ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్‌

Debutant Subbu Vedula Raahu Teaser - Sakshi

బ్యాడ్‌ టైమ్‌లో బ్యాడ్‌ ప్లేస్‌లో ఓ అమ్మాయి చిక్కుకుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రాహు’. కృతి గార్గ్, అభిరామ్‌ వర్మ, కాలకేయ ప్రభాకర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏవిఆర్‌ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. ఈ చిత్ర టీజ‌ర్ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ లాబ్స్‌లో ఘనంగా జరిగింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు సుబ్బు మాట్లాడుతూ... ‘నేను ఈ ప్రొఫెష‌న్‌లోకి రాక‌ముందు ఆర్కిటెక్ గా ప‌ని చేసేవాడ్ని ఒక ఫొటో వంద మాట‌లు చెపుతుంది అన్నట్లు ఒక సినిమా వెయ్యి మాట‌ల‌ను చెపుతుంది. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన మా ప్రొడ్యూస‌ర్స్‌కి నా ప్రత్యేక కృత‌జ్ఞత‌లు. అభిరామ్, కృతిక చాలా బాగా న‌టించారు. మా ఎడిట‌ర్ అమ‌ర్ చాలా బాగా ఎడిట్ చేశారు. నాకు ఈ జోన‌ర్ చాలా కంఫ‌ర్ట్ అనిపించింది’అన్నారు.

ప్రొడ్యూస‌ర్ స్వామి మ‌ట్లాడుతూ... ‘మాకు సినిమా గురించి ఏమీ తెలియ‌దు. సుబ్బుగారు వ‌చ్చి క‌థ చెప్పారు. క‌థ న‌చ్చి ఆయ‌న‌తో క‌లిసి మ‌రో ముగ్గురం మొత్తం న‌లుగురం క‌లిసి ఈ సినిమాని నిర్మించి ఇంత దూరం తీసుకువ‌చ్చాం. ఇక దేవుడి పైనే భారం వేశాం’ అన్నారు. హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ... ‘ముందుగా నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శక నిర్మాత‌ల‌కు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు. నాతో కలిసి ఈ సినిమా న‌టించిన అంద‌రూ మంచి వారు. యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు.

హీరో అభిరామ్ మాట్లాడుతూ... ‘సుబ్బుగారికి ప్రొడ్యూస‌ర్స్‌కి నా థ్యాంక్స్‌. ఈ క‌థ విని న‌చ్చి చేశాను. కృతికి కూడా కృత‌జ్ఞత‌లు. మ‌మ్మల్ని ఆశీర్వదించ‌డానికి వ‌చ్చిన బి.వి.ఎస్‌.ఎన్‌గారికి, మ‌ధుర‌ శ్రీ‌ధ‌ర్‌గారికి నా ప్రత్యేక కృత‌జ్ఞత‌లు’ అన్నారు. 

బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ... ‘ఒక థ్రిల్లింగ్ చిత్రాన్ని ఇంత దూరం తీసుకురావ‌డ‌మే చాలా క‌ష్టం. షూటింగ్ వ‌ర‌కు తీసుకువెళ్ళాక నాలాంటి వారు కొన్ని మార్పులు చెపుతారు కొంచెం, కామెడీ యాడ్ చెయ్యమ‌ని,  కొన్ని మాట‌ల‌ని, కొంత ల‌వ్ యాడ్ చెయ్యమ‌ని ఇలా అంటుంటారు. కాని వీళ్ళు అమెరికా నుండి వ‌చ్చిన ఒక ద‌ర్శకుడిని న‌మ్మి ఈ అవ‌కాశం ఇవ్వడం. ఈయ‌న వాళ్ళని న‌మ్మించ‌డం చాలా గ్రేట్ వారిద్దరికి ముందుగా అభినందనలు. చాలా మంది అనుకుంటారు విదేశాల్లో చ‌దువుకుని వ‌స్తారు వీళ్ళకు సినిమాల ఏమి తెలుసు అని. కాని శేఖ‌ర్‌క‌మ్ముల‌, అడ‌విశేషు ఇలా చాలా మంది విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళే ఉన్నారు’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top