గ్రాండ్‌ సాంగ్‌.. భారీ ఫైట్‌ | bahubali prabhakar movie shooting in hyderabad | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌ సాంగ్‌.. భారీ ఫైట్‌

Feb 24 2023 3:01 AM | Updated on Feb 24 2023 3:33 AM

bahubali prabhakar movie shooting in hyderabad - Sakshi

‘బాహుబలి’ ప్రభాకర్‌ ప్రధాన పాత్రలో పాలిక్‌ (పాలిక్‌ శ్రీనివాసా చారి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రమేష్‌ రావుల నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘బాహుబలి’ ప్రభాకర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఫైట్‌ సీన్‌ షూటింగ్‌ జరుగుతోంది’’ అన్నారు.

‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీగా రూపొందిస్తున్నాం. ప్రభాకర్‌పై ఓ పాటను గ్రాండ్‌గా చిత్రీకరించాం. ఇప్పుడు రవి మాస్టర్‌ సారథ్యంలో ప్రభాకర్‌పై భారీ ఫైట్‌ చిత్రీకరిస్తున్నాం. వింద్యా రెడ్డి మంచి కథ అందించారు. జాన్‌ భూషణ్‌ మూడు అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు పాలిక్‌. ‘‘మార్చిలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు రమేష్‌ రావుల.  
 

Advertisement
 
Advertisement
Advertisement