సీపీఐ పేదల పక్షాన పోరాడుతోందని, ప్రభుత్వ నిరంకుశవైఖరిని ఎండగడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. మండలంలోని భీమోలులో మంగళవారం ఆందోళన కారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడతాం
Sep 5 2017 10:47 PM | Updated on Sep 12 2017 1:57 AM
	గోపాలపురం: సీపీఐ పేదల పక్షాన పోరాడుతోందని, ప్రభుత్వ నిరంకుశవైఖరిని ఎండగడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. మండలంలోని భీమోలులో మంగళవారం ఆందోళన కారులతో ఆయన సమావేశం నిర్వహించారు. 35 సంవత్సరాలుగా పట్టాలు పొంది భూమి సాగులో ఉన్న పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. బినాబీ కౌలు దారులను సృష్టించి కోర్టును అడ్డుపెట్టుకుని భూములను లాక్కోవాలని చూస్తున్న అధికార పార్టీ నాయకులకు తగిన బుద్దిచెబుతామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ భీమోలు భూసమస్యపై రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాకను గమనించి నాయకులను నిర్బంధించడం చరిత్రలో మొట్టమొదటి సారన్నారు. నాయకులు బండి వెంకటేశ్వరరావు, వైట్ల విద్యాదరరావు,జెవి నరసింహారావు, కాకులపాటి వెంకట్రావు, దోశమ్మ పట్టాదారులు పాల్గొన్నారు. 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	ప్రభుత్వ నిరంకుశవైఖరిని ఎండగడతాం 
	ఏలూరు (సెంట్రల్): సామాజిక హక్కుల వేదిక, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం స్థానిక వసంతమహల్ సెంటర్ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం  జరగనున్నట్లు సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ డేగా ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమానికి  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
