హిట్టు కొట్టాడంటే ఈ జనరేషన్‌కు పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడినవుతాను. రేపు పొద్దున థియటర్లో యాటిట్యూడ్ స్టార్ అన్న టైటిల్ పడగానే.. మీరందరూ అరిచి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. నా స్నేహితులు చాలామంది నా స్థానంలో వాళ్లుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్లమని చెప్పారు. అది తప్పు, నాపై ఎంత దాడి చేసినా సరే.. నాకలాంటి ఆలోచనలు రావు. ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోను, నా పని నేను చేసుకుంటూ పోతాను అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. -
ఆటిట్యూడ్ స్టార్ 'చంద్రహాస్' సినిమా ఫస్ట్ లుక్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'రామ్ నగర్ బన్నీ'. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, పొడకండ ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌లో 'రామ్ నగర్ బన్నీ' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా హీరో చంద్రహాస్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అందజేశారు .తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..'ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి నాకు చెప్పారు. ఆయన పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఇందులో హీరోగా నటిస్తున్న చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా.' అని స్పీకర్ తెలిపారు.'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ మాట్లాడుతూ .. మా "రామ్ నగర్ బన్నీ" ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం వరద బాధితుల సహాయార్థం అందిస్తాం.' అని ఆయన తెలిపారు. -
అచ్చెన్నకు ఎమోషన్.. అన్నయ్యకు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ‘‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాగాలు ఆలపిస్తుంటే.. ఆ ఎమోషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ అన్నయ్యకు ప్రమోషన్ ఇచ్చేందుకు ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు. అచ్చెన్న అన్నయ్య కింజరాపు ప్రభాకర్ నాయుడు ప్రస్తుతం విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) డీఎస్పీగా ఉన్నారు. ఆయన ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అంతలోగానే ఆయనకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ మంత్రిగారి అన్నయ్యకు ‘రిటైర్మెంట్ గిఫ్ట్’ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అదనపు ఎస్పీ పోస్టులకు 30 మంది డీఎస్పీలు అర్హులుగా ఉన్నారు. వారి పదోన్నతుల కోసం పాటించాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మొత్తం పోలీసు శాఖలో అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ 30 మందికి పదోన్నతులు కల్పించడానికి అనుమతించలేమని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం అవసరం లేకున్నా సరే పదోన్నతులు కల్పిస్తే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం పడుతుందని కూడా పేర్కొంది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు.. అటు పోలీసు శాఖ ఇటు ఆర్థిక శాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రిటైరయ్యేలోగా తన అన్నయ్యకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి0దేనని పట్టుబట్టారు. దాంతో అదనపు ఎస్పీల పద్నోనతుల జాబితాను 22 మందికి పరిమితం చేస్తూ మరో జాబితాను రూపొందించారు. కొత్త జాబితాలో 22వ పేరు కింజరాపు ప్రభాకర్‌దే కావడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆమోదం తరువాత చూసుకుందాం.. ముందు ఆ జాబితాలోని వారికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసు శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా కూడా ఊపారు. దాంతో ఒకటి రెండు రోజుల్లోనే కింజరాపు ప్రభాకర్‌తో సహా ఆ జాబితాలోని 22 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే భారత్‌కు వస్తానన్న ప్రభాకర్‌రావు.. గత నెలలోనే భారత్ రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోక తప్పలేదని లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. -
ఆ రెండు గంటల్లో ఏం జరిగింది?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/చింతకాని/హైదరాబాద్: : ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్(45) సోమవారం భూవివాదంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకున్నారా.. ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించిరా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన చెబుతున్న మాటలను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీయడంతో పురుగుల మందు తాగిన సమయాన వారు అక్కడే ఉన్నారని భావిస్తున్నారు. ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విచారణ జరిపి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. దీంతో అదికారులు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే, ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ముదిరెడ్డి కోదండరెడ్డి కూడా చింతకాని తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడారు. వివరాలు ఆరా తీయడమే కాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే వరకు స్థానిక అధికారులు ఏం చేశారని ప్రశ్నించినట్టు సమాచారం.వీడియో తీసి... వాట్సాప్ గ్రూపులో పెట్టి కలెక్టరేట్ వద్ద ప్రభాకర్ తన తండ్రిని వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన ఇద్దరు ప్రభాకర్‌ను బయటకు తీసుకెళ్లి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయించాక, ఆయన వివరిస్తుండగా వీడియో తీసినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3.39 గంటలకు తీసిన వీడియోను సాయంత్రం 5.40 గంటలకు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. దీంతో మధ్య రెండు గంటల సమయంలో ఏం జరిగిందో తేలాల్సి ఉంది. అయితే, రైతు ప్రభాకర్ ఆత్మహత్యలో రాజకీయకుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ తొలుత సమస్యను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు విన్నవించాడు. కాంగ్రెస్ నాయకులు అనుకూలంగా మాట్లాడకపోవటంతో బీఆర్ఎస్ నాయకుల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను అవమాన పరచాలనే ఉద్దేశంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకునేలా కొందరు ప్రేరేపించారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీడియో తీసినట్టు భావిస్తున్న గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.విచారణ చేయిస్తున్నాం..ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌ను ఈ విషయమై ఆరా తీయగా రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నామని తెలిపారు. ఆయన తండ్రి ఫిర్యా దుతో ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పా రు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎవరు బాధ్యులుగా ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలనడంతో..బోజడ్ల ప్రభాకర్ తన తండ్రి పెదవీరయ్యతో కలిసి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. కలెక్టర్ లేకపోవడం, అంతకు ముందే సమయం అయిపోవడంతో అధికారులు వెళ్లిపోగా సిబ్బందికి ఫిర్యాదు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాకర్ ఓ మామిడితోటలో వీడియోలో పురుగుల మందు డబ్బా చూపిస్తూ మాట్లాడాక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ వీడియోలో తనకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్లు పేర్కొనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా వీడియోలో ప్రభాకర్ కన్నీటిపర్యంతమవుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభాకర్ కలెక్టరేట్‌కు ఎప్పుడు వచ్చాడు, ఆయనతో ఎవరెవరు ఉన్నారు, మండల స్థాయిలో అధికారులను కలిసినా ఎందుకు పరిష్కారం చూపలేదనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. -
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాజేంద్రనగర్: గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. సన్‌సిటీ బండ్లగూడ జాగీర్‌లోని ఓ సూపర్ మార్కెట్ సమీపంలో గురువారం మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్ హోకం (21), మధ్యప్రదేశ్ శివుపురి గ్వాలియర్ ప్రాంతానికి చెందిన అనుభవ్ సక్సేనా (24)లు బ్యాగ్‌తో ప్యాసింజర్ ఆటోదిగి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.రాఘవేందర్, కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. తాము ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. ఎండీఎం డ్రగ్స్‌ను ఐటీ, ఈవెంట్ మేనేజర్లకు విక్రయిస్తున్నామని తెలిపా రు. తాము చంద్రపూర్‌కు చెందిన సాబేర్ అనే వ్యక్తి ద్వారా కొరియర్ తెప్పించుకొని ఎక్కువ ధరలకు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్ విలువ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందన్నారు. -
జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం
-
నిన్నే నమ్ముకున్నాం సారూ.. మరొక్కమారు నాకు చాన్స్ ఇవ్వరూ ప్లీజ్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్‌చౌదరికి పార్టీ అధిష్టానం చుక్కలు చూపిస్తోంది. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన ఆయన 2019లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీచేయాలని తీవ్రంగా యత్నిస్తున్న చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభాకర్ చౌదరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీకి కష్టపడిన తనకు ఈ దుస్థితి ఏమిటని కార్యకర్తల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు గనుక టికెట్ ఇవ్వకపోతే ప్రభాకర్ చౌదరి రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని అనుచరులు వాపోతున్నారు. పరిగణనలోకి కూడా తీసుకోలేదు గత రెండు మాసాలుగా టికెట్ కోసం యత్నిస్తున్న ప్రభాకర్ చౌదరికి ఏ దశలోనూ హామీ లభించలేదు. పైగా ఈయన్ను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అర్బన్ నియోజకవర్గంలో పాతిక వేలకు పైగా బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్టు అంచనా. దీంతో జనసేనకు ఇస్తే బావుంటుందనేది చంద్రబాబు ఆలోచన. 2019 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో టీడీపీ కోసం కృషి చేస్తే ఉన్నట్టుండి జనసేనకు టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏమిటని చౌదరి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గనుక టికెట్ తెచ్చుకోలేకపోతే రాజకీయ సన్యాసం తప్పదేమోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందని తెలుస్తోంది. తేల్చుకునేందుకు విజయవాడకెళ్లిన చౌదరి వాడుకుని వదిలేయడమంటే చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే. ఈ కోవలోనే బీకే పార్థసారథి, జితేందర్‌గౌడ్ లాంటి వాళ్లందరూ బలయ్యారు. తాజాగా ప్రభాకర్ చౌదరి వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు సొంత పార్టీలోనే ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకించే వాళ్లు తానా అంటుంటే.. వీరికి వంతపాడుతూ అధిష్టానం తందానా అంటోంది. జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు ప్రభాకర్ చౌదరిపై ఏదో ఒక రకంగా రోజూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు దీన్ని ఎదుర్కోలేక తంటాలు పడుతుంటే మరోవైపు అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేదు. ఇప్పుడాయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ పరిస్థితి గందరగోళంగా ఉంది. పొత్తులో ఏ పార్టీకి సీటిస్తారో, ఎవరు అభ్యర్థో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ప్రభాకర్ చౌదరి విజయవాడకు బయలుదేరినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
తళుకుమను తార...
‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్లో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ జరుపుకుంటోంది. జాన్ భూషణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తళుకు తళుకుమను తార.. కులుకులొలుకు సితార...’ అంటూ సాగే సెకండ్ లిరికల్ వీడియో సాంగ్‌ని నటుడు సాయి కుమార్ రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ‘‘రౌద్ర రూపాయ నమః’’ చాలా పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు సాయికుమార్ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రావుల రమేష్. ‘‘ప్రభాకర్‌గారి నటన మా చిత్రానికి ఆయువుపట్టు’’ అన్నారు పాలిక్. ఈ కార్యక్రమంలో నటుడు రఘు, రచయిత తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి కెమెరా: గిరి–వెంకట్. -
నా గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య చాలా బాధపడింది: సీరియల్ నటుడు ప్రభాకర్
సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల నుంచి పలు ఛానెల్స్‌లో సీరియల్స్‌తో అలరిస్తున్నాడు. తాజాగా ఓ షోకి భార్యతో సహా వచ్చిన ప్రభాకర్.. తన ప్రేమ-పెళ్లి విషయాల గురించి మాట్లాడాడు. తన గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య బాధపడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఏం జరిగింది? ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ఈ షోలో ప్రభాకర్-మలయాజ పెళ్లి ఫొటోల్ని స్క్రీన్‌పై ప్లే చేయగానే.. తమది దొంగపెళ్లి అని, ఆర్య సమాజ్‌లో ఏడడుగులు వేశామని అన్నాడు. అయితే ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్.. పెళ్లిలో కన్యాదానం చేశాడని అప్పటి సంగతుల్ని ప్రభాకర్ గుర్తుచేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) గర్ల్‌ఫ్రెండ్ వల్ల భార్య.. 'నాకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆ విషయంలో నా భార్య చాలా బాధపడింది. ఆ సందర్భాన్ని ఎలాగోలా సరిచేసుకుని మనస్ఫూర్తిగా నా భార్యకు సారీ చెప్పాను. అయితే నేను సారీ చెప్పడం గొప్పకాదు. తను నన్ను క్షమించడం గొప్ప విషయం' అని భార్య మలయజ గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆమె బుగ్గపై అందరూ చూస్తుండగానే ముద్దుపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్‌గా మారింది. ఇకపోతే ప్రభాకర్ పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండగా, అతడి భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అలానే ప్రభాకర్ కొడుకు సుహాస్ ఆటిట్యూడ్ స్టార్ గా ఇప్పటికే చాలామందికి పరిచయం. కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) -
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ మూకల దాడి
పుంగనూరు(చిత్తూరు జిల్లా) : టీడీపీ శ్రేణులు మళ్లీ బరితెగించాయి. వైఎస్సార్సీపీ నేత ఇంట్లోకి జొరపడి రాళ్లు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయర్చాయి. పుంగనూరు మండల వైస్ ఎంపీపీ సరోజమ్మ, ఆమె భర్త ప్రభాకర్‌నాయక్ మండలంలోని పాళ్యెంపల్లెలో ఉంటున్నారు. ఈ నెల 4న చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో మండలంలోని జెడీ తాండాకు చెందిన టీడీపీ నేత కృష్ణానాయక్, ఆయన కుమారులు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రభాకర్‌నాయక్ తమ ఆచూకీ తెలిపి ఉంటారన్న అనుమానంతో కృష్ణానాయక్ ఆయన కుమారుడు శ్రీనివాసనాయక్, వారి అనుచరులు కలిసి పథకం ప్రకారం ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ప్రభాకర్‌నాయక్ ఇంటిపై దాడి చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ప్రభాకర్నాయక్పై రాళ్లు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన ఆయన బావమరిది మునీంద్రనాయక్పైనా దాడి చేశారు. గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ప్రభాకర్నాయక్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మోహన్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రభాకర్నాయక్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
‘రాజుగారి కోడిపులావ్’ మూవీ రివ్యూ
టైటిల్: రాజుగారి కోడిపులావ్ నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నిర్మాణ సంస్థలు : ఏఎమ్ఎఫ్, కోన సినిమా నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన దర్శకత్వం : శివ కోన సంగీతం : ప్రవీణ్ మని సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు ఎడిటర్ : బసవా- శివ కోన విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘రాజుగారి కోడిపులావ్’కథేంటంటే.. రాజుగారు(ప్రభాకర్) ఓ హోటల్ రన్ చేస్తూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. ఆ చుట్టు పక్కల ఏరియా ప్రజలు రాజుగారి కోడిపులావ్ కోసం ఎగబడేవారు. ఇలా వ్యాపార పరంగా రాజుగారు సంతోషంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా బాధగా ఉండేవాడు. దానికి కారణం తనకు కొడుకు పుడుతాడు అనుకుంటే కూతురు పుట్టడం, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తి. ఈ రెండు కారణాల వల్ల రాజుగారు తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఓ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో ఇంటికే పరిమితం అవుతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత మూడు జంటలు డ్యాని(శివ కోన)- క్యాండీ (ప్రాచి కెథర్), బద్రి(కునాల్ కౌశిక్)-ఆకాంక్ష(నేహాదేష్ పాండే), షారుఖ్(అభిలాష్ బండారి)-ఈషా(రమ్య దినేష్) రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వీరిలో క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ కాలేజీ స్నేహితులు. ఈషా ఐటీ ఎంప్లాయ్. వీరంతా కలిసి కారులో ట్రిప్‌కి బయలుదేరగా మార్తమధ్యలో కారు పాడవుతుంది. దీంతో అడవిలో వీరంతా నడవాల్సి వస్తుంది. అలా ప్రయాణం సాగిస్తున్న ఈ మూడు జంటల్లో అనూహ్యంగా క్యాండీ మరణిస్తుంది. తన మరణానికి కారణం తెలియదు. ఆ మరుసటి రోజే ఈషా కపిపించకుండా పోతుంది. మిగిలిన నలుగురు భయంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ అడవిలో వీరికి దారి దొరక్క తిరుగుతూనే ఉంటారు. చివరకు వీరికి ఆ దట్టమైన అడవిలో ఓ ఇల్లు కనిపిస్తుంది. అందులోకి వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు క్యాండి ఎలా మరణించింది? డ్యానీ ఎవరు? ఫారుఖ్, ఆకాంక్షల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అసలు రాజుగారికి ఈ మూడు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో ‘రాజుగారి కోడిపులావ్’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజుగారి కోడిపులావ్ హోటల్ సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటికే కథ వేరే మలుపు తీసుకుంటుంది. మూడు జంటల పరిచయం.. వారి ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. కథ మొదలైన పది నిమిషాలకే ఆకాంక్ష, ఫారుఖ్ ల మధ్య ఉన్న రిలేషన్ రివీల్ అవుతుంది. అయితే వారు ఎందు ఒకరికోకరు అట్రాక్ట్ అయ్యారో కన్విన్సింగ్ గా ఉంటుంది. గైనకాలజిస్ట్ గా పరిచయం అయిన క్యాండీ లవర్ డ్యాని చాలా హుషారుగా కనిపించే పాత్ర ప్రథమార్థం అంతా చాలా కూల్ గు వెళ్తుంది. ఇక అడవిలోకి వీరు ఎంటర్ అయిన తరువాత కారు ఆగిపోవడంతో అప్పటి వరకు ఉన్న జోష్ మూడ్ ఒక్కసారిగి టెన్షన్ వాతావరణంలోకి వస్తుంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠత ప్రేక్షకుడిలో ఏర్పడుతుంది. ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు చూపించడంతో దాని వెనక ఏదో నేపథ్యం ఉంటుందని అర్థమవుతుంది. క్యాండీ చనిపోయిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ప్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తుంది. డ్యానీ కనిపించకుండా పోవడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతంది. కానీ సెకండాఫ్‌లో ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు.అసలు కథకు రాజుగారికి ఉన్న ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ థ్రిలింగ్కు గురిచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో డ్యాని బాగా హైలెట్ అయింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో శివ కోన ఒదిగిపోయాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పటికీ నటన పరంగా ఎక్కడా తగ్గలేదు. శివ తర్వాత బాగా పండిన పాత్ర ప్రాచి కెథర్. క్యాండి పాత్రలో ప్రాచీ థాకర్ జీవించేసింది.యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. ఆకాంక్ష పాత్రని నేహా న్యాయం చేసింది.కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. కాస్త కన్నింగ్ ఉన్న పాత్ర. చాల సహజంగా నటించారు. రెండు మూడు వేరియేషన్లు చూపించే పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక రాజుగారి పాత్రలో ప్రభాకర్ తెరపై కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే..దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా చూపించాడు. ప్రవీన్ మణీ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'రాజుగారి కోడిపులావ్'.. కొత్త రిలీజ్ డేట్
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజుగారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాతో శివ కోన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు అందరి దృష్టిని ఆకట్టుకొన్నాయి. ట్రైలర్ అయితే 1 మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజు గారి కోడి పులావ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా "వాట్ ద ఫ* ఈజ్ ఆఫ్ కోడిపులావ్" అనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీలో అందరూ కొత్త నటులే అయినప్పటికీ వారి పెర్ఫామెన్స్ తో సినిమాపై ఆసక్తి పెంచుతున్నాడు. ప్రభాకర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. తొలుత జూలై 29న రిలీజ్ ప్లాన్ చేశారు కానీ ఎందులో ఇందులో మార్పు చేశారు. ఆగస్టు 4న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) -
అమెరికాలో ప్రొఫెసర్‌గా వరంగల్ ఆదివాసీ
వరంగల్: కడు పేదరికం.. తినడానికి అన్నం కూడా దొరకని పరిస్థితి. తండ్రి పని చేస్తేనే పూటగడిచేది. లేనిపక్షంలో పస్తులుండడమే. పైగా మారుమూల గ్రామం.. అందులో పాఠశాల కూడా లేని కుగ్రామం. ఇలాంటి తరుణంలో ఎవరికైనా చదువుకోవాలనే ఆలోచనే రాదు. ఏదైనా పని చేసుకుని బతకాలని భావిస్తారు. కానీ అలాంటి వారికి ఈ యువకుడు పూర్తిగా విరుద్ధం. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఒక పక్క సమస్యలతో సహవాసం చేసూ్తనే.. మరో పక్క అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఆయననే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మారుమూల ఏజెన్సీ ఆదివాసీ గ్రామం దొరవారివేంపలి్లకి చెందిన ఈక ప్రభాకర్. తాను ఎంచుకున్న విద్యలో ఖండాంతరాలు దాటి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోవాలో ప్రొఫెసర్‌గా పని చేసేందుకు ఎంపికయ్యారు. ఎర్ర బస్సు కూడా ఎరగని ఈ గ్రామం నుంచి అమెరికాకు వెళ్లడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈక పాపమ్మ–సమ్మయ్య దంపతుల ప్రథమ సంతానం ప్రభాకర్. తన ఎదుగుదల గురించి ఆయన మాటల్లోనే.. ‘పోడు వ్యవసాయం ఆధారంగానే మా కుటుంబ పోషణ గడిచేది. తినడానికే ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామంలో పాఠశాల కూడా లేదు. 1989లో అప్పటి ఐటీడీఎ పీఓ బెస్ట్ అవైలెబుల్ పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. హాస్టల్‌కు వెళ్తే కనీసం అన్నం అయినా సరిగా దొరుకుతుందనుకునే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలోనే రాజేంద్ర కాన్వెంట్ హై స్కూల్లో సీటు వచ్చింది. పాఠశాల చదువులోనే మా తల్లి పాపమ్మ 1997లో మృతి చెందింది. ఈ ఘటనను దిగమింగుకుని పదో తరగతి పూర్తి చేశా. అనంతరం ఇంటర్ ఎల్బీ కళాశాల వరంగల్‌లో, కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో బీజెడ్సీ గ్రూపులో డిగ్రీ పూర్తి చేశా. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో పీజీ పూర్తి చేశా. బెస్ట్ అవైలెబుల్ స్కీం పూర్తయిన తరువాత ఐటీడీఏ నుంచి స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యా. ఆ స్కాలర్ షిప్‌తోనే డిగ్రీ, పీజి పూర్తయింది. 2006 నుంచి 2013 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డి పూర్తి చేశా. 2013 నుంచి 2017 వరకు సీఎస్ఐఆర్ఆర్ఏలో రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశా. ఇదే సమయంలో మండలంలోని ఈశ్వరగూడెం గ్రామానికి చెందిన రవళితో వివాహమైంది. పీహెచ్డీ ఫెలోషిప్‌లో భాగంగా‘టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రిసెర్చ్’లో సంవత్సరం పని చేశా. అనంతరం గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. అక్కడ ప్రొఫెసర్‌గా పని చేసూ్తనే గత సంవత్సరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోనాలో ప్రొఫెసర్‌గా అప్లికేషన్ చేశాను. నాలుగు దఫాలుగా జరిగిన ఇంటర్వూ్యల ఆధారంగా నన్ను ఎంపిక చే సి వీసా ఇచ్చారు. ఈనెల 28న అమెరికాకు వెళ్తు న్నా. ఖండాతరాలు దాటి ప్రొఫెసర్‌గా పనిచేసే అ వకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’. -
బిగ్‌బాస్ 7లో బుల్లితెర ప్రభాకర్? రచ్చ రచ్చే!
బిగ్‌బాస్ 7 టైటిల్ ప్రోమో రాకతోనే సోషల్ మీడియాలో సందడి మొదలైపోయింది. బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడోచ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులు సంబరపడుతున్నారు. ఎక్కువసార్లు బిగ్‌బాస్ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభమైంది. అయితే ఈ సారి మాత్రం అప్పటివరకు ఆగేదే లేదంటూ ప్రీపోన్ అవుతోందట! అంటే ఆగస్టు నెలలోనే బిగ్‌బాస్ 7 షురూ అయిపోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై నెలాఖరు లేదా ఆగస్టు ప్రారంభంలో షో స్టార్ట్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు! ఇప్పటికే ప్రోమో షూట్ కూడా పూర్తవగా, కంటెస్టెంట్ల ఎంపిక ఫైనలైపోయిన వెంటనే బిగ్‌బాస్ 7 గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ షో కోసం బ్యాంకాక్ పిల్ల శ్రావణి.. థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు వచ్చేసింది. బిగ్‌బాస్ కోసమే ఆమె ఇక్కడికి వచ్చిందన్నది నెటిజన్ల అభిప్రాయం. ఈమె పేరు కచ్చితంగా లిస్ట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు బుల్లితెర ప్రభాకర్. టీవీలో ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్‌లో ప్రభాకర్ నటించాడు. వెండితెరపై కొన్ని చిత్రాల్లోనూ మెరిశాడు. 25 ఏళ్లుగా అతడు టాప్ నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇతడిని అభిమానులు ప్రభాకర్‌ను బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకుంటారు. ఇతడుగానీ హౌస్‌లో అడుగుపెడితే రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. ఒకవేళ ప్రభాకర్ నో చెప్తే తన స్థానంలో అతడి కొడుకు చంద్రహాస్ వచ్చినా ఓకే అంటున్నారు. చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే రెడీ అయిన సంగతి తెలిసిందే! ఇతడి టాలెంట్ చూసి మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే మరో రెండు సినిమాల ఆఫర్ వచ్చాయని చెప్పాడు. ఇకపోతే తొలి చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ప్రవర్తన చూసిన జనాలు అతడికి ఆటిట్యూడ్ స్టార్ అన్న ట్యాగ్ కట్టబెట్టారు. ఇతగాడు కానీ వస్తే మీమర్స్‌కు కావాల్సినంత కంటెంట్ దొరకడం ఖాయం! మరి ఈ తండ్రీకొడుకుల్లో ఎవరైనా ఒకరు వస్తారా? లేదా? అనేది చూడాలి! చదవండి: ఆ హీరో ఇంటికి రమ్మన్నాడు.. వెళ్లకుండా తప్పు చేశా: హీరోయిన్ ఆదిపురుష్ కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువే! -
వడ్డించడానికి రెడీగా ఉన్న 'రాజుగారి కోడిపులావ్'..!
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజు గారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. (ఇది చదవండి: కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ రిలీజ్.. కానీ డైరెక్టర్ మిస్సింగ్!) 'రాజు గారి కోడిపులావ్' చిత్రంలో నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర నటుడు ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ మనీ సంగీతమందించారు. (ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
ఓ వయ్యారి వన్నెలాడి..
శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేశ్ పాండే ముఖ్య తారలుగా, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. శివకోన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. అనిల్ మోదుగ మరో నిర్మాత. కాగా ఈ సినిమాలోని ‘సునో సునామీ’ పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు ప్రవీణ్ మని స్వరపరచిన ఈ పాటకు మల్లిక్ వల్లభ లిరిక్స్ అందించగా ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్ పాడారు. -
ఏనుగు పిల్లని బలి ఇస్తారా?
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మక చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్‌గా విడుదలవుతోంది. (ఇదీ చదవండి: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను ఎందుకు కలుస్తానంటే: అమితాబ్) ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'బాహుబలి ప్రభాకర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్రతి సీన్ అడ్వెంచరస్‌గా ఆహ్లాదకరంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చి దిద్దాము. ఈ నెల 9న విడుదలవుతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. (ఇదీ చదవండి: శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్‌కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్) -
యూత్‌ని ఆకట్టుకునేలా ‘రాజుగారి కోడిపులావ్’
శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రాజు గారి కోడిపులావ్’. కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శివ కోన, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రాజు గారి కోడిపులావ్ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ అలాగే సినిమా ఔట్ లైన్ కూడా తెలిపే ఒక వీడియోను విడుదల చేశారు. ‘రీయూనిన్ తో కలిసిన 6 మంది స్నేహితులు.. సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆ సంఘటనల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారు చేసే పోరాటమే ‘రాజుగారి కోడిపులావ్’. యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో ఈ మూవీని గ్రాండ్‌గా తెరకెక్కించాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆ స్టార్ హీరో మూడు పెళ్లిళ్ల విషయం దాచి నాతో పెళ్లి, గర్భం..: నటి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన అంజు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు చేసింది. హీరోయిన్‌గానూ చేసిన ఆమె తర్వాత బోల్డ్ పాత్రల్లో ఎక్కువగా నటించింది. 17 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే తలకిందులు చేసింది. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయారు? వంటి కారణాల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. 'మా అమ్మ నేను ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్ను వెంటపెట్టుకుని ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ డైరెక్టర్ మహేంద్రన్ సర్ చూసి నన్ను సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తీసుకున్నాడు. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను. కానీ అమ్మానాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు నేను కన్నడ సినిమా చేయడానికి బెంగళూరు వెళ్లాను. అప్పుడు కన్నడ స్టార్ హీరో టైగర్ ప్రభాకర్ నన్ను చూసి ఇష్టపడ్డారు. నా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఆయనకు అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు మాత్రమే! నేనిప్పుడు పెళ్లికి రెడీగా లేనని చెప్పాను. అయినా సరే నా వెంటపడ్డాడు. దీంతో అమ్మానాన్నను అడిగి చెప్తానన్నాను. ప్రభాకర్ వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది.. అతడిని చూడగానే అమ్మానాన్న ఈ పెళ్లే వద్దన్నారు. కానీ వాళ్ల మాట వినకుండా ప్రభాకరనే కావాలంటూ ఇంట్లో చెప్పాపెట్టకుండా తన దగ్గరికి వెళ్లిపోయాను. తనను ఎంతో నమ్మాను. తీరా ఆయన ఇంటికి వెళ్లాక అప్పటికే ప్రభాకర్‌కు మూడు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నారని తెలిసింది. దాని గురించి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు చాలా బాధేసింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయాను. పైగా నేను గర్భిణిని. అయినా సరే అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటికి వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే లాకర్లో పెట్టి ఒంటిచేత్తో తిరిగొచ్చేశాను. ఆ ఇంట్లో నుంచి వెళ్లేపోయేటప్పుడు ప్రభాకర్‌తో ఒక్కటే మాట చెప్పాను.. నన్ను చాలా బ్యాడ్ చేశావు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. ఇంకెన్నడూ ఈ ఇంటి గడప తొక్కను. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చివరిసారిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత చాలా కాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయాను. నెమ్మదిగా దాని నుంచి తేరుకుని తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొనసాగుతున్నాను' అని చెప్పుకొచ్చింది అంజు. -
వేముల ప్రభాకర్‌కు కీర్తి పురస్కారం
జగిత్యాల: పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత వేముల ప్రభాకర్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. వేముల ప్రభాకర్ శ్రీవరకవి భూమాగౌడుశ్రీ నవల రచనకు గాను కీర్తి పురస్కారం ప్రకటించగా ఈనెల 28న అందుకోనున్నారు. ఇప్పటివరకు మూడు నవలలు, ఒక కథ సంపుటి, ఆరు కవిత సంపుటిలు, స్వీయరచనతో పాటు రెండు సాహితీ గ్రంథాలు, ఒక మాసపత్రిక వారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఈ సందర్భంగా వేముల ప్రభాకర్‌ను సాహితీవేత్తలు, విద్యావేత్తలు, రచయితలు అభినందించారు. -
మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా!
ఏ ప్రభుత్వానికైనా ఆబ్కారి ఆదాయం ముఖ్యమైందే. తెలుగు రాష్ట్రాల్లో కల్లుగీత అనుమతులు, అమ్మకాలు మొదట్లో వేలం ద్వారా జరిగేవి. తర్వాత కల్లుగీత సహకార సంఘాలు ఏర్పాటుచేసారు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదని వాటిని కుదించి దున్నే వాడికే భూమి అన్నట్లుగా గీసేవాడికే చెట్టు Tree for Tapper అన్నారు. పథకం ఏదైనా, ఏ పార్టీ అధికారం లోనున్నా ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకుండా చూసే పని చేసేది ఎక్సైజ్ శాఖ, వాళ్ళ పనితీరుకు అదే గీటురాయి. ప్రభుత్వ ఖజానా నిండినంత కాలం ఆ శాఖ అవినీతి గురించి పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అబ్కారి శాఖలో మామూళ్లు మామూలే! కాదు కూడదు అంటే తప్పు చేసినా చేయకున్నా కల్తీకల్లు కేసులు తప్పవని గీత కార్మికులకు తెలుసు. హైదరాబాద్ నగర శివార్లలో ముఖ్యంగా దూల్ పేట ప్రాంతంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, అమ్మకాలు జరిగిన రోజుల్లో తమ కల్లు అమ్మకాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని గీత సంఘాలు రోడ్డెక్కిన రోజుల్లో మాచర్ల జగన్నాధం గారి' పరిశ్రమ' పత్రికలో ' కల్తీ సారా కల్పతరువు రాజధానిలో దూల్ పేట ' పేర నేనొక వ్యాసం రాస్తూ అబ్కారి శాఖ, స్థానిక పోలీస్ సిబ్బంది అవినీతి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అది 22 అక్టోబర్ 1974 సంచికలో ప్రచురితమై, అంచెలంచెలుగా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోనున్న అధికారులు అనధికారుల దృష్టిలో పడి చివరికి విచారణకు దారితీసింది. నేనా రోజుల్లో హైదరాబాద్ లోని ఒక సహకార సంస్థలో ఉద్యోగం చేస్తూ చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండేవాణ్ణి. తెల్లవారక ముందే ఒక పోలీస్ జవాన్ నన్ను వెతుక్కుంటూ వచ్చి గిట్టనివాడు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు నాకు సమ్మన్స్ ఇచ్చి పోలీస్ కమీషనర్ స్థాయి అధికారి ముందు హాజరు కమ్మని చెప్పి వెళ్ళాడు. నేను అద్దెకుంటున్న ఇంటి యజమానే కాదు కొత్తగా కాపురానికి వచ్చిన మా ఆవిడ కూడా భయపడిపోయింది నేనేం నేరం చేసానో? అని. నిజం చెప్పాలంటే నేనూ గాబరాపడిపోయాను, ఎందుకంటే అవి ఎమర్జెన్సీ రోజులు. కేంద్రంలో ఇందిరా గాంధి రాష్ట్రంలో జలగం వెంగలరావు గారల పాలన నడుస్తున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట మాట్లాడినా జైలుకూడు తినాల్సిన పరిస్థితులు. ఎందుకైనా మంచిదని సలహా కోసం ముందుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక బంధువు దగ్గరికి వెళ్ళాను. అతను అంతా విని 'అబ్కారి శాఖ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుంది, పోలీస్ ప్రభుత్వ పీఠాలను కాపాడుతుంది. ఈ రెండు శాఖలను విమర్శించడానికి మీకు ఎన్ని గుండెలండీ 'అన్నాడు. నాకున్న ఒక్క గుండె అయన మాటలతో దడదడలాడిపోయింది. 'లాభంలేదు, ఎవరన్నా లీడర్‌ను తీసుకొని వెళ్ళండి, రోజులు బాగాలేవు! 'అని చివరగా సలహా కూడా ఇచ్చి పంపాడు. అసలు నాయకులే లేని రోజులవి, ఉన్నవాళ్లు జైలు ఊచలు లెక్కబెడుతున్నారాయె. అధికారి మంచివాడైతే ఆయనే అర్థం చేసుకుంటాడని పోలీస్ కమీషనర్ గారి కార్యాలయంలో ఒక్కణ్ణే విచారణకు హాజరయ్యాను. ఆయనో యువఅధికారి, అదృష్టవశాత్తు సౌమ్యుడు కూడా. ఒక ఫైల్ తీసి నా ముందు పెట్టాడు. అందులో దూల్ పేట గుడుంబా వ్యాసమే కాకుండా అదే పరిశ్రమ పత్రికలో నేను రాసిన 'దేశ రాజధానిలో నల్లమందు వ్యాపారం విచ్చలవిడి (ఆనంద ఉగాది సంచిక )' మత్తు పదార్థాలకు బానిసలవుతున్న మన విద్యార్థులు (18జూన్ 1974 సంచిక ), పోలీసులను దొంగలుగా మారుస్తున్న తమిళనాడు ప్రోహిభిషన్ చట్టం (31డిసెంబర్ 1974 సంచిక )కాక మరో మూడు వ్యాసాల పేపర్ కటింంగ్స్ ఉన్నాయి. ' మీరు హైదరాబాద్ లో ఉన్నారు, దూల్ పేట వ్యాపారం గురించి తెలిసుండొచ్చు, గీత కార్మికుల కుటుంబం నుండి వచ్చారు, కల్లు గురించి రాసుంటారు కానీ డ్రగ్స్ గురించి ఎలా రాస్తున్నారు?' అన్నాడాయన. జాతీయ స్థాయి పత్రికల్లో వచ్చిన వార్తలే నా వ్యాసాలకు ఆధార మన్నాను. 'చట్ట సభల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజా ప్రతినిధులు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్లకు రక్షణ ఉంటుంది,కానీ జర్నలిస్ట్ రచనలు పక్కా ఆధారాలు లేందే రాస్తే ఇబ్బందుల్లో పడతారు 'అన్నాడు. నిజమే కానీ జర్నలిస్టులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయలేరు కదా! వాళ్ళిచ్చిన క్లూను ప్రభుత్వం వాడుకొని సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటికొస్తాయి అన్నాను నేను. ' మీ వ్యాసల్లోనున్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ ను ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని పిలిపించే అవసరం రాకుండా చూసుకొండి 'అన్నాడు. నేను బతుకుజీవుడా! అని బయట పడ్డాను. -వేముల ప్రభాకర్ -
గ్రాండ్ సాంగ్.. భారీ ఫైట్
‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ (పాలిక్ శ్రీనివాసా చారి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రమేష్ రావుల నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నాం. ప్రభాకర్‌పై ఓ పాటను గ్రాండ్‌గా చిత్రీకరించాం. ఇప్పుడు రవి మాస్టర్ సారథ్యంలో ప్రభాకర్‌పై భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నాం. వింద్యా రెడ్డి మంచి కథ అందించారు. జాన్ భూషణ్ మూడు అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు పాలిక్. ‘‘మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు రమేష్ రావుల. -
Telangana: ఆ కవుల గురించి మీకు తెలుసా?
'ఎంతో మంది చనిపోతున్నారు అందులో కొద్ది మంది మాత్రమే తమలోని అధ్బుతమైన ఆలోచనలు ఈ లోకానికి పంచిపోతున్నారు ' అంటాడు టాడ్ హెన్రీ (Die Empty ) తమ వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టనష్టాలైనా భరించి అలా సమాధిలోకి వెళ్ళడానికి ముందే రచనల ద్వారా తమలోని ప్రతిభా ఉత్పత్తులను పంచిపోయిన కవులు రచయితలు తెలంగాణలో ఎందరో ఉన్నారు. వేల సంవత్సరాలు గడిచినా ప్రజల్లో ఈనాటికీ ఆ సాహిత్యం నిలిచివున్నా వారి జ్ఞాపకాలే చెదిరిపోతున్నాయి,వారి సమాధులు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కన్నడ ఆదికవి అనిపించుకున్న పంప ( 902-975 AD) అంతటి కవి సమాధి నిజామాబాదు బోధన్‌లో నామమాత్రంగా మిగిలిపోయింది. తెలుగు ఆదికవి అంటున్న నన్నయ కాలానికే చెందినవాడుగా, కరీంనగర్ వేములవాడ ప్రాంతీయుడుగా భావిస్తున్న చాటుపద్య కవి వేములవాడ భీమకవికి అక్కడ చిన్న స్మారకం కూడా పెట్టకుండా చాటుకే ఉంచేసారు. కాకతీయుల కాలంనాటి శాసనకవి నగునూరు పాలకుడు ఎన్నో దేవాలయాలు నిర్మించిన వెల్లంకి గంగాధరుడిని పట్టించుకున్న వారే లేరు. తెలుగులో తొలి వచన కావ్యకర్త, వచన సంకీర్తనా వాంజ్ఞయానికి మూలపురుషుడు అనిపించుకున్న సింహగిరి వచనాల కృష్ణమాచార్య సంతూరు తెలంగాణ వాడే అయినా ఆయన పేరిట ఏదీ ఎక్కడా లేదు. మహా పండితుడు,సంస్కృత పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసి ప్రసిద్ధుడైన కోలాచలం మల్లినాధ సూరి (14వ శతాబ్దం) మెదక్ జిల్లా కొలిచెలమ /కొల్చారం వాడే అయినా ఆయనను తలుచుకునే పని ప్రభుత్వం చేసింది లేదు. భాగవతకర్త పోతన అంతటి మహానుభావుడికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో బమ్మెరలో తలపెట్టిన 'పోతన స్మృతివనం' రూపురేఖలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఇటీవల ఆ గ్రామానికి వెళ్ళివచ్చిన సాహితీ మిత్రుడు తుమ్మూరి రామ్మోహన్ రావు గారు వాపోయారు. తుమ్మూరి స్వగ్రామం కరీంనగర్ జిల్లా ఎలగందులకు చెందిన పూర్వకవి, పోతనామాత్యుని శిష్యుడు, భాగవతంలోని ఏకాదశ ద్వాదశ స్కందాలను రచించిన వెలిగందుల నారయకవి స్మారకం వంటిదేదీ ఆ గ్రామంలో ఈనాటికీ లేదని వారు చెబుతుంటే అశ్చర్యం వేసింది. ప్రతియేటా మాతృభాషా దినోత్సవాలు మొక్కుబడిగా జరపడం కాదు ఆ భాషను నిలబెట్టడానికి తమ ప్రాణాలను దారపోసిన కవులు రచయితలను తలుచుకోవడం అవసరం. -వేముల ప్రభాకర్, అమెరికా నుంచి